త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026.. నేటి వార్మప్ మ్యాచ్‌లు ఇవే.. త‌ల‌ప‌డ‌నున్న ఇండియా ఎ, యూఎస్ఏ..

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ మ‌రో 5 రోజుల్లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఐసీసీ ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. అందులో భాగంగానే సోమ‌వారం (ఫిబ్ర‌వ‌రి 2, 2026) నుంచి వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తోంది. చిన్న టీమ్‌లు రెండేసి చొప్పున వార్మప్ మ్యాచ్‌ల‌ను ఆడేలా షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు.

S

Cricket | Published On Feb 2, 2026, 7.57 am IST

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026.. నేటి వార్మప్ మ్యాచ్‌లు ఇవే.. త‌ల‌ప‌డ‌నున్న ఇండియా ఎ, యూఎస్ఏ..
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ మ‌రో 5 రోజుల్లో ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఐసీసీ ఇప్ప‌టికే స‌న్నాహాలు మొద‌లు పెట్టింది. అందులో భాగంగానే సోమ‌వారం (ఫిబ్ర‌వ‌రి 2, 2026) నుంచి వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తోంది. చిన్న టీమ్‌లు రెండేసి చొప్పున వార్మప్ మ్యాచ్‌ల‌ను ఆడేలా షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. ఈ క్ర‌మంలోనే తొలి రోజు మొత్తం మూడు వార్మ‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ సెంట‌ర్ 1లో ఆప్గ‌నిస్థాన్‌, స్కాట్లండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వార్మ‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అలాగే ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇండియా ఎ జ‌ట్టు యూఎస్ఏతో వార్మ‌ప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది.

రాత్రి 7 గంట‌ల‌కు చెన్నైలో కెన‌డా, ఇట‌లీ జ‌ట్ల మ‌ధ్య మ‌రో వార్మ‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే ఈ వార్మ‌ప్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారా, లేదా అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ఇండియా ఎ, భార‌త జ‌ట్టు ఆడే మ్యాచ్‌ల‌ను మాత్రం ప్ర‌త్య‌క్ష ప్రసారం చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే వ్యూయ‌ర్‌షిప్ అధికంగా ఉంటుంది క‌నుక క‌చ్చితంగా ఈ మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేస్తార‌ని స‌మాచారం. ఇక ఈ టోర్నీకి జియో స్టార్ ఇప్ప‌టికే ప్ర‌ధాన బ్రాడ్ కాస్ట‌ర్‌గా ఉన్న నేప‌థ్యంలో డిజిట‌ల్ వేదిక‌గా జియో హాట్ స్టార్‌లో మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేస్తారు. అలాగే శాటిలైట్ మాధ్య‌మంలో స్టార్ టీవీ చాన‌ల్స్‌లో మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

వార్మ‌ప్ మ్యాచ్‌ల‌లో భాగంగా ఇవాళ ఇండియా ఎ జ‌ట్టు యూఎస్ఏతో ఆడుతుంది. త‌రువాత భార‌త ప్ర‌ధాన జ‌ట్టు ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన సౌతాఫ్రికాతో వార్మ‌ప్ ఆడుతుంది. మళ్లీ 6వ తేదీన ఇండియా ఎ జ‌ట్టు న‌మీబియాతో వార్మ‌ప్ మ్యాచ్ ఆడుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement