Credit Score | ఎంత ట్రై చేసినా మీ క్రెడిట్ స్కోర్ పెరగడం లేదా.. ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి
Credit Score | క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా.. బ్యాంకుల నుంచి లోన్లు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించే సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ అంటే అంత ఈజీగా లోన్లు పొందవచ్చు. కానీ దాన్ని మెయింటైన్ చేయడం అనుకున్నంత సులువు కాదు.
Credit Score | క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా.. బ్యాంకుల నుంచి లోన్లు పొందాలన్నా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. మన ఆర్థిక సామర్థ్యాన్ని చూపించే సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ అంటే అంత ఈజీగా లోన్లు పొందవచ్చు. కానీ దాన్ని మెయింటైన్ చేయడం అనుకున్నంత సులువు కాదు. మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే క్రెడిట్ స్కోర్ 5 లేదా 10 పాయింట్లు పెరిగి అక్కడే ఆగిపోతుంది. దీంతో క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో అర్థంకాక తలలు పట్టుకుంటారు. కానీ క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుందని విశ్లేషణ మాత్రం చేసుకోరు. సిబిల్ పెరగకపోవడానికి చాలావరకు మనం చేసే చిన్న చిన్న తప్పులే కారణమవుతాయి. వాటిని సరిదిద్దుకుంటే హెల్తీ క్రెడిట్ స్కోర్‌ను ఈజీగా మెయింటైన్ చేయవచ్చు.
పేమెంట్లు మిస్సవ్వడం
క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలను చాలామంది మిస్ చేస్తుంటారు. గడువు దాటిన తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత పేమెంట్లు చేస్తారు. దీనివల్ల ఎలాంటి పెనాల్టీ పడదు కదా అని వెసులుబాటు చూసుకుంటారు. ఇలా ఒకటి రెండు సార్లు అంటే ఫర్లేదు కానీ.. రిపీటెడ్‌గా జరిగితే మనపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సిబిల్ స్కోర్ రిపోర్టును సదరు బ్యాంకులు నెగెటివ్‌గా పంపిస్తాయి. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే.. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐ మరిచిపోకుండా ఉండేందుకు రిమైండర్ పెట్టుకోవాలి. గడువు తేదీ కంటే ఎంత ముందు వీలైతే అంత ముందు పేమెంట్లు చేయాలి. అది కుదరని సమయంలో మినిమమ్ బ్యాలెన్స్ అయినా పే చేయాలి. దీనివల్ల బ్యాంకులకు మీ మీద పోయిన నమ్మకాన్ని కొంచెం కొంచెం పొందవచ్చు. అప్పుడు క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.
అతి వాడకం అనార్థమే!
క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని చాలామంది విచ్చలవిడిగా వాడేస్తుంటారు. ఉదాహరణకు లక్ష రూపాయల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు ఉంటే దాదాపు 90 వేలకు పైగానే వాడేస్తారు. దీనివల్ల మన ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందనే విషయం బ్యాంకులకు అర్థమైపోతుంది. ఇలా పరిమితికి మించి వాడేయడం ద్వారా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అందుకే క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతంలోపే వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నప్పుడు ఒక దాంట్లో 60 శాతం కంటే ఎక్కువగా వాడేస్తారు. మరో కార్డులో 10 శాతం కూడా వాడరు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు అన్ని కార్డుల్లోనూ తక్కువ పరిమితిలోనే వాడితే మంచిది. అంటే ఒక కార్డులోనే 60 శాతం వాడే బదులు.. రెండు కార్డుల్లో చెరో 35 శాతం వాడటం బెటర్.
పాత బకాయిలపై చిన్నచూపు వద్దు!
పాత రుణాలు SETTLED లేదా WRITE-OFF అయిపోయిందని చాలామంది పట్టించుకోరు. కానీ అది ఎల్లప్పుడూ క్రెడిట్ రిపోర్టులో రిమార్క్‌గానే ఉండిపోతుంది. మీ స్కోర్‌ను తగ్గించేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వాటిని తీర్చేయాలి. అలాగే ఒక్కోసారి లోన్ మొత్తం కట్టేసినప్పటికీ ఆ వివరాలను బ్యాంకులకు క్రెడిట్ సంస్థలకు అప్‌డేట్ చేయవు. దానివల్ల కూడా ఆ లోన్ అకౌంట్ SETTLED లేదా WRITE-OFF అని చూపిస్తుంది. కాబట్టి తరచూ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవడం మంచిది. అలా మీరు కట్టేసిన రుణాలకు SETTLED లేదా WRITE-OFF అని చూపిస్తే బ్యాంకును సంప్రదించి అప్‌డేట్ చేయించుకోవాలి.
కొత్త క్రెడిట్ కార్డులు, లోన్ల కోసం పాకులాట
తమ ఆర్థిక స్థితి వల్ల చాలామంది తరచూ లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేస్తుంటారు. అలా చేసిన దరఖాస్తులు రిజెక్ట్ అయినప్పటికీ మళ్లీ మళ్లీ అప్లై చేస్తూనే ఉంటారు. అత్యధిక వడ్డీ రేట్లు ఉన్నా సరే రుణాలను తీసుకుంటుంటారు. ఇది కూడా క్రెడిట్ రిపోర్టు మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను అస్థిరంగా మారుస్తుంది. ఇలాంటి హార్డ్ ఎంక్వైరీల కారణంగా మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం సాధ్యం కాదు.
క్రెడిట్ మిక్స్ కూడా అవసరమే!
బ్యాంకుల్లో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోయినా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం అసాధ్యం. అనవసరపు రిస్క్ ఎందుకని చాలామంది క్రెడిట్ కార్డుల జోలికి వెళ్లరు. కానీ మీ క్రెడిట్ స్కోర్ పెరగాలని అనుకున్నప్పుడు క్రెడిట్ కార్డు వాడితే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ లిమిట్‌తో క్రెడిట్‌కార్డులు తీసుకుని.. సరైన సమయానికి బిల్లు చెల్లించాలని చెబుతున్నారు. క్రెడిట్ కార్డులతో పాటు చిన్న చిన్న లోన్లు తీసుకుని వాటిని సక్రమంగా చెల్లించినప్పుడు క్రెడిట్ మిక్స్ బాగుంటుంది. అప్పుడు స్కోర్‌ను ఈజీగా పెంచుకోవచ్చు.
సంబంధిత వార్తలు

Credit Cards | క్రెడిట్ కార్డులను ఇలా వాడితేనే లాభం.. లేదంటే అప్పుల భారం..
మే 16, 2026

Minister Seethakka | మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్.. వడ్డీ లేని రుణపరిమితి రూ.10 లక్షలకు పెంపు: మంత్రి సీతక్క
మే 7, 2026

Home Loan | హోం లోన్ తీసుకుంటున్నారా.. బెస్ట్ డీల్ లభించాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి..?
మే 3, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



