Under-19 World Cup | అండర్ 19 వరల్డ్ కప్.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. పాక్‌పై ఘన విజయం..
Under-19 World Cup | జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ గ్రూప్ 2 సూపర్ సిక్సెస్ 36వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వేదాంత్ త్రివేది నిలకడైన ఇన్నింగ్స్‌కు, ఖిలన్ పటేల్, ఆయుష్ మాత్రేల అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో ఈ మ్యాచ్‌లో భారత సునాయాసంగా విజయం సాధించింది.
Under-19 World Cup | జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ గ్రూప్ 2 సూపర్ సిక్సెస్ 36వ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వేదాంత్ త్రివేది నిలకడైన ఇన్నింగ్స్‌కు, ఖిలన్ పటేల్, ఆయుష్ మాత్రేల అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో ఈ మ్యాచ్‌లో భారత సునాయాసంగా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన ఒక మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేదించలేని పాక్ చతికిల పడింది. ఈ మ్యాచ్‌లో తక్కువ ఓవర్లలో స్కోరు ఛేజ్ చేస్తేనే పాక్‌కు సెమీస్‌కు వెళ్లే చాన్స్ ఉండగా, దాన్ని పాక్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీంతో ఆ జట్టుపై భారత్ 58 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ప్లేయర్లలో వేదాంత్ త్రివేది (98 బంతుల్లో 68 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకోగా, పాక్ బౌలర్లలో అబ్దుల్ శుభాన్ 3 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సయ్యమ్‌కు 2 వికెట్లు దక్కాయి. అలీ రాజా, అహ్మద్ హుస్సెయిన్, మోమిన్ కమర్, అలీ హసన్ బలోచ్‌లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ సెమీస్‌లో బెర్తును ఖరారు చేసుకోవాలంటే 252 పరుగుల లక్ష్యాన్ని 33 ఓవర్లలో ఛేదించాల్సి వచ్చింది. అలా అయితేనే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి సెమీస్‌లోకి వెళ్లే చాన్సులు ఉంటాయి. అయితే పాక్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 3వ వికెట్‌కు ఆ జట్టు ప్లేయర్లు 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించే విధంగా కనిపించారు. కానీ ఆ తరువాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దీంతో 33 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించడం పాక్‌కు కష్టమైంది. అయితే అప్పటికే భారత్ సెమీస్‌కు దూసుకెళ్లడంతో చివరకు మిగిలిన 17 ఓవర్లను పాక్ నామమాత్రంగా ఆడింది. మ్యాచ్ పట్ల ఆసక్తి లేనట్లు అయిష్టతను ప్రదర్శించింది. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లలో ఉస్మాన్ ఖాన్ (92 బంతుల్లో 66 పరుగులు, 7 ఫోర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి ఎవరూ సహకారం అందించలేదు. దీంతో ఆ జట్టు 46.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో ఖిలన్ పటేల్, ఆయుష్ మాత్రే చెరో 3 వికెట్లను పడగొట్టగా, ఆర్ఎస్ అంబ్రీష్, హెనిల్ పటేల్, కన్షిక్ చౌహాన్, విహాన్ మల్హోత్రా తలా 1 వికెట్ తీశారు. ఇక ఈ విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్ ఈ నెల 4వ తేదీన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హరారేలో ఆఫ్గనిస్థాన్ జట్టుతో తలపడనుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



