త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shoaib Akhtar | మొహ్సిన్ న‌క్వీ ఒక అసమ‌ర్థుడు.. షోయ‌బ్ అక్త‌ర్ నిప్పులు..

Shoaib Akhtar | భారత్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ ఎదుర్కొన్న ఘోర పరాజయం తర్వాత అక్కడి క్రికెట్ వర్గాల్లో కలకలం మొదలైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్‌-2026 మ్యాచ్‌కు ముందు ఎన్నో రోజులుగా జరిగిన హడావిడి, చర్చలు, ఉద్రిక్తతలన్నింటికీ భిన్నంగా, మైదానంలో మాత్రం ఒక్క భార‌త‌ జట్టే కనిపించింది.

S

Cricket | Published On Feb 16, 2026, 10.35 am IST

Shoaib Akhtar | మొహ్సిన్ న‌క్వీ ఒక అసమ‌ర్థుడు.. షోయ‌బ్ అక్త‌ర్ నిప్పులు..
Advertisement

Shoaib Akhtar | భారత్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ ఎదుర్కొన్న ఘోర పరాజయం తర్వాత అక్కడి క్రికెట్ వర్గాల్లో కలకలం మొదలైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్‌-2026 మ్యాచ్‌కు ముందు ఎన్నో రోజులుగా జరిగిన హడావిడి, చర్చలు, ఉద్రిక్తతలన్నింటికీ భిన్నంగా, మైదానంలో మాత్రం ఒక్క భార‌త‌ జట్టే కనిపించింది. భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసి, టీ20 వరల్డ్ కప్‌ల‌లో హెడ్ టు హెడ్ రికార్డును 8-1 గా మార్చింది. అయితే ఈ ఓటమి ప్రభావం ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మాజీ ప్లేయ‌ర్లు, విశ్లేష‌కులు, ఫ్యాన్స్ ఈ ఓట‌మిపై మండిప‌డుతున్నారు. పాక్ ప్లేయ‌ర్లు, కోచ్‌తోపాటు పీసీబీ చైర్మ‌న్ మొహ్సిన్ న‌క్వీని సైతం తూర్పార‌బ‌డుతున్నారు.

క్రికెట్ గురించి న‌క్వీకి అస‌లు ఏమీ తెలియ‌దు: అక్త‌ర్‌

ఈ పరాజయం అనంతరం పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌ బౌలర్ షోయ‌బ్ అక్త‌ర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఎప్పటినుంచో పాకిస్థాన్ క్రికెట్ నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వ‌స్తున్న‌ అక్తర్.. ఈసారి నేరుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌క్వీపైనే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. పాకిస్థాన్ క్రికెట్‌జ‌ట్టు కోచ్‌తోపాటు ప్లేయ‌ర్లు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై అక్త‌ర్ ధ్వ‌జ‌మెత్తాడు. ముఖ్యంగా బాబ‌ర్ ఆజంపై అక్త‌ర్ విరుచుకు ప‌డ్డాడు. మ్యాచ్ అనంతరం షోయ‌బ్ అక్త‌ర్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఒక న్యూస్ ఛాన‌ల్‌కు త‌న‌ను చైర్మ‌న్‌ను చేస్తే అది ఎలా ప‌నిచేస్తుందో త‌న‌కు తెలియ‌ద‌ని, అలాంటిది క్రికెట్ గురించి అస‌లు ఏమాత్రం అవ‌గాహ‌న లేని ఓ వ్య‌క్తి (మొహ్సిన్ న‌క్వీ)ని చైర్మన్‌ను చేస్తే అప్పుడు జ‌ట్టు ఎలా ప‌నిచేస్తుంద‌ని.. అక్త‌ర్ అన్నాడు. ఆయ‌న వ్యాఖ్య‌లు నేరుగా న‌క్వీని ఉద్దేశించి చేసిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం.

రాజ‌కీయాల‌ను ప‌క్క‌న బెట్టాల‌ని పాక్ నీతులు..

కాగా అక్త‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో పాకిస్థాన్ క్రికెట్‌పై రాజ‌కీయాల ప్ర‌భావం ఎంత‌గా ఉంద‌న్న‌ది ఇప్పుడు మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్‌తో తాము ఆడ‌బోమని ముందుగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన పాక్, క్రికెట్‌లో రాజ‌కీయాల‌కు తావు ఉండ‌కూడ‌ద‌ని నీతి బోధ‌లు చేసే ప్ర‌య‌త్నం చేసింది. కానీ అస‌లు ఇత‌ర దేశాల క‌న్నా ఆ దేశ క్రికెట్‌లోనే ఎక్కువ రాజ‌కీయాలు ఉన్నాయ‌న్న విష‌యం అక్త‌ర్ మాట‌ల‌ను బ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీన్ని బ‌ట్టి చూస్తే పాక్ నీతులు చెప్ప‌డం కాదు, ముందు త‌మ బోర్డులో ఉన్న రాజ‌కీయాల‌ను, రాజకీయం చేసే వ్య‌క్తుల‌ను ప‌క్క‌న బెట్టాల‌ని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఒక‌రికి నీతులు చెప్పే ముందు త‌మ‌లో ఉన్న లోపాల‌ను మొద‌ట‌ స‌రి చేసుకోవాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మొహ్సిన్ న‌క్వీకి క్రికెట్ పరిపాలనలో అనుభవం లేదన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పీసీబీ చైర్మ‌న్‌గా మ‌రీ అతిగా స్పందిస్తున్నార‌ని, అన‌వ‌స‌రంగా రాజ‌కీయాలు చేస్తూ పాక్ క్రికెట్‌ను నాశ‌నం చేస్తున్నార‌ని ఇప్ప‌టికే ఆయ‌న‌పై అక్త‌ర్ లాంటి మాజీలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఎదురైన ప‌రాభ‌వం పాక్ మాజీల‌ను మ‌రింత ఆగ్ర‌హానికి గురి చేసింది. అందుక‌నే వారు ఇక నేరుగానే న‌క్వీపై మాట‌ల యుద్ధానికి దిగారు.

అస‌మ‌ర్థుడికి అతి పెద్ద బాధ్య‌త ఇచ్చారు: అక్త‌ర్

అయితే ఈ విష‌యంపై ఇంకా స్పందించిన అక్త‌ర్ మాట్లాడుతూ.. మీరు ఒక ఆటగాడిని సూపర్‌స్టార్‌గా మార్చారు. కానీ అతను మీకు ఒక్క మ్యాచ్ ను కూడా గెలిపించలేకపోతున్నాడు. పది ఓవర్లు కూడా ఆడ‌లేని వ్యక్తిని పెద్ద స్టార్‌గా చూపించారు.. అంటూ పాక్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజంపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. అసమర్థుడైన వ్యక్తికి అతి పెద్ద బాధ్యత ఇవ్వడమే ప్రపంచంలో అతి పెద్ద నేరం. అర్హతలేని, అవగాహనలేని వ్యక్తికి పెద్ద పదవి ఇస్తే ఎలాంటి నష్టం అయినా జరగొచ్చు.. అని అక్త‌ర్ అన్నాడు. కాగా అక్త‌ర్ వ్యాఖ్య‌లు పాక్ క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement