త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | భార‌త్-పాక్ మ్యాచ్ ఉత్కంఠ‌.. పీసీబీ కొత్త ఎత్తుగ‌డ‌..?

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన కొలంబోలో భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ పై గ‌త కొద్ది రోజులుగా కొన‌సాగుతూ వ‌స్తున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) త‌న వైఖ‌రి విషయంలో కాస్త మెత్త బ‌డిన‌ట్లు తెలుస్తోంది.

S

Cricket | Published On Feb 8, 2026, 8.00 am IST

T20 World Cup 2026 | భార‌త్-పాక్ మ్యాచ్ ఉత్కంఠ‌.. పీసీబీ కొత్త ఎత్తుగ‌డ‌..?
Advertisement

T20 World Cup 2026 | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన కొలంబోలో భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ పై గ‌త కొద్ది రోజులుగా కొన‌సాగుతూ వ‌స్తున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) త‌న వైఖ‌రి విషయంలో కాస్త మెత్త బ‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఐసీసీకి ఆ మ్యాచ్ బ‌హిష్క‌ర‌ణ‌పై లేఖ కూడా రాసింది. భార‌త్‌తో మ్యాచ్ ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు పీసీబీ మౌఖికంగా చెబుతూ వ‌చ్చింది. కానీ ఎక్క‌డా ఐసీసీకి లేఖ రాయ‌లేదు. త‌మ ప్ర‌భుత్వ నిర్ణ‌యం క‌నుక తాము లేఖ రాయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు స‌మ‌ర్థించుకుంటూ వ‌చ్చింది. కానీ శ‌నివారం నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం లేఖ రాసింది. దీంతో ఈ విష‌యంలో పీసీబీ కాస్త వెన‌క్క త‌గ్గింద‌ని, స‌మ‌స్య‌ను చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌రిమానా, శిక్ష నుంచి త‌ప్పించుకునేందుకు..

ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ క‌థ‌నం ప్ర‌కారం.. భార‌త్‌తో జ‌ర‌గాల్సిన గ్రూప్ ఎ మ్యాచ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫోర్స్ మేజ‌ర్ నిబంధ‌న‌ను ప్ర‌యోగించాల‌ని కోరుతూ లేఖ రాసింది. ఈ నిబంధ‌న ప్ర‌కారం తాము భార‌త్ తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ను బ‌హిష్క‌రిస్తున్నామ‌ని, దీన్ని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని, త‌దుప‌రి ప్రొసీడింగ్స్ చేప‌ట్టాల‌ని ఐసీసీని పీసీబీ లేఖ‌లో కోరింది. ఎలాంటి కార‌ణాలు లేకుండా, అధికారిక స‌మాచారం ఇవ్వ‌కుండా మ్యాచ్ ను బ‌హిష్క‌రిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ఐసీసీ హెచ్చ‌రించ‌డంతో పీసీబీ ఈ విష‌యంలో చ‌ట్ట ప్ర‌కారం వెళ్లాల‌ని చూస్తున్న‌ట్లు వారి లేఖ ద్వారా స్ప‌ష్ట‌మవుతోంది. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఫోర్స్ మేజ‌ర్ (Force Majeure) రూల్‌ను ప్ర‌యోగించ‌డం ద్వారా పీసీబీ త‌మ‌కు మ్యాచ్ బహిష్క‌ర‌ణ ద్వారా క‌లిగే న‌ష్టాన్ని, జ‌రిమానాను, శిక్ష‌ను త‌ప్పించుకోవ‌చ్చ‌ని భావిస్తోంది. అందుక‌నే ఈ రూల్‌ను ప్ర‌యోగించాల‌ని ఐసీసీకి లేఖ రాసిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే దీనిపై ఐసీసీ ఇంకా స్పందించ‌లేదు.

ఏంటీ.. ఫోర్స్ మేజ‌ర్ రూల్‌..?

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఫోర్స్ మేజ‌ర్ రూల్‌ను ప్ర‌యోగిస్తే సంబంధిత జ‌ట్టు లేదా దేశం క‌చ్చిత‌మైన కార‌ణాలు తెల‌పాల్సి ఉంటుంది. యుద్ధం, ప్ర‌కృతి విప‌త్తులు, ప్ర‌భుత్వ ఆదేశాలు వంటి పరిస్థితుల నేప‌థ్యంలోనే ఈ రూల్‌ను అమ‌లు చేసేందుకు ఐసీసీకి వీలు క‌లుగుతుంది. అదే జ‌రిగితే పీసీబీ జ‌రిమానా, శిక్ష నుంచి త‌ప్పించుకునే చాన్స్ ఉంటుంది. క‌నుక‌నే ఈ రూల్‌ను ప్ర‌యోగించాల‌ని ఐసీసీకి పీసీబీ లేఖ రాసింద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే భార‌త్‌తో మ్యాచ్ ఆడొద్ద‌ని ఇప్ప‌టికే పాక్ ప్ర‌భుత్వం త‌మ‌కు ఆదేశాలు ఇచ్చింద‌ని పీసీబీ చెబుతోంది క‌నుక, ఫోర్స్ మేజ‌ర్ రూల్‌ను ఈ విష‌యంలో ప్ర‌యోగించ‌వ‌చ్చ‌ని పీసీబీ భావించింది. అందుక‌నే ఐసీసీకి లేఖ రాసింది. కానీ పీసీబీ అనుకున్న ప్ర‌కారం ఈ రూల్ ను వ‌ర్తింప‌జేయ‌డం అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది.

ఐసీసీ ఏం చేయ‌నుంది..?

2025 చాంపియన్స్ ట్రోఫీకి ముందే భార‌త్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఐసీసీ టోర్నీల్లో తమ ప్ర‌త్య‌ర్థి దేశాల్లో ఆడ‌డంపై క‌చ్చిత‌మైన ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఐసీసీ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్న‌ప్ప‌టికీ పాక్ మాత్రం త‌మ మ్యాచ్‌లను శ్రీ‌లంక‌లో ఆడుతోంది. ఇలాంటి త‌రుణంలో మ్యాచ్‌ను బ‌హిష్క‌రించ‌డం, అందులోనూ కేవ‌లం భార‌త్ మ్యాచ్ నే బాయ్ కాట్ చేస్తామ‌ని పాక్ చెప్ప‌డం ముందుగా చేసుకున్న ఒప్పందానికి విరుద్ధ‌మ‌ని ఐసీసీ భావిస్తోంది. బంగ్లాదేశ్ విష‌యంలో పాకిస్థాన్ స్టాండ్ తీసుకోవ‌డంపై రాజ‌కీయ ప్ర‌మేయం ఉంద‌ని కూడా ఐసీసీ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే పాక్ లేవ‌నెత్తిన ఫోర్స్ మేజ‌ర్ రూల్ ప్ర‌స్తుతం వ‌ర్తించ‌ద‌ని ఐసీసీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై పీసీబీకి ఐసీసీ అధికారికంగా లేఖ కూడా రాస్తుంద‌ని స‌మాచారం. అయితే ఎట్ట‌కేల‌కు ఈ విష‌యం ఒక కొలిక్కి రావ‌డంతో ప‌రిణామాలు ఇక‌పై వేగంగా మారుతాయ‌ని, భార‌త్ - పాక్ మ్యాచ్ జ‌రిగే అవ‌కాశాలు ఇప్ప‌టికైతే అధికంగానే ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement