త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | ఇండియా-నమీబియా మ్యాచ్‌.. అంపైర్ డెడ్ బాల్ ఎందుకు ప్ర‌క‌టించారు..?

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా-నమీబియా మధ్య జరిగిన గ్రూప్-ఎ పోరులో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న‌ తీవ్ర వివాదానికి దారితీసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 12న జరిగిన మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మ‌స్ బౌలింగ్‌పై అంపైర్ రోడ్ ట‌క్క‌ర్ తీసుకున్న డెడ్ బాల్ నిర్ణయం చర్చనీయాంశమైంది.

S

Cricket | Published On Feb 13, 2026, 7.47 am IST

T20 World Cup 2026 | ఇండియా-నమీబియా మ్యాచ్‌.. అంపైర్ డెడ్ బాల్ ఎందుకు ప్ర‌క‌టించారు..?
Advertisement

T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా-నమీబియా మధ్య జరిగిన గ్రూప్-ఎ పోరులో చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న‌ తీవ్ర వివాదానికి దారితీసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 12న జరిగిన మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మ‌స్ బౌలింగ్‌పై అంపైర్ రోడ్ ట‌క్క‌ర్ తీసుకున్న డెడ్ బాల్ నిర్ణయం చర్చనీయాంశమైంది. టాస్ గెలిచిన న‌మీబియా బౌలింగ్ ఎంచుకోగా పవర్‌ప్లేలో భారత జట్టు దూకుడుగా ఆడి ఏడో ఓవర్లోనే 100 పరుగులు దాటింది. ఎనిమిదో ఓవర్‌లో స్వయంగా బంతి పట్టిన ఎరాస్మస్ మ్యాచ్ దిశను మార్చాడు. అయితే ఆ ఓవర్ ఐదో బంతికి వివాదం నెల‌కొంది. అంపైర్ టక్కర్ ఆ డెలివరీని డెడ్ బాల్ గా ప్రకటించడంతో ఎరాస్మస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

డెడ్ బాల్ ఎందుకు ఇచ్చారు ?

ఎరాస్మస్ రౌండ్-ఆర్మ్ స్లింగ్ యాక్షన్ వివాదానికి కారణమైంది. తన రన్-అప్‌లో భాగంగా అతను క్రీజ్ వెనుక భాగం నుంచి బంతిని విడుదల చేశాడు. ఇదే అంశంపై అంపైర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదట ఆ బంతి వైడ్‌గా నిర్ణయించబడినా, డెడ్ బాల్ గా ప్రకటించడంతో భారత్‌కు పరుగులు లభించలేదు. తదుపరి బంతిపై తిలక్ వర్మ సింగిల్ తీశాడు. తీవ్ర వాదోపవాదాల అనంతరం ఎరాస్మస్‌కు టక్క‌ర్‌ అదే శైలిలో బౌలింగ్ కొనసాగించేందుకు అనుమతించాడు. ఆ తర్వాతి ఓవర్లలో కూడా అతను క్రీజ్ వెనుక నుంచి బంతులు విసిరి తిలక్ వర్మను ఔట్ చేశాడు.

అంపైర్ తప్పు చేశాడా ?

సాధారణంగా బౌలర్ అంపైర్ ముందుభాగం నుంచి బంతిని వేయాల‌నే రూల్‌ ఉంది. అయితే క్రీజ్ వెనుక నుంచి బౌలింగ్ చేయడంపై స్పష్టమైన నిషేధం లేదు. గతంలో కూడా పలువురు బౌలర్లు ఇలాంటి యాక్షన్‌తో బంతులు విసిరినా అభ్యంతరాలు రాలేదు. ఎంసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం లా 20.4.2 కింద అన్యాయ చర్యల కారణంగా డెడ్ బాల్ ను అంపైర్ ప్రకటించవచ్చు. లా 41.2 ప్రకారం బ్యాటర్ కు దృష్టి భంగం కలిగించేలా చేసే చర్యల‌ను నిషేధించారు. అయితే ఈ నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో మ్యాచ్ అధికారికి విచక్షణాధికారమే ప్రధాన ఆధారం అవుతుంది. ఈ క్ర‌మంలోనే అంపైర్ ట‌క్క‌ర్ అలా డెడ్ బాల్ ప్ర‌క‌టించి ఉంటార‌ని విశ్లేష‌కులు, మాజీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఎరాస్మ‌స్ అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌..

ఇక వివాదం పక్కన పెడితే ఎరాస్మస్ ప్రదర్శన ప్రశంసనీయం. 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఇషాన్ కిష‌న్‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ వికెట్లు సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో కెప్టెన్‌గా ఇది సంయుక్తంగా రెండో అత్యుత్తమ గణాంకంగా నమోదైంది. భారత్‌పై టోర్నీలో ఇది మూడో ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అయితే ల‌క్ష్య‌ఛేద‌న‌లో న‌మీబియా ఓ ద‌శ‌లో మంచి స్థితిలోనే క‌నిపించినా త‌రువాత వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌తో ఆ జ‌ట్టు వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. దీంతో ఆ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌ను ఆడ‌కుండానే 18.2 ఓవ‌ర్ల‌లోనే 116 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో విజ‌యంతో భార‌త్ గ్రూప్ ద‌శ‌లో రెండు మ్యాచ్‌ల‌ను పూర్తి చేసుకోగా మ‌రో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడ‌నుంది. ఈ నెల 15వ తేదీన శ్రీ‌లంక‌లోని కొలంబోలో భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement