IND Vs PAK U-19 | అండర్-19 ఆసియా కప్ వన్డే మ్యాచ్.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
IND Vs PAK U-19 | దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ చతికిల పడింది. భారత బౌలర్ల ధాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కాగా మ్యాచ్ ప్రారంభానికి ముందు కాసేపు వర్షం ఆటంకిగా నిలిచింది. దీంతో దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభం అయింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. కాగా టాస్ గెలిచిన పాక్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది.
కాగా భారత బ్యాట్స్ మెన్లలో ఆరోన్ జార్జ్ 88 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 85 పరుగులు చేయగా, కన్షిక్ చౌహాన్ 46 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ఆరంభంలో దూకుడుగా ఆడిన భారత్ క్రమంగా వికెట్లు పడే కొద్దీ స్కోరు నెమ్మదిగా చేసింది. దీంతో పూర్తి ఓవర్లు ఆడకుండానే తక్కువ స్కోరు నమోదు చేసి ఆలౌట్ అయింది. ఇక పాక్ బౌలర్లలో మహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ శుబన్లు చెరో 3 వికెట్లను పడగొట్టగా, నికబ్ షఫీక్‌కు 2 వికెట్లు దక్కాయి. అలీ రాజా, అహ్మద్ హుసెయిన్లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ఆది నుంచి దూకుడుగా ఆడలేకపోయింది. జట్టు టాప్ ఆర్డర్ దారుణంగా విఫలం అయింది. పాక్ బ్యాట్స్‌మెన్ వరుస క్రమంలో వికెట్లను సమర్పించుకున్నారు. ఈ క్రమంలో ఈ బ్యాట్స్మెన్లలో హుజైఫా అహ్సన్ తప్ప ఎవరూ రాణించలేకపోయారు. 83 బంతులు ఆడిన అహ్సన్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కన్షిక్ చౌహాన్లు చెరో 3 వికెట్లను పడగొట్టగా, కిషన్ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ చెరొక వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 41.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఈ టోర్నీలో తన రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ నెల 16వ తేదీన మలేషియా అండర్-19 టీమ్‌తో తలపడనుంది.
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



