త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | భార‌త్‌తో మ్యాచ్‌లో పూర్తిగా విఫ‌లం అయిన ష‌హీన్ షా అఫ్రిది.. భారీగా ట్రోలింగ్‌..

T20 World Cup 2026 | భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ ష‌హీన్ షా అఫ్రిది విఫ‌లమై తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఆదివారం (ఫిబ్రవరి 15, 2026) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎ పోరులో ష‌హీన్ పూర్తి ఓవర్లు కూడా వేయలేకపోయాడు.

S

Cricket | Published On Feb 16, 2026, 6.33 am IST

T20 World Cup 2026 | భార‌త్‌తో మ్యాచ్‌లో పూర్తిగా విఫ‌లం అయిన ష‌హీన్ షా అఫ్రిది.. భారీగా ట్రోలింగ్‌..
Advertisement

T20 World Cup 2026 | భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ పేసర్ ష‌హీన్ షా అఫ్రిది విఫ‌లమై తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఆదివారం (ఫిబ్రవరి 15, 2026) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎ పోరులో ష‌హీన్ పూర్తి ఓవర్లు కూడా వేయలేకపోయాడు. రెండు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీసి మ్యాచ్‌ను ముగించాడు. అక్షర్ పటేల్ వికెట్‌ను పడగొట్టినప్పటికీ, మొత్తం మీద ష‌హీన్ బౌలింగ్‌లో లయ, నియంత్రణ పూర్తిగా కొరవడినట్టే కనిపించింది. కీలక దశల్లో పాకిస్థాన్‌కు మూమెంటం తీసుకొచ్చేలా అతడు బౌలింగ్ చేయలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున పేస్ విభాగంలో బౌలింగ్ చేసిన ఏకైక బౌలర్ కూడా ష‌హీనే కావడం గమనార్హం. మిగతా ఓవర్లన్నీ స్పిన్నర్లే వేశారు.

వేసిన తొలి ఓవ‌ర్‌లోనే విఫ‌లం..

ఇన్నింగ్స్ ఆరంభంలో ష‌హీన్ వేసిన రెండో ఓవర్‌ మ్యాచ్ దిశనే మార్చేసింది. అబిషేక్ శర్మను సల్మాన్ ఆఘా తొలి ఓవర్‌లో ఔట్ చేసిన వెంటనే పాకిస్థాన్‌కు వచ్చిన ఉత్సాహాన్ని ష‌హీన్ 15 పరుగులు ఇచ్చి నీరుగార్చాడు. ఇషాన్ కిషన్ వెంటనే దాడికి దిగుతూ షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతిని స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. తిలక్ వర్మకు బౌలింగ్ చేస్తున్న సమయంలో లైన్, లెంగ్త్‌పై ష‌హీన్ కు స్పష్టమైన అయోమయం కనిపించింది. 140 కిలోమీటర్ల వేగంతో వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ కట్టర్‌ను తిలక్ సులువుగా డిఫెన్స్ చేశాడు. ఆఫ్ స్టంప్ బయట వేసిన ఫుల్ బాల్ స్వింగ్ అయినప్పటికీ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయింది. ఎడ్జ్ కోసం వేసిన అవుట్‌స్వింగర్ ఫీల్డర్‌ను దాటుకుని ఫోర్‌గా వెళ్లింది. పేస్, స్వింగ్ మారుస్తున్నప్పటికీ నిల‌క‌డ‌ లేకపోవడం భారత బ్యాటర్లకు పైచేయి ఇచ్చింది.

ఒక వికెట్ తీసి ప‌రువు నిల‌బెట్టుకుని..

చివరి ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన ష‌హీన్ పరిస్థితి మెరుగుపడలేదు. శివం దూబే స్లో బాల్‌ను స్లాట్‌లో అందుకుని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత రింకూ సింగ్ మిస్ అయిన యార్కర్‌ను మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా బాదాడు. వెడల్పుగా వేసిన మరో స్లో డెలివరీని కవర్ వైపు కట్ చేసి మరో ఫోర్ జత చేశాడు. చివరకు అక్షర్ పటేల్‌ను డీప్ మిడ్‌వికెట్ వద్ద క్యాచ్‌గా ఔట్ చేసి కొంత పరువు కాపాడుకున్నాడు. కాగా ఈ నిరాశాజనక ప్రదర్శన తర్వాత ష‌హీన్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు అతడిని భారత్‌కు 12వ ఆటగాడు అంటూ ఎద్దేవా చేయగా, మరికొందరు సరదాగా ఇండియన్ ఏజెంట్ అని పిలుస్తూ ట్రోలింగ్ చేశారు. మరికొందరు అభిమానులు ష‌హీన్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడని, అతడి బౌలింగ్‌లో పాత మెరుపు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement