Nitish Kumar Reddy | మీడియా సమావేశంలో ఉండగా అమ్మ నుంచి ఫోన్.. నితీశ్ రెడ్డి ఏం చేశాడంటే?.. వీడియో
Nitish Kumar Reddy | అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయింది.
Nitish Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 22.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా వాళ్ల అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మీడియా సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నితీశ్ సమాధానం ఇస్తుండగా.. అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్ అవుతుండటంతో మాట్లాడటం ఆపేసిన నితీశ్ మీడియా ప్రతినిథులకు సారీ చెప్పి.. తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేశాడు. అమ్మా.. నేను మళ్లీ చేస్తా అని చెప్పాడు.. కానీ సరిగా వినిపించక పోవటంతో.. మళ్లీ.. అమ్మా నేను ఐదు నిమిషాలు ఆగిచేస్తా అని సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే ఫోన్ పక్కన పెట్టి నవ్వుతూ మీడియాకు మళ్లీ సారీ చెబుతూ.. ప్రెస్‌మీట్ కంటిన్యూ చేశాడు.
నితీశ్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మన తెలుగును ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తున్నాడు’, ‘నితీశ్‌కు అమ్మ అంటే ఎంత ప్రేమో..’, ‘అమ్మ నుంచి కాల్ వస్తే ఎత్తక తప్పదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH
— BCCI (@BCCI) June 13, 2026
సంబంధిత వార్తలు

IND vs AFG Test | ఏకైక టెస్ట్ భారత్‌దే.. అఫ్గానిస్థాన్‌పై ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విక్టరీ
జూన్ 8, 2026

IND vs AFG | 152 రన్స్‌కే అఫ్గాన్ ఆలౌట్.. డెబ్యూ మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ సత్తా
జూన్ 8, 2026

Shreyas Iyer | టీ20 జట్టుకు సారథ్యం దక్కడం గర్వకారణం.. తొలిసారిగా స్పందించిన శ్రేయాస్ అయ్యర్
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల
- ●Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?
- ●Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్
- ●OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్
- ●Waterlogging Hotspots | మొదలైన వానలు.. వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా, ట్రాఫిక్ ఉన్నతాధికారుల పర్యటన
- ●Golconda Murder Case | చెల్లెలి ప్రేమ వివాహం.. పగతో రగిలిన అన్న..

MP Chamala | నిపర్‌లో పారదర్శకతపై చర్యలు తీసుకోవాలి : ఎంపీ చామల

Ajith Daughter | హీరో అజిత్ కూతురి ఫొటోలు చూశారా?

Hyderabad Police | ప్రజాశాంతికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు పోలీసుల వార్నింగ్

OTT | ఓటీటీలోకి తెలుగు వయలెంట్ యాక్షన్ మూవీ - థియేటర్లలో జీరో కలెక్షన్స్‌తో చెత్త రికార్డ్



