Virat Kohli | ఐపీఎల్ 2026 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన కోహ్లి.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
Virat Kohli | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మేరకు కోహ్లి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
Virat Kohli | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి త్వరలో జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మేరకు కోహ్లి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. డిఫెండింగ్ చాంపియన్స్ ఆర్‌సీబీ ఈసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ప్లేయర్లు సైతం ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు. ఇక కోహ్లి ప్రాక్టీస్ వీడియోను చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లతో స్పందిస్తున్నారు. కోహ్లి ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధమవుతున్న క్రమంలో బ్యాటింగ్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు వీడియోలో కనిపించింది.
గత సీజన్‌లో కోహ్లి మెరుగైన ప్రదర్శన..
ఐపీఎల్ చరిత్రలో కోహ్లి అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 267 మ్యాచ్‌లు, 259 ఇన్నింగ్స్‌లలో అతను మొత్తం 8661 పరుగులు సాధించాడు. కోహ్లి సగటు 39.54 కాగా స్ట్రైక్ రేట్ 132.85గా ఉంది. టోర్నమెంట్ చరిత్రలో అతను 8 శతకాలు, 63 అర్ధశతకాలు సాధించాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో కూడా కోహ్లి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 657 పరుగులు చేసి 54.75 సగటుతో నిలిచాడు. బెంగళూరు జట్టు చరిత్రలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో కోహ్లి 8 అర్ధశతకాలు సాధించి 144.71 స్ట్రైక్ రేట్‌తో ఆకట్టుకున్నాడు.
View this post on Instagram
మార్చి 12న షెడ్యూల్..
మార్చి 8న టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కొత్త సీజన్ మార్చి 28న ప్రారంభమవుతుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. కానీ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ 2026కు సంబంధించి తొలుత కొన్ని రోజుల షెడ్యూల్‌ను మార్చి 12న ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. భారత్ ప్రపంచ కప్ను సాధించిన నేపథ్యంలో ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చిన్నస్వామి స్టేడియంలో 5 హోం మ్యాచ్‌లు..
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 2025 సీజన్ ఫైనల్లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఇటీవల కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) కార్యదర్శి సంతోష్ మీనన్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ జట్టు హోం మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లను బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుందని తెలిపారు. ఈ స్టేడియంలో ఐపీఎల్ 2026 ఫైనల్‌తో పాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్ ను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్సీబీ జట్టు మిగిలిన 2 హోం మ్యాచ్‌లను ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఉన్న షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



