Kapil Dev | టీ20లు సరే.. టెస్టుల మాటేమిటి..? వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు..!
Kapil Dev | టీ20 మ్యాచ్‌లలో సత్తా చాటుతూ త్వరలో జరగనున్న వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాకు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
Kapil Dev | టీ20 మ్యాచ్‌లలో సత్తా చాటుతూ త్వరలో జరగనున్న వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాకు మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. టీ20 క్రికెట్‌లో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. భారత క్రికెట్ తన అసలైన గుర్తింపును మరిచిపోకూడదని, క్రికెట్ అంటే టెస్టు మ్యాచ్‌లే అని కపిల్ అన్నారు. పొట్టి ఫార్మాట్‌లో భారత్ అత్యంత శక్తివంతమైన జట్టుగా అవతరించిందని, కానీ టెస్టు క్రికెట్ ను మరిచిపోకూడదని అన్నారు. టీ20లలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నప్పటికీ సొంత గడ్డపై టెస్టుల్లో భారత్ దారుణంగా ఓటమి పాలవుతుండడంతో కపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
సంప్రదాయ క్రికెట్‌ను మరువద్దు: కపిల్
భారత టీ20 జట్టులో దూకుడైన బ్యాట్స్‌మెన్ ఉన్నారని, లోతైన బౌలింగ్ వనరులు, భయం లేని ఆట తీరు ఉందని కపిల్ అన్నారు. ఈ క్రమంలోనే టీ20లలో భారత్ నూతన ప్రమాణాలను నెలకొల్పిందని కపిల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విజయాలను అడ్డు పెట్టుకుని సంప్రదాయ క్రికెట్ (టెస్టులు)ను మరుగున పడేయకూడదని అన్నారు. కపిల్ మాటలను బట్టి చూస్తే భారత్ టెస్టుల్లో విఫలం అవుతుండడంపైనే ఆయన అలా కామెంట్లు చేశారని స్పష్టమవుతోంది. టీ20 క్రికెట్ ఉత్కంఠను కలిగించడంతోపాటు వినోదాన్ని అందిస్తుంది. వాణిజ్య పరంగా కూడా లభాం చేకూరుస్తుంది. ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే టీ20 క్రికెట్ మానసిక బలానికి, టెస్టు క్రికెట్ సహనానికి పరీక్ష లాంటిది. కానీ ప్లేయర్ అసలు నైపుణ్యం తెలిసేది మాత్రం టెస్టుల్లోనే అని కపిల్ అన్నారు. ఐదు రోజుల ఆటలో నిలకడ, సాంకేతికత, మానసిక ధైర్యం అన్నీ పరీక్ష పెడతాయని, వాటిలో ఏ జట్టు అత్యుత్తమంగా నిలిస్తే ఆ జట్టే విజయం సాధిస్తుందని కపిల్ అన్నారు.
భారత టెస్టు వైఫల్యాలను ఉద్దేశించే..
అయితే టీ20 క్రికెట్ ను మాత్రమే కాకుండా వన్డేలు, టెస్టులను కూడా ఆదరించాలని కపిల్ అన్నారు. అప్పుడే భారత్ సంపూర్ణ క్రికెట్ శక్తిగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. వన్డే అంతర్జాతీయ క్రికెట్ ప్రాధాన్యతను కూడా విస్మరించకూడదని ఆయన సూచించారు. మూడు ఫార్మాట్లలో సమతుల్య దృష్టి ఉంటేనే భారత్ తన ప్రతిష్ఠను నిలుపుకోగలదని అన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు భారత టెస్టు మ్యాచ్‌ల వైఫల్యాలను ఉద్దేశించి చేసినవే అని అర్థమవుతోంది. అయితే అంతర్జాతీయ షెడ్యూల్‌కు భారత్ సిద్ధమవుతున్న వేళ కపిల్ మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



