SBI | ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. డార్క్ వెబ్‌లో డేటా.. స్పందించిన బ్యాంక్..
SBI | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో బహిర్గతమై ఉంటుందని అనుమానిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా విశ్లేషించగా, వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారాన్ని కలిగి ఉన్న 3,897 మంది కస్టమర్ల రికార్డులను గుర్తించినట్లు బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ప్రకటనలో పేర్కొంది.
SBI | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల డేటా డార్క్ వెబ్‌లో బహిర్గతమై ఉంటుందని అనుమానిస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా విశ్లేషించగా, వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారాన్ని కలిగి ఉన్న 3,897 మంది కస్టమర్ల రికార్డులను గుర్తించినట్లు బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన ప్రకటనలో పేర్కొంది. బహిర్గతమైన సమాచారంలో కస్టమర్ల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, లింగం, ఈ-మెయిల్ చిరునామాలు, నివాస చిరునామాలు, బ్యాంకు శాఖ వివరాలు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ (సీఐఎఫ్) గుర్తింపు సంఖ్యలు ఉన్నట్లు తెలిపింది. వీటితోపాటు లీడ్ ఐడీలు, రుణాలు లేదా లీడ్ రికార్డులకు సంబంధించిన మెటాడేటా, ఇతర సంబంధిత ఫైళ్ల సమాచారం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
ఎస్‌బీఐ నష్ట నివారణ చర్యలు..
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే బ్యాంకు సైబర్ ఘటనల ప్రతిస్పందన, నష్ట నివారణ ప్రోటోకాల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే ఘటన స్వభావం, ప్రభావం, సమాచార బహిర్గతం జరిగిన తీరును సమగ్రంగా పరిశీలించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఇన్) గుర్తింపు పొందిన స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థను నియమించినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అక్టోబర్ 16న తమ థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, సీఈఆర్‌టీ-ఇన్ నుంచి సమాచారం అందిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసినట్లు బ్యాంకు తెలిపింది. బహిర్గతమైన డేటా నిజమైందేనా, అందులో సమాచారం పూర్తిగా ఉందా అనే విషయాలను నిర్ధారించాల్సి ఉందని ఎస్‌బీఐ పేర్కొంది. అలాగే, సమాచారం బహిర్గతం కావడానికి గల కారణాలు, దాని మూలం, ఎంతమేరకు సమాచారం ప్రభావితమైందనే అంశాలతోపాటు కస్టమర్లు, బ్యాంకుకు ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయడానికి సమగ్ర దర్యాప్తు అవసరమని స్పష్టం చేసింది.
https://twitter.com/CNBCTV18Live/status/2112747904800817392
ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు: ఎస్‌బీఐ
ఈ ఘటన వల్ల బ్యాంకు ప్రధాన వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా వ్యాపార కొనసాగింపుపై ఎలాంటి గణనీయమైన ప్రభావం పడలేదని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంకు ప్రధాన సేవలు ఎలాంటి అంతరాయాలు లేకుండా యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర అంచనా కొనసాగుతోందని, అవసరమైన దిద్దుబాటు చర్యలతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలను అమలు చేస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. సంబంధిత నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కస్టమర్లకు ఎస్‌బీఐ భరోసా ఇచ్చింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా
- ●Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు - షూటింగ్ మాత్రం పెండింగ్ - నాగచైతన్య వృషకర్మపై అప్డేట్
- ●Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ
- ●Google Gemini | కారులోనే జెమిని ఏఐ.. ఇక ప్రయాణం మరింత సౌకర్యవంతం..
- ●Salman Khan | అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
- ●Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

Amit Shah | 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యం : అమిత్ షా

Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు - షూటింగ్ మాత్రం పెండింగ్ - నాగచైతన్య వృషకర్మపై అప్డేట్

Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ

Google Gemini | కారులోనే జెమిని ఏఐ.. ఇక ప్రయాణం మరింత సౌకర్యవంతం..






