త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iceland Cricket | అత‌నిలో అద్భుత ప్ర‌తిభ‌.. ఇలాంటి కోచ్‌ను తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు..

Iceland Cricket | టీ20 ప్ర‌పంచ చాంపియ‌న్‌.. హార్డ్ హిట్ట‌ర్ల‌తో నిండిన‌ జ‌ట్టు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, అర్ష్ దీప్ సింగ్‌.. మ‌రీ ముఖ్య‌మంగా ప్ర‌ధాన కోచ్‌కు అత్యంత ఇష్ట‌మైన హ‌ర్షిత్ రాణా జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ.. ప‌సికూన చేతిలో ప‌రాభ‌వం.

G

Cricket | Published On Jun 29, 2026, 11.28 am IST

Iceland Cricket | అత‌నిలో అద్భుత ప్ర‌తిభ‌.. ఇలాంటి కోచ్‌ను తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు..
Advertisement

Iceland Cricket | త్రినేత్ర‌.న్యూస్‌: టీ20 ప్ర‌పంచ చాంపియ‌న్‌.. హార్డ్ హిట్ట‌ర్ల‌తో నిండిన‌ జ‌ట్టు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సంజూ శాంస‌న్‌, అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, అర్ష్ దీప్ సింగ్‌.. మ‌రీ ముఖ్య‌మంగా ప్ర‌ధాన కోచ్‌కు అత్యంత ఇష్ట‌మైన హ‌ర్షిత్ రాణా జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ.. ప‌సికూన చేతిలో ప‌రాభ‌వం. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫ‌లమ‌డంతో ఐర్లాండ్‌తో (Ireland) జ‌రిగిన‌ రెండు టీ20 మ్యాచుల్లోనూ ఓడిపోయిన టీమ్ఇండియా (Team India ) సిరీస్‌ను కోల్పోయిన అప‌ప్ర‌ధ మూట‌గ‌ట్టుకున్న‌ది. దీంతో జ‌ట్టు చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Gautam Gambhir) విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో సెటైర్లతో వార్తల్లో నిలిచే ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు (Iceland Cricket).. గంభీర్‌ను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్న‌ది. అత్యంత ప్ర‌తిభ క‌లిగిన అత‌డిని తమ కోచింగ్ స్టాఫ్‌లోకి (coaching staff) తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

`మేం గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకోవాలని అనుకోవడం లేదు. మాకు ఇష్టం కూడా లేదు. అయితే ఆయనలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఇలాంటి మేటి భారత ఆటగాళ్లను పెట్టుకుని, ఐర్లాండ్ గడ్డపై ఇలాంటి ఫలితాలను రాబట్టడానికి నిజంగా అసాధారణమైన ప్రతిభ కావాలి. అది గంభీర్ వ‌ద్ద పుష్క‌లంగా ఉందనిపిస్తున్న‌ది` అంని ఐస్‌లాండ్ క్రికెట్ పోస్టు చేసింది.

గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం..

మ‌రోవైపు టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌, గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar) తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న బుడ్డోడు వైభ‌వ్ సూర్య‌వంశీని (Vaibhav Sooryavanshi) ఐర్లాండ్‌లో ఆడించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. `ఐర్లాండ్‌ను పెద్ద ముప్పుగా భావించకుండా యువ ఆటగాడు సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇస్తారని నేను నిజంగా అనుకున్నా. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్‌లలో ఒకరికి రెస్ట్ ఇచ్చి, వైభవ్‌ను ఓపెనర్‌గా బరిలోకి దింపాల్సింది. ఇంగ్లండ్‌ వంటి కఠినమైన పర్యటనకు ముందు ఒక యువకుడిని అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేయడానికి ఇది చాలా మంచి మార్గం. కానీ ఎందుకు ఆడించలేదో అర్థం కాలేదు` అండూ గవాస్కర్ మండిప‌డ్డారు.

Advertisement
Advertisement