Arshdeep Singh | అర్షదీప్‌పై గంభీర్ ఫైర్ – షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదుగా!
Arshdeep Singh | రెండో టీ20లో అర్షదీప్ చెత్త బౌలింగ్ ప్రదర్శనపై టీమిండియా కోచ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో అర్షదీప్‌ను గంభీర్ పట్టించుకోలేదు. అతడికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోం
గౌతమ్ గంభీర్, అర్షదీప్ సింగ్
Arshdeep Singh | గురువారం జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో టీమిండియా ప్లేయర్లు తేలిపోయారు. తొలి టీ20లో బౌలింగ్‌తో ఆకట్టుకున్న పేసర్లు రెండో టీ20లో మాత్రం తడబడ్డారు. సౌతాఫ్రికా బౌలర్లను కట్టడి చేయడంలో విఫలమైన టీమిండియా పేసర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్లో ఏడు వైడ్లు వేయడంతో కోచ్ గంభీర్ ఫైర్ అయ్యారు.
పదో ఓవర్ వేసిన అర్షదీప్... ఏడు వైడ్లతో మొత్తం ఆ ఓవర్లో పదమూడు బాల్స్ వేశాడు. టీ20 హిస్టరీలో ఒకే ఓవర్లో హయ్యెస్ట్ బాల్స్ వేసిన పేసర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి.
అర్షదీప్ బౌలింగ్‌పై గంభీర్ అగ్రహం వ్యక్తం చేశాడు. ఒకేఓవర్లో ఏడు వైడ్లు వేయడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గంభీర్ కోపంగా కనిపించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అర్షదీప్‌పై గంభీర్ కోపం తగ్గలేదు. టీమిండియా ప్లేయర్లకు గంభీర్ షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో చివరగా అర్షదీప్ వచ్చాడు. కానీ గంభీర్ మాత్రం అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అర్షదీప్ చేయి చాచినా పట్టించుకోకుండా అతడివైపు కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బౌలింగ్‌లో మాత్రమే కాదు రెండో టీ20లో బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వైస్ కెప్టెన్ గిల్ తక్కువ స్కోర్లకే ఔటవ్వడం టీమిండియాను దెబ్బకొట్టింది. వారిద్దరిపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
మూడో టీ20లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ పరంగా టీమిండియాలో కొన్ని మార్పులు ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్షదీప్ సింగ్‌ను పక్కనపెట్టవచ్చని చెబుతున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా , సౌతాఫ్రికా 1-1తో సమంగా ఉన్నాయి.
After today's loss, Gautam Gambhir was looking angry during the handshake with Indian players like Jitesh Sharma and Arshdeep Singh.
Look at the attitude of this man; rather than boosting the confidence of players, he was looking at them angrily 💔 pic.twitter.com/0nJTTZ8qfQ
— Tejash (@Tejashyyyyy) December 11, 2025
సంబంధిత వార్తలు

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026

ICC Test Rankings | ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. మూడో స్థానానికి భారత్
మే 1, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



