Virat Kohli | విరాట్ కోహ్లి, అనుష్క శర్మలపై మండిపడుతున్న నెటిజన్లు.. సెల్ఫీ అడిగిన దివ్యాంగ బాలున్ని పట్టించుకోలేదు.. వీడియో..
Virat Kohli | భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ పిల్లలు పుట్టినప్పటి నుంచి లండన్‌లో నివాసం ఉంటున్న విషయం విదితమే. మ్యాచ్‌లు ఉన్నప్పుడు కోహ్లి, సినిమాల్లో నటించేందుకు అనుష్క శర్మ భారత్‌కు అప్పుడప్పుడు వస్తున్నారు. ఇక కోహ్లి ఈ మధ్యే సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు భారత్‌కు వచ్చాడు. మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే మళ్లీ లండన్ వెళ్లిన అనంతరం కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి తిరిగి ఇండియాకు వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ దంపతులు ఇద్దరు తాజాగా బృందావనం ఆశ్రమంలో ప్రేమానంద్ జీని కలిసేందుకు వెళ్లారు. అయితే తిరిగి వస్తుండగా ఎయిర్ పోర్టులో ఓ దివ్యాంగ బాలుడు కోహ్లితో ఫొటో దిగేందుకు యత్నించాడు. కానీ కోహ్లి సెక్యూరిటీ అతన్ని పక్కకు నెట్టేశారు. దీంతో కోహ్లిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఒక్క నిమిషం ఆగి ఆ బాలుడికి సెల్ఫీ ఇస్తే కోహ్లి ఏమైనా అరిగిపోతాడా.. అని కామెంట్లు పెడుతున్నారు.
కాగా ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మీరు ప్రేమానంద్ జీ ఆశ్రమానికి వెళ్లి వచ్చింది ఇందుకనేనా, అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఒక్క నిమిషం ఆ బాలుడి కనీసం హాయ్ చెప్పే తీరిక కూడా కోహ్లికి లేదా, మీరు త్వరగా వెళ్లాలని కోరుకోవచ్చు, కానీ ఆ బాలున్ని చూస్తే మీకు కొంచెం కూడా జాలి కలగలేదా..? అని నెటిజన్లు కోహ్లి దంపతులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ తరహా సంఘటనలు చోటు చేసుకోవడం సెలబ్రిటీలకు, అందులోనూ కోహ్లికి కొత్తేమీ కాదు. ఇలా తరచూ వివాదాస్పద సంఘటనలు ఎందుకని చెప్పి వారు లండన్‌లో ఉంటున్నారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని కూడా వారు కోరారు. అయినప్పటికీ వారు భారత్‌కు వచ్చినప్పుడల్లా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఈ సంఘటనపై కొందరు అభిమానులు కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. వారు త్వరగా వెళ్లే యత్నంలో ఉన్నారు, అలాంటి సమయంలో వారిని కాసేపు చూడాలని కోరుకోవాలి కానీ వారితో ఫొటో అంటే ఎలా, వీలు కాదు కదా, మనం అర్థం చేసుకోవాలి, వారికి ప్రైవసీ ఇవ్వాలి.. అని కొందరు అభిమానులు అంటున్నారు. కాగా కోహ్లి ఇటీవల జరిగిన సౌతాఫ్రికా సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సాధించాడు. సిరీస్‌లో మొత్తం 302 పరుగులు చేయగా, అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇక జనవరిలో భారత్ లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టుతోనూ వన్డేలు ఆడనున్నారు. ఈ పర్యటనలో కివీస్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

IPL 2026 | కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టి.. సరికొత్త రికార్డును నెలకొల్పిన కేఎల్ రాహుల్..!
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



