త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rohit Sharma | లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ షో.. ఇంగ్లండ్‌పై సెంచ‌రీ కొట్టిన తొలి భార‌త‌ బ్యాట‌ర్‌గా రికార్డ్‌..

Rohit Sharma | లార్డ్స్ (Lords) వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త జ‌ట్టు (Ind vs Eng) ఓడిన‌ప్ప‌టికీ ప‌లు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. టీమ్ఇండియా (TeamIndia) సీనియ‌ర్‌ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) త‌న అద్భుత శ‌త‌కంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

G

Cricket | Published On Jul 20, 2026, 7.17 am IST

Rohit Sharma | లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ షో.. ఇంగ్లండ్‌పై సెంచ‌రీ కొట్టిన తొలి భార‌త‌ బ్యాట‌ర్‌గా రికార్డ్‌..
Advertisement

Rohit Sharma | త్రినేత్ర‌.న్యూస్‌: లార్డ్స్ (Lords) వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త జ‌ట్టు (Ind vs Eng) ఓడిన‌ప్ప‌టికీ ప‌లు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. టీమ్ఇండియా (TeamIndia) సీనియ‌ర్‌ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) త‌న అద్భుత శ‌త‌కంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో సెంచరీ చేసిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు. 39ఏండ్ల హిట్‌మ్యాన్ త‌నలో ఏమాత్రం జోరు త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూ.. 84 బంతుల్లోనే 100 ప‌రుగుల మైలురాయిన అందుకున్న రోహిత్‌.. 138 ర‌న్స్ (110 బాల్స్‌) చేసి పెవిలియన్​కు చేరాడు. ఇప్ప‌టివ‌ర‌కు లార్డ్స్‌లో మైదానంలో అత్య‌ధిక స్కోర్ రికార్డు గంగూలీ (Sourav Gangully) పేరుతో ఉన్న‌ది. 2004లో సౌరభ్ ఇంగ్లండ్​పై 90 రన్స్ చేశాడు. ఇక‌ ఇంగ్లండ్‌లో వన్డేల్లో రోహిత్​కు ఇది 8వ సెంచరీ కాగా, మొత్తంగా వన్డేల్లో 34వ శతకం.

అదేవిధంగా రోహిత్ వయసు 39 ఏండ్ల‌ 80 రోజులు. దీంతో లార్డ్స్ మైదానంలో వన్డేల్లో సెంచరీ బాదిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఏ ఫార్మాట్లో అయినా శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ, వన్డేల్లో విదేశీ గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్​గా రికార్డుల్లో నిలిచాడు.

విదేశాల్లో అత్యధిక వన్డే సెంచ‌రీలు..

రోహిత్ శర్మ- 8 (ఇంగ్లండ్​లో)
సచిన్ టెండూల్కర్- 7 (యూఏఈలో)
సయీద్ అన్వర్- 7 (యూఏఈలో)
ఏబీ డి విలియర్స్- 7 (భారత్​లో)
క్వింటన్ డి కాక్- 7 (భారత్​లో)

భార‌త్ ఓట‌మి.. మ‌రో సిరీస్ కూడా..

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివ‌రిదైన మూడో వ‌న్డేలో.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 386 పరుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ (ENGvIND) ముందుంచింది. అయితే టీమ్ఇండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల న‌ష్టానికి 360 ర‌న్స్ మాత్ర‌మే చేసి ఓట‌మి చ‌విచూసింది. రోహిత్ శర్మ (138 పరుగులు) సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ (74 పరుగులు), శుభ్​మన్ గిల్ (77 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించిన‌ప్ప‌టికీ.. చివర్లో వికెట్లు కోల్పోవడంతో భార‌త్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ 1-2తో వన్డే సిరీస్​ కూడా కోల్పోయింది. అంత‌కుముందు టీ20 సిరీస్‌లో దారుణంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

 

Advertisement
Advertisement