Vaibhav Sooryavanshi | ఆరెంజ్ క్యాప్ సూర్యవంశీదే.. మరో నాలుగు అవార్డులు కూడా..
Vaibhav Sooryavanshi | త్రినేత్ర.న్యూస్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. ఈ పాలబుగ్గల బుడ్డోడి పేరు వినగానే గుర్తొచ్చేది సిక్సర్లు. తనకు బాల్స్ వేస్తున్నది ప్రపంచంలో మేటి బౌలర్ అయినా బాల్ మాత్రం దాటాల్సిందే బౌండ్రీ లైనే.
Vaibhav Sooryavanshi | త్రినేత్ర.న్యూస్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. ఈ పాలబుగ్గల బుడ్డోడి పేరు వినగానే గుర్తొచ్చేది సిక్సర్లు. తనకు బాల్స్ వేస్తున్నది ప్రపంచంలో మేటి బౌలర్ అయినా బాల్ మాత్రం దాటాల్సిందే బౌండ్రీ లైనే. అతడు బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టాల్సిందే. బౌలర్లపై కనీసం కనికరం కూడా చూపకుండా వరుసగా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ జట్టు స్కోరును ఉరుకుల పెట్టిస్తుంటాడు. తన వ్యక్తిగ పరుగుల గురించి పట్టించుకోకుండా ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యం ఉంచాలనో, జట్టు విజయాన్ని అందించాలనో తన బ్యాట్‌కు పనిచెబుతుంటాడు. అలా మూడు శతకాలను చేజార్చుకున్నాడు. అయినప్పటికే ఈ 15 ఏండ్ల చిన్నోడే ఐపీఎల్ 19వ సీజన్‌లో టాప్ స్కోరర్. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా (Orange Cap) నిలిచాడు. తన జట్టు టోర్నీ ఫైనల్స్‌కు చేరకపోయినా, ఆర్సీబీ టోప్రీ అందుకున్నా.. ఈ సీజన్‌లో అభిమానుల హృదయాలను గెలుపొందింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. అతడు మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 237.30 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. వైభవ్ తర్వాత గుజరాత్ ఓపెనర్స్ సాయి సుదర్శన్ (710), శుభమన్ గిల్ (722) మాత్రమే 7 వందల ప్లస్ పరుగులు చేశారు. వైభవ్‌ను దాటేసే అవకాశం వీరిద్దరికి మాత్రమే ఉండేది. అయితే ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇద్దరూ విఫలం కావడంతో ఐపీఎల్ 19 సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన అతనికి రూ.10 లక్షల ఫ్రైజ్ మనీ దక్కింది.

ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్ల ఘనత కూడా అతడిదే. 15 ఏండ్ల ఈ బుడ్డోడు ప్రతి 4.5 బంతులకు ఒక సిక్స్ లెక్కన మొత్తం 72 సిక్సర్లు బాదాడు. 63 ఫోర్లు కూడా కొట్టాడు. తనదైన దూకుడుతో మూడుసార్లు సెంచరీలు (93, 97, 96) అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు (440 బంతుల్లో) సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు (521) చేసిన మొదటి ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ (467 పరుగులు, 2016లో)ను వైభవ్ అధిగమించాడు.
Age no bar for this truly special teenager 👏🙌
Vaibhav Sooryavanshi is the winner of the 𝙈𝙤𝙨𝙩 𝙑𝙖𝙡𝙪𝙖𝙗𝙡𝙚 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 Award with 4⃣3⃣6⃣.5⃣ points 🩷#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/DowJeSDF5X
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ చేసిన టాప్ 5 బ్యాటర్స్
వైభవ్ సూర్యవంశీ-776 (రాజస్థాన్)
శుభమన్ గిల్-722 (గుజరాత్)
సాయి సుదర్శన్-710 (గుజరాత్)
హెన్రిచ్ క్లాసెన్-624 (సన్ రైజర్స్)
ఇషాన్ కిషన్-602 (సన్ రైజర్స్)
He came. He entertained. He conquered 🔥
Vaibhav Sooryanashi delivers a season for ages winning the Orange Cap 🧢👑#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/Vzvpm163UE
— IndianPremierLeague (@IPL) May 31, 2026
Yet another accolade earned 🫡
Vaibhav Sooryavanshi is the top-scoring Fantasy player this season with 1121 points 👏👏#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/hknocvfUxv
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ఐపీఎల్ 2026 అవార్డులు..
ఆరెంజ్ క్యాప్- వైభవ్ సూర్యవంశీ- 776 రన్స్
పర్పుల్ క్యాప్- కాగిసో రబాడా (గుజరాత్)- 29 వికెట్లు
అత్యంత విలువైన ఆటగాడు- వైభవ్ సూర్యవంశీ
వర్ధమాన ఆటగాడు- వైభవ్ సూర్యవంశీ
అత్యధిక సిక్సర్లు- వైభవ్ సూర్యవంశీ- 71 సిక్సర్లు
అత్యధిక ఫోర్లు- సాయి సుదర్శన్ (గుజరాత్)- 75 ఫోర్లు
అత్యుత్తమ స్ట్రైక్ రేట్- వైభవ్ సూర్యవంశీ- 237.31
అత్యధిక డాట్ బాల్స్- మహ్మద్ సిరాజ్ (గుజరాత్)- 172 డాట్ బాల్స్
అత్యుత్తమ క్యాచ్- మనీశ్ పాండే (కోల్‌కతా)
ఫెయిర్ ప్లే అవార్డు- పంజాబ్ కింగ్స్
పిచ్, మైదానాల అవార్డు (4 లేదా అంతకంటే తక్కువ మ్యాచ్‌లు): హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్
పిచ్, మైదానాల అవార్డు- క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్
Where Talent makes the most of Opportunity 🌟
1⃣5⃣-year-old Vaibhav Sooryavanshi becomes the youngest recipient of the 𝙀𝙢𝙚𝙧𝙜𝙞𝙣𝙜 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 𝙤𝙛 𝙩𝙝𝙚 𝙎𝙚𝙖𝙨𝙤𝙣 Award 👏🙇♂️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/YOtxuhXxKu
— IndianPremierLeague (@IPL) May 31, 2026
- 776 runs.
- Orange Cap winner.
- 237.31 strike rate.
- 72 sixes.
- MVP award.
- Super Sixes award.
- Super Striker award.
- Emerging Player award.
- 97 (29) in the Eliminator.
- 96 (47) in Qualifier 2.A GENERATIONAL CAMPAIGN BY A 15 YEAR OLD VAIBHAV SOORYAVANSHI. 🤯 pic.twitter.com/T7Qoh86zFN
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026
సంబంధిత వార్తలు

IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొదటి కప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెలల్లోనే రెండోది..
జూన్ 1, 2026

Vaibhav Sooryavanshi | సూర్యవంశీ బ్యాంటింగ్.. చాగంటి కోటేశ్వర రావు కామెంట్రీ.. మీరూ చూసేయండి
మే 29, 2026

Kavya Maran | సిక్సర్ల సునామీ సృష్టించిన 15 ఏళ్ల కుర్రాడు: ఓడినా స్వయంగా వెళ్లి అభినందించిన కావ్యా మారన్
మే 28, 2026
తాజావార్తలు
- ●IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొదటి కప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెలల్లోనే రెండోది..
- ●LPG Cylinder Price | నెల మారింది.. సిలిండర్ ధర పెరిగింది..
- ●Horoscope | జూన్ 1 రాశిఫలాలు.. ఈ రాశివారు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు!
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

IPL | ఐపీఎల్ విజేత ఆర్సీబీ.. మొదటి కప్ గెలిచేందుకు 18 ఏండ్లు.. 12 నెలల్లోనే రెండోది..

LPG Cylinder Price | నెల మారింది.. సిలిండర్ ధర పెరిగింది..

Horoscope | జూన్ 1 రాశిఫలాలు.. ఈ రాశివారు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు!

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!



