త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | అట్ట‌హాసంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు..

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ కప్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ముంబ‌యి వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన భార‌త్‌-యూఏఈ మ్యాచ్‌కు ముందు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి, రిషబ్ రిఖిరామ్, శివమణి, బాద్షా ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి.

P

Cricket | Published On Feb 7, 2026, 8.26 pm IST

T20 World Cup | అట్ట‌హాసంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు..
Advertisement

T20 World Cup | టీ20 వ‌ర‌ల్డ్ కప్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. ముంబ‌యి వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన భార‌త్‌-యూఏఈ మ్యాచ్‌కు ముందు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి, రిషబ్ రిఖిరామ్, శివమణి, బాద్షా ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. భార‌త్ మ్యాచ్ సంద‌ర్భంగా స్టేడియం మొత్తం అభిమానుల‌తో కిక్కిరిసింది.

అంత‌కు ముందు జెట్ ప్యాక్‌తో ఓ వ్య‌క్తి గాల్లో ఎగురుతూ ట్రోఫీని మైదానంలోకి తీసుకురాగా.. ఆ త‌ర్వాత అభిమానుల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య ప్రపంచకప్ అంబాసిడర్‌, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క‌లిసి ఐసీసీ అధ్యక్షుడు జై షా మైదానంలోకి ట్రోఫీతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

రోహిత్.. రోహిత్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. ఆ త‌ర్వాత డ్రమ్స్ శివమణి బ్యాండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అభిమానుల‌ను ఉర్రూత‌లూగించాడు. ప్ర‌ముఖ ర్యాపర్ బాద్షా త‌న పాట‌ల‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. రిషబ్ రిఖిరామ్ సితార్ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. అలాగే, బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి త‌న డ్యాన్స్‌తో అభిమానుల్లో జోష్ నింపింది.

Advertisement

తాజావార్తలు

Advertisement