Cricket Australia | శాండ్ పేపర్ గేట్ ఘటన తరువాత 8 ఏళ్లకు సౌతాఫ్రికాలో ఆసీస్ పర్యటన
Cricket Australia | క్రికెట్ ప్రపంచంలో అప్పట్లో సంచలనం సృష్టించిన శాండ్ పేపర్ గేట్ సంఘటన అనంతరం ఎట్టకేలకు ఆస్ట్రేలియా జట్టు మళ్లీ సౌతాఫ్రికాలో టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతోంది. 2018లో ఆ సంఘటన చోటు చేసుకోగా క్రికెట్ ఆస్ట్రేలియాపై అది ఒక మచ్చగా మిగిలిపోయింది.
Cricket Australia | క్రికెట్ ప్రపంచంలో అప్పట్లో సంచలనం సృష్టించిన శాండ్ పేపర్ గేట్ సంఘటన అనంతరం ఎట్టకేలకు ఆస్ట్రేలియా జట్టు మళ్లీ సౌతాఫ్రికాలో టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతోంది. 2018లో ఆ సంఘటన చోటు చేసుకోగా క్రికెట్ ఆస్ట్రేలియాపై అది ఒక మచ్చగా మిగిలిపోయింది. ఆ ఉదంతం వారి ప్రతిష్టను మసకబార్చింది. అయితే ఆ తరువాత 8 ఏళ్లకు ఇప్పుడు సౌతాఫ్రికాలో మళ్లీ ఆసీస్ టెస్టుల కోసం పర్యటించనుంది. ఈ మేరకు సౌతాఫ్రికాలో ఆసీస్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మొదట మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తరువాత 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నిర్వహిస్తారు.
షెడ్యూల్ ఇదే..
ఈ ఏడాది సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఆసీస్ మొదట 3 వన్డేలను ఆడనుంది. తొలి వన్డే సెప్టెంబర్ 24న డర్బన్‌లోని కింగ్స్ మీడ్ మైదానంలో జరుగుతుంది. తరువాత 2వ వన్డేను జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో సెప్టెంబర్ 27న నిర్వహిస్తారు. చివరి వన్డే సెప్టెంబర్ 30న పోచెఫ్స్ట్రూమ్ లోని జేబీ మార్క్స్ ఓవల్ లో జరుగుతుంది.
వన్డే సిరీస్ అనంతరం టెస్ట్ సిరీస్ అక్టోబర్ 9న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ అక్టోబర్ 18 నుంచి క్యూబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో జరుగుతుంది. మూడో టెస్ట్ ను అక్టోబర్ 27 నుంచి కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో నిర్వహిస్తారు. కాగా ఇదే మైదానంలో 2018లో శాండ్ పేపర్ గేట్ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఆసీస్ పరువు తీసిన ప్లేయర్లు..
2018లో జరిగిన బాల్‌టాంపరింగ్ ఘటనలో ఆసీస్ ప్లేయర్ కామెరాన్ బ్యాన్‌క్రాఫ్ట్ శాండ్ పేపర్‌తో బంతిని మార్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. వెంటనే అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లతోపాటు బ్యాన్‌క్రాఫ్ట్‌పై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు. స్మిత్, వార్నర్‌లపై 12 నెలల నిషేధం విధించగా, బ్యాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల సస్పెన్షన్ విధించారు. వివాదం అనంతరం స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, టిమ్ పైన్ ఆసీస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. వైస్ కెప్టెన్ పదవిని కూడా వార్నర్ వదులుకున్నాడు. అయితే ఈ వివాదం కేవలం ఆటగాళ్లతోనే ఆగిపోలేదు. అప్పటి క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్లాండ్ దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. ఈ సంఘటన కారణంగా సదర్లాండ్ సహా పలువురు ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. నేరుగా సంబంధం లేకపోయినా, జట్టు కొత్త ఆరంభం కోసం హెడ్ కోచ్ డారెన్ లీమన్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.
8 ఏళ్ల తరువాత ఇప్పుడే..
ఇక ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా, స్టీవ్ స్మిత్ 8 ఏళ్ల తర్వాత న్యూలాండ్స్ మైదానానికి తిరిగి రానున్నాడు. 2018 న్యూలాండ్స్ టెస్ట్‌లో పాల్గొన్న జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్ కూడా కేప్‌టౌన్‌లో మళ్లీ ఆడనున్నారు. ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. సూపర్ 8 దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. జింబాబ్వే, శ్రీలంకల చేతిలో పరాజయాలు, పల్లెకెలెలో ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం ఆస్ట్రేలియాను టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించేలా చేశాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nepal Floods 2026 Death Toll | నేపాల్‌లో ఆగని మృత్యుఘోష: 300 మంది భారతీయుల గల్లంతు.. విరుచుకుపడనున్న మరో ‘గ్లేసియర్’ ముప్పు
- ●Thriller OTT | ప్రేమిస్తే భరత్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - విలన్‌గా లేడీ యాంకర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే
- ●NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య
- ●Telangana Seed Act | నకిలీ, నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతుకు తక్షణమే నష్టపరిహారం
- ●Batti Vikramarka | మారిషస్‌లో తెలుగును ప్రమోట్ చేసేందుకు సహకరిస్తాం

Nepal Floods 2026 Death Toll | నేపాల్‌లో ఆగని మృత్యుఘోష: 300 మంది భారతీయుల గల్లంతు.. విరుచుకుపడనున్న మరో ‘గ్లేసియర్’ ముప్పు

Thriller OTT | ప్రేమిస్తే భరత్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ - విలన్‌గా లేడీ యాంకర్ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Traffic diversions | రేపే హైదరాబాద్ రన్నర్స్ మారథాన్.. ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే

NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య






