త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

వైజాగ్ వ‌న్డేలో కాసేపు కుల్దీప్ యాద‌వ్‌తో క‌లిసి న‌వ్వులు పూయించిన రోహిత్ శ‌ర్మ‌.. అస‌లేం జ‌రిగిందంటే..? వీడియో వైరల్‌..

S

Cricket | Published On Dec 7, 2025, 1.28 pm IST

వైజాగ్ వ‌న్డేలో కాసేపు కుల్దీప్ యాద‌వ్‌తో క‌లిసి న‌వ్వులు పూయించిన రోహిత్ శ‌ర్మ‌.. అస‌లేం జ‌రిగిందంటే..? వీడియో వైరల్‌..
Advertisement

క్రికెట్ మైదానంలో తోటి ప్లేయర్ల‌ను ఉత్సాహంగా ఉంచడంతోపాటు చ‌క్క‌ని హాస్యాన్ని పండించడంలో భార‌త జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఇప్ప‌టికే ఎన్నో అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఆడిన రోహిత్ తాను కెప్టెన్ ఉన్న స‌మ‌యంలోనే కాకుండా కెప్టెన్‌గా లేని స‌మ‌యంలోనూ తోటి ప్లేయ‌ర్ల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. అలాగే త‌న హాస్య చ‌తుర‌త‌, ఫ‌న్నీ కామెంట్ల‌తో కావ‌ల్సినంత హాస్యాన్ని పండిస్తారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై సైతం త‌న మాట‌ల‌తో వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తారు. టీమిండియాలో ఎవ‌రైనా ప్లేయ‌ర్ స‌రిగ్గా బౌలింగ్ చేయ‌క‌పోయినా, ఫీల్డింగ్ బాగా లేక‌పోయినా వెంటనే త‌న‌దైన రీతిలో విమ‌ర్శిస్తారు. అయితే తాజాగా సౌతాఫ్రికాతో విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లోనూ రోహిత్ ఇలాగే వ్య‌వ‌హ‌రించి న‌వ్వులు పూయించారు.

సౌతాఫ్రికా బ్యాటింగ్ సమ‌యంలో ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ లుంగి ఎంగిడి క్రీజులో ఉండగా భార‌త బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎంగిడి ఆడిన రెండు వ‌రుస బంతులు అత‌ని ప్యాడ్‌ల‌ను తాకాయి. అయితే అది ఎల్‌బీడ‌బ్ల్యూ కావ‌చ్చ‌ని భార‌త ప్లేయ‌ర్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో ఆ రెండు బంతుల‌కు కూడా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను డీఆర్ఎస్ రివ్యూ తీసుకోవాల‌ని కుల్దీప్ కోరాడు. బ్యాట్స్‌మ‌న్ క‌చ్చితంగా ఔట్ అయి ఉంటాడ‌ని, రివ్యూ తీసుకోవాల‌ని కుల్దీప్ బ‌తిమాలాడాడు. అయితే ప‌క్క‌నే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శ‌ర్మ అది ఔట్ కాద‌ని, వికెట్ల‌ను బంతి మిస్ అవుతుంద‌ని చెబుతూ కుల్దీప్‌కు స‌ర్ది పంపించాడు. రెండు బంతుల‌కు కూడా ఇలాగే జ‌రిగింది. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ‌కు న‌వ్వు ఆగ‌లేదు. కుల్దీప్ బతిమాల‌డం చూసిన రోహిత్ న‌వ్వును ఆపుకోలేక‌పోయాడు. దీంతో స్టేడియంలో, ఇటు లైవ్‌లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రేక్ష‌కులు సైతం కాసేపు న‌వ్వుకున్నారు.

అయితే త‌రువాత రీప్లే చూడ‌గా రోహిత్ చెప్పిన‌ట్లు నిజంగానే ఆ రెండు బంతులు కూడా వికెట్ల‌ను మిస్ అవుతున్నాయ‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో మళ్లీ రోహిత్ స‌హా ప్లేయ‌ర్లంద‌రూ న‌వ్వుకున్నారు. అయితే త‌రువాత మ‌ళ్లీ బౌలింగ్ కు వ‌చ్చిన కుల్దీప్ ఈసారి మాత్రం మిస్ అవ‌కుండా ఎంగిడి వికెట్ తీశాడు. మ‌ళ్లీ ఎల్‌బీ డ‌బ్ల్యూకు అప్పీల్ చేశారు. అయితే ఈసారి అంపైర్ అవుట్ ఇచ్చాడు. ఇక రీప్లేలోనూ బంతి వికెట్ల‌ను తాకుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. దీంతో ఎంగిడి వికెట్ కుల్దీప్‌కు ద‌క్కింది. ఇలా ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. అయితే గ‌తంలోనూ రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో కుల్దీప్ బౌలింగ్ వేస్తే ఎల్బీ రివ్యూల‌కు రోహిత్‌ను ఇలాగే బ‌తిమాలేవాడు. ఆ స‌మ‌యంలో కుల్దీప్ మాట‌ల‌ను న‌మ్మిన రోహిత్ అత‌ని నిర్ణ‌యానికి ప్రాధాన్య‌త ఇచ్చి రివ్యూల‌ను ఎక్కువ‌గా తీసుకునేవాడు. కానీ అవి స‌క్సెస్ అవ‌లేదు. దీంతో తాజాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌తో మ‌ళ్లీ ఆ రోజుల‌ను ప్రేక్ష‌కులు గుర్తు చేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ సంద‌ర్భంగా కాసేపు హాస్య భ‌రిత వాతావ‌ర‌ణం నెలకొంది. దీంతో అంద‌రూ కొద్ది స‌మ‌యం పాటు హాయిగా న‌వ్వుకున్నారు. ఇక ఈ వీడియో సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా సౌతాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను 0-2 తేడాతో భార‌త్‌ క్లీన్ స్వీప్ అయి కోల్పోగా, తాజాగా జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను 2-1 తేడాతో ద‌క్కించుకుంది. ఇక ఈ నెల 9వ తేదీ నుంచి 5 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement