Dale Steyn | నెటిజన్ కామెంట్లకు డేల్ స్టెయిన్ కౌంటర్.. గట్టిగా తిప్పికొట్టిన మాజీ పేస్ బౌలర్..
Dale Steyn | టీ20 వరల్డ్‌కప్ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందించారు. భారత జట్టుపై ప్రతికూల భావంతో వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఓ నెటిజన్ ఆయనపై విమర్శలు చేశాడు. స్టెయిన్ చేసిన పోస్టుల్లో నెగటివ్ వైబ్స్ ఉన్నాయని ఆ నెటిజన్ ఆరోపించాడు.
Dale Steyn | టీ20 వరల్డ్‌కప్ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ స్పందించారు. భారత జట్టుపై ప్రతికూల భావంతో వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఓ నెటిజన్ ఆయనపై విమర్శలు చేశాడు. స్టెయిన్ చేసిన పోస్టుల్లో నెగటివ్ వైబ్స్ ఉన్నాయని ఆ నెటిజన్ ఆరోపించాడు. దీనికి స్టెయిన్ వెంటనే స్పందిస్తూ, అలా అనిపిస్తే ఒక్క ఉదాహరణ చూపించండి.. అని సూటిగా ప్రశ్నించారు. భారత్-యూఎస్ఏ మ్యాచ్‌లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి.
తప్పిన స్టెయిన్ అంచనా..
కాగా భారత్-యూఎస్ఏ మ్యాచ్‌కు ముందు స్టెయిన్ ఒక అంచనా వేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో 300 పరుగులు చేసే తొలి జట్టు భారత్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 161/9 మాత్రమే చేయగలిగింది. యూఎస్ఏ 132/8 పరుగులు చేయడంతో, మ్యాచ్‌లో మొత్తం స్కోరు 297 వద్దే ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తూ 49 బంతుల్లో 84 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం సదరు నెటిజన్ చేసిన కామెంట్స్, అందుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై.. ఇవన్నీ సోషల్ మీడియాలో క్రికెటర్లకు ఎదురయ్యే విమర్శల స్వరూపాన్ని మరోమారు బయట పెట్టినట్లు అయింది. అభిమానులు తరచూ భావోద్వేగాలతో స్పందిస్తూ, ఆటగాళ్లను ఉద్దేశించి విమర్శలు చేయడం సాధారణమైపోయింది. అలాంటి సందర్భాల్లో స్టెయిన్ ఇచ్చిన సూటి, స్పష్టమైన సమాధానం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
Dale Steyn’s tweets seem full of negative vibes toward the Indian team, come across as subtle jibes.
— 🦁 (@AndColorPockeT) February 7, 2026
You know nothing about my salary so save your pathetic jibe. I pose the same question to you, show me what I’ve said that’s negative or untrue about any player or the team? You can’t.
That said, It’s not my fault if the coaches make or say the wrong things, I just call it out, I…— Dale Steyn (@DaleSteyn62) February 8, 2026
వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు..
ఇక ఈ వివాదం మధ్యలోనూ స్టెయిన్ యువ ప్రతిభను గుర్తించడాన్ని మర్చిపోలేదు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 14 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని స్టెయిన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్‌ను విజేతగా నిలిపిన వైభవ్ ప్రదర్శనను స్టెయిన్ కొనియాడారు. అందరూ అతని గురించే ట్వీట్ చేస్తున్నారు. నేనూ చేయాల్సిందే.. వైభవ్ నిజంగా వండర్ బాయ్. స్కూల్ పూర్తయ్యేలోపే ఐపీఎల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.. అంటూ స్టెయిన్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అయితే కొందరు మాత్రం స్టెయిన్ ను ఇప్పటికీ భారత్‌పై పక్షపాతం చూపిస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. అయినప్పటికీ తాను చదివిన కామెంట్లకు స్టెయిన్ మాత్రం ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



