త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Stock Markets | భార‌త స్టాక్ మార్కెట్ల‌లో నెల‌కొన్న అనిశ్చితి.. ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చేనా..?

S

Business | Published On Dec 16, 2025, 7.09 pm IST

Indian Stock Markets | భార‌త స్టాక్ మార్కెట్ల‌లో నెల‌కొన్న అనిశ్చితి.. ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చేనా..?
Advertisement

Indian Stock Markets | భార‌త స్టాక్ మార్కెట్లు గ‌త కొంత కాలంగా మంద గ‌మ‌నంలో ఉన్నాయి. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి ద‌గ్గ‌ర‌లో ఉంది కానీ అక్క‌డి నుంచి ముందుకు క‌ద‌ల‌డం లేదు. మ‌రోవైపు ఎఫ్ఐఐ లు సైతం పెట్టుబ‌డుల‌పై నిరాక‌స్త‌త‌గా ఉన్న‌ట్లు మార్కెట్ల ప‌రిస్థితిని చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న‌ట్లుగా స్టాక్ మార్కెట్ల ప‌రిస్థితి త‌యారైంది. ఇక ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ల‌లో ప‌తనం కొన‌సాగింది. సెన్సెక్స్ సుమారుగా 500 పాయింట్లకు పైగా ప‌త‌నం అవ‌గా, నిఫ్టీ 167 పాయింట్లు ప‌త‌నం అయింది. ఈ క్ర‌మంలో ఇవాళ ఒక్క‌రోజే రూ.4 ల‌క్ష‌ల కోట్ల మ‌దుప‌ర్ల సంప‌ద ఆవిరైంది. గ‌త కొంత కాలంగా దేశీయ మార్కెట్ల‌పై తీవ్ర‌మైన ఒత్తిడి కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే మార్కెట్ ముందుకు సాగ‌క‌పోతే ఎలా అనే ఆందోళ‌న ఇన్వెస‌ర్ల‌లో నెల‌కొంది.

డాల‌ర్ విలువ‌..

అమెరికాలో ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ వ‌డ్డీ రేట్ల త‌గ్గింపుపై సందిగ్ధ‌త నెల‌కొన్న విష‌యం విదిత‌మే. దీని వ‌ల్ల ప్ర‌పంచ మార్కెట్లు సైతం ఆందోళ‌న చెందుతున్నాయి. దీని ప్ర‌భావం మ‌న మార్కెట్ల‌పై కూడా ప‌డుతోంది. అలాగే అమెరికా క‌రెన్సీ డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి విలువ రోజు రోజుకీ ప‌డిపోతుండ‌డం కూడా ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళ‌న‌ను పెంచుతోంది. డాల‌ర్‌తో పోలిస్తే మ‌న రూపాయి విలువ ప్ర‌స్తుతం 90గా కొన‌సాగుతోంది. ఇది ఆల్ టైమ్ హైగా ఉన్న నేప‌థ్యంలో ఈ విలువ కొద్ది రోజుల్లోనే 100ను తాకుతుంద‌ని కూడా మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దీని వ‌ల్ల కూడా మార్కెట్ సెంటిమెంట్ దెబ్బ తింటోంది. మార్కెట్‌లు మంద‌గ‌మ‌నంలో ఉండేందుకు క‌రెన్సీ విలువ ప‌డిపోతుండ‌డం కూడా ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

ఎఫ్ఐఐలు..

గ‌త ఏడాది కాలంగా ఎఫ్ఐఐలు (విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు) త‌మ పెట్టుబ‌డుల‌ను మ‌న మార్కెట్ల నుంచి ఉప‌సంహ‌రించుకుంటున్నారు. మ‌ధ్య‌లో అడ‌పా ద‌డ‌పా ఒక‌టి రెండు సార్లు పెట్టుబ‌డి పెట్టారు త‌ప్ప ఏడాదిలో చాలా వ‌ర‌కు అమ్మ‌కాలే సాగించారు. దీని వ‌ల్ల కూడా మార్కెట్లు తిరోగ‌మ‌నం దిశ‌లో ఉన్నాయి. ఇక భార‌త్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌పై కూడా స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. అమెరికా ఈ టారిఫ్‌ను ర‌ద్దు చేస్తుంద‌ని భావిస్తున్నారు. కానీ ఈ విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. దీని వ‌ల్ల కూడా ఎఫ్ఐఐలు మ‌న మార్కెట్ల నుంచి నిష్క్ర‌మిస్తున్నారు. ఇది కూడా దేశీయ ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. అలాగే మార్కెట్‌ల‌లో ప్ర‌ధాన భాగం వాటాల‌ను క‌లిగి ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు వంటి బ్యాంకుల షేర్లు ప‌డిపోతుండ‌డం, ఐటీ రంగంపై నెల‌కొన్న ఒత్తిడి, ఉద్యోగుల తొల‌గింపు, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు వంటి అంశాలు కూడా మార్కెట్‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయి. దీని వ‌ల్ల నిఫ్టీ ఆల్‌టైమ్ హై నుంచి ముందుకు క‌ద‌ల‌డం లేదు. అలాగే ఇత‌ర సూచీలు కూడా దాదాపుగా ఇలాంటి ద‌శ‌లోనే ఉన్నాయి. అయితే రానున్న నూత‌న సంవ‌త్స‌రంలో మార్కెట్ పుంజుకుంటుంద‌ని నిపుణులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement