Zomato | యూజర్లకు షాక్ ఇచ్చిన జొమాటో.. మరోసారి ప్లాట్‌ఫాం ఫీజు పెంపు..!
Zomato | ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటొ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మరోసారి ప్లాట్‌ఫాం ఫీజును పెంచింది. శుక్రవారం యాప్‌లో కనిపించిన బిల్లింగ్ వివరాల ప్రకారం.. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఫీజును రూ.2.40 (19.2 శాతం) పెంచింది.
Zomato | ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటొ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మరోసారి ప్లాట్‌ఫాం ఫీజును పెంచింది. శుక్రవారం యాప్‌లో కనిపించిన బిల్లింగ్ వివరాల ప్రకారం.. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఫీజును రూ.2.40 (19.2 శాతం) పెంచింది. దీంతో ప్రీ-జీఎస్టీ ఆధారంగా ఈ ఛార్జ్ రూ.12.50 నుంచి రూ.14.90కు చేరింది. ఎల్పీజీ, ముడి చమురు ధరలు పెరగడంతో రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాముల ఖర్చులు అధికమవుతున్న నేపథ్యంలో పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఆపరేషనల్ వ్యయాలను సమన్వయం చేసుకునేందుకు ఫుడ్ డెలివరీ సంస్థలు ధరల్లో మార్పులు చేస్తున్నాయి. గతంలో కూడా ఫీజుల్లో మార్పులు చేసిన జొమాటో.. 2023 ఆగస్టులో తొలిసారిగా ఒక్కో ఆర్డర్‌కు రూ.2 ప్లాట్‌ఫాం ఫీజును అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత దశలవారీగా పెంచుతూ వచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో పండుగల సీజన్ సందర్భంగా ఈ ఫీజు రూ.6 నుంచి రూ.10కు పెంచింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో మరోసారి సవరణలు చేసింది. ఇదిలా ఉండగా కంపెనీ ప్రత్యర్థి సంస్థ స్విగ్గీ ఒక్కో ఆర్డర్‌పై పన్నులతో కలిపి రూ.4.99 వసూలు చేస్తోంది. దీంతో ఈ రెండు సంస్థల మధ్య పోటీ కొనసాగుతోంది. పెరుగుతున్న ఖర్చుల నడుమ లాభదాయకత (మార్సిన్స్) మెరుగుపర్చడంపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే, జొమాటో షేర్ ధర శుక్రవారం రూ.233 వద్ద ముగిసింది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 1.86 శాతం పెరిగింది. వారంలో సుమారు 7.5 శాతం లాభాలను నమోదు చేసింది. అయితే, గత నెలతో పోలిస్తే దాదాపు 13 శాతం తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ సమీకృత నికర లాభం 72.88 శాతం పెరిగి రూ.102 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.59 కోట్లు మాత్రమే. ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా రూ.5,405 కోట్ల నుంచి రూ.16,315 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ఖర్చులు కూడా గణనీయంగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






