BCCI | ఆస్ట్రేలియా టూర్‌కు భారత మహిళల జట్లను ప్రకటించిన బీసీసీఐ
BCCI | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళల జట్లను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన జట్టును ఇంకా ప్రకటించలేదు.
BCCI | బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళల జట్లను ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించిన జట్టును ఇంకా ప్రకటించలేదు. భారత మహిళల క్రికెట్ సెలక్షన్ కమిటీ వన్డే, టీ20 సిరీస్‌లకు సంబంధించిన జట్లను ఖరారు చేయగా, యువతకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక మార్పులు చేసింది. టీ20 జట్టులో ప్రధాన ఆకర్షణగా బ్యాటర్ భారతి ఫుల్మలి రీఎంట్రీ ఇచ్చింది. 2019 తర్వాత తొలిసారి జాతీయ జట్టుకు ఆమెకు అవకాశం లభించింది. ఆమెతో పాటు ప్రతిభావంతమైన ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు కూడా జట్టులో చోటు దక్కింది.
అయితే సెలెక్టర్లు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అనుభవజ్ఞురాలైన హర్లీన్ డియోల్‌ను టీ20 జట్టు నుంచి తప్పించారు. అయితే ఆమె వన్డే జట్టులో మాత్రం కొనసాగుతోంది. రాధా యాదవ్‌కు టీ20తో పాటు వన్డే జట్టులోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. వన్డే జట్టులో సెలెక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ప్లేయర్లకు అవకాశం ఇచ్చారు. 17 ఏళ్ల వికెట్‌కీపర్ జి.కమలిని, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మలకు తొలి వన్డే కాల్ అవకాశం లభించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో వీరు ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో ఈ అవకాశం దక్కింది. అలాగే వన్డే జట్టులో కశ్వీ గౌతమ్‌కు అవకాశం కల్పించారు. మరోవైపు పేసర్ అరుంధతి రెడ్డిని వన్డే జట్టు నుంచి తప్పించారు.
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళల టీ20 జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జి.కమలిని (వికెట్‌కీపర్), అరుంధతి రెడ్డి, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మలి, శ్రేయాంక పాటిల్.
వన్డే జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, రేణుకా ఠాకూర్, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జి.కమలిని (వికెట్‌కీపర్), కశ్వీ గౌతమ్, అమన్‌జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్.
షెడ్యూల్ ఇదే..
ఆస్ట్రేలియాలో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను ముందుగా ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15వ తేదీన తొలి టీ20 సిడ్నీ ఎస్సీజీలో జరుగుతుంది. తరువాత ఫిబ్రవరి 19, 21 తేదీల్లో రెండో, మూడో టీ20లను మనూకా ఓవల్, అడిలైడ్ ఓవల్‌లో నిర్వహిస్తారు. ఆ తరువాత మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి వన్డేను బ్రిస్బేన్‌లో ఫిబ్రవరి 24న నిర్వహిస్తారు. రెండో వన్డే హోబార్ట్‌లో ఫిబ్రవరి 27న, మూడో వన్డే తిరిగి అదే వేదికలో మార్చి 1వ తేదీన జరుగుతుంది. ఆ తరువాత మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ను పెర్త్ మైదానంలో నిర్వహిస్తారు. అయితే టెస్టు మ్యాచ్‌కు మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు.
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

BCCI | బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు.. స్పష్టం చేసిన సీఐసీ..!
మే 18, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



