RS Praveen Kumar | సీఎం రేవంత్ మీద కేసు నమోదు చేయాల్సిందే.. BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి
RS Praveen Kumar | రాష్ట్ర పోలీసు శాఖలో ఏ మాత్రం ప్రొఫెషనలిజం ఉన్నా.. సీఎం రేవంత్ రెడ్డి మీద తక్షణమే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ రక్తపు భాష ఆపకపోతే.. రాష్ట్రంలో రక్తపాతం జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర పోలీసు శాఖలో ఏ మాత్రం ప్రొఫెషనలిజం ఉన్నా.. సీఎం రేవంత్ రెడ్డి మీద తక్షణమే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ రక్తపు భాష ఆపకపోతే.. రాష్ట్రంలో రక్తపాతం జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ మీద కేసు ఎందుకు నమోదు చేయాలో బీఎన్ఎస్ సెక్షన్ 45 మళ్లీ మళ్లీ చదవండి అని ఆర్ఎస్పీ సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి ఎక్స్ వేదికగా ఆర్ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
గౌరవ తెలంగాణ డీజీపీ గారు.. దయచేసి దీన్ని పూర్తిగా చదవండి..
ఏ మాత్రం ప్రొఫెషనలిజం ‘మన’పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఇంకా మిగిలి ఉన్నా మీరు వెంటనే సుమోటోగా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చెయ్యాలి. పరిస్థితి చేయి దాటక ముందే నివారించండి. చట్టంలో (BNSS and BNS) ఎక్కడా సీఎం గారికి మినహాయింపు లేదు. ఆయనను అరెస్టు చేస్తే కేవలం అసెంబ్లీ స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలి. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణ కానే కాదు.
ఒక్క సారి కూల్‌గా ఆలోచించండి..
“రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు బాగా పండుతాయి” అని ఏకంగా సీఎం గారే సలహా ఇచ్చారని ఎవరైనా అగంతకుడు, పంట పొలంలో నిద్రిస్తున్న అమాయక రైతులను చంపి షాబాద్ రాజ్ కుమార్ లాగా వీడియోలు చేస్తే రైతుల పరిస్థితి ఏమిటి?
సీఎం రేవంత్ గారే చెప్పారని మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారిపై ఎవరైనా ఆగంతకులు మిగతా అగ్ర నాయకులపై దాడి చేస్తే..? సీఎం గారే “బెల్టుతో కొట్టమన్నారని” భర్తలు బెల్టు షాపుల్లో తాగి వచ్చి భార్యా పిల్లలను బెల్టులతో కొడితే? కింది ఉద్యోగులు పై అధికారులను బెల్టులతో కొడితే పరిస్థితి ఏంటి?.
మైనంపల్లి హన్మంత్ రావు గారు గతంలో బీఆర్ఎస్ అగ్రనాయకుల మీద పెట్రోల్ పోసి తాను కూడా షాబాద్ రాజ్ కుమార్ లాగా పోసుకుంటా అని బహిరంగంగా గజ్వేల్‌లో కార్యకర్తలను ప్రేరేపించాడు. కనీసం ఆయన మీద కేసు కూడా రిజిస్టరు చేయకుండా పీపీ ఒపీనియన్ తీసుకొని ఇది సివిల్ కేసు అని చెప్పారు నాటి సిద్దిపేట పోలీసు కమీషనర్! దీన్ని ప్రజలు మరచిపోరు.
సంగారెడ్డిలో శౌర్య పతక విజేత ఇన్‌స్పెక్టర్ శివకుమార్ యాదవ్ అంతు చూస్తా అన్న టీపీసీసీ జగ్గారెడ్డి గారికి కనీసం నోటీసులు అయినా ఇచ్చారా? పోస్టింగ్లు ఈ రోజు ఉంటయి రేపు పోతాయి, కానీ పోలీసు వ్యవస్థ, దాని ప్రతిష్ట గురించి ప్రజల జీవించే హక్కు (Art 21) గురించి ఆలోచించండి. మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. రాజ్యాంగం 311 అధికరణం మిమ్మల్ని కాపాడుతుంది.
అందుకే.. దయచేసి BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి. లీగల్ ఒపీనియన్ తీసుకోండి. సీఎం గారికి నోటీసులు ఇవ్వండి. ఆయన వివరణతో సంతృప్తి చెందకపోతే కేసు నమోదు చేయండి. మెడికల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. దర్యాప్తు చేయండి. నేరం జరుగుతున్నపుడు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే. ఈ రక్తపు భాష ఆగకపోతే రాష్ట్రంలో రక్తపాతం జరిగే ప్రమాదముంది. వేలాది మంది అమాయకులు బలవుతారు. చరిత్ర పుటలు మరోసారి తిరగేయండి. అప్పుడే మీకు అర్థం అవుతుంది అని డీజీపీకి ఆర్ఎస్పీ సూచించారు.
తాజావార్తలు
- ●BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే
- ●Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
- ●Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్
- ●Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు
- ●CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

BC Reservations | ప్రతి కులానికి ‘యూనిక్ కోడ్’ కేటాయించాల్సిందే

Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..

Gosula Srinivas Yadav | ఉద్యమకారులను బెదిరిస్తే తగిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాదవ్

Uttam Kumar Reddy | ప్రజాస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధికి వెయ్యి రోజులు




