Vandebharat Sleeper | వందే భారత్ స్లీపర్ ప్రధాన ప్రత్యేకత ఇదే.. వెయిటింగ్ లిస్టు, ఆర్ఏసీ ఉండవు..
Vandebharat Sleeper | వందే భారత్ శ్రేణిలో మరో నూతన రైలు వందే భారత్ స్లీపర్‌ను భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనుంది. కోల్‌కతా-గౌహతి మధ్య ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు కోసం ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీని గురించి ఓ బ్రహ్మాండమైన వార్త చెప్పారు.
Vandebharat Sleeper | వందే భారత్ శ్రేణిలో మరో నూతన రైలు వందే భారత్ స్లీపర్‌ను భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనుంది. కోల్‌కతా-గౌహతి మధ్య ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు కోసం ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దీని గురించి ఓ బ్రహ్మాండమైన వార్త చెప్పారు. సాధారణంగా రైళ్లలో ఏ క్లాస్‌లో అయినా సరే టిక్కెట్లను బుక్ చేస్తే ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ అని టిక్కెట్ కన్‌ఫామ్ అయ్యేందుకు పలు ప్రత్యేకమైన జాబితాల్లో ప్రయాణికులు వేచి చూడాల్సి ఉంటుంది. కానీ వందే భారత్ స్లీపర్ రైలులో అలా కాదు. అసలు ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ అనేవి ఉండవు. బెర్త్ ఖాళీగా ఉంటేనే బుక్ అవుతుంది. లేకపోతే లేదు. ఇదే సదుపాయాన్ని ఈ రైలుకు ప్రధాన ప్రత్యేకతగా చెబుతున్నారు.
కనీస చార్జి రూ.960..
వందే భారత్ స్లీపర్ రైలును అత్యంత అధునాతన సదుపాయాలతో నిర్మించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు అత్యంత సౌకర్యవంతంగా ఈ రైలులో ప్రయాణించేలా అన్ని రకాల వసతులను ఇందులో కల్పించారు. ఇక వందే భారత్ స్లీపర్ రైలుకు గాను చార్జిల వివరాలు, బుకింగ్ నియమాలను తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. అందులో భాగంగా ఈ రైలుకు అసలు ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్టు ఉండవని తెలిపారు. ఇక ఈ రైలులో కనీస చార్జిని రూ.960 గా నిర్ణయించారు. దీంట్లో 400 కిలోమీటర్ల కనీస ప్రయాణానికి టిక్కెట్ ఇస్తారు. ఈ క్రమంలో ప్రయాణికుడు ఈ రైలులో 3ఏసీలో 400 కిలోమీటర్ల కనీస దూరం ప్రయాణిస్తే కనీస చార్జి రూ.960 అవుతుందన్నమాట. అంతకన్నా తక్కువ దూరంలో ఒక వేళ రైల్వే స్టేషన్ ఉండి టిక్కెట్ బుక్ అయినా సరే కనీసం ఈ చార్జిలనే ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.

60 రోజుల ముందు నుంచే బుకింగ్..
ఈ రైలులో 3500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 1ఏసీ చార్జి గరిష్టంగా రూ.13,300 అవుతుంది. కిలోమీటర్ ప్రకారం చూస్తే 3ఏసీలో కనీస టిక్కెట్ ధర రూ.2.40 అవుతుంది. 2ఏసీలో కిలోమీటర్ ప్రయాణానికి రూ.3.10 చెల్లించాలి. అలాగే 1ఏసీలో కిలోమీటర్ ప్రయాణం చేస్తే రూ.3.80. చెల్లించాలి. ఇలా ఈ రైలులో చార్జిలను ప్రకటించారు. ఇక వందే భారత్ స్లీపర్ రైలులో టిక్కెట్ కన్‌ఫామ్ అయితేనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్ఏసీ క్లాస్‌కు ఇందులో చోటు లేదు. వెయిటింగ్ లిస్టు లేదా పాక్షికంగా కన్‌ఫామ్ అయిన టిక్కెట్లను ఇందులో అనుమతించరు. ఈ రైలుకు గాను 60 రోజుల ముందు నుంచే టిక్కెట్లను. బుక్ చేసుకోవచ్చు. అన్ని బెర్తులు అప్పటి నుంచే అందుబాటులో ఉంటాయి. అలాగే మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు వారి కోటా ప్రకారం టిక్కెట్ల బుకింగ్ ఉంటుంది. ఈ రైలులో ఇతర కోటాలకు అవకాశం లేదు.
గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగం..
ఈ రైలుకు డిజిటల్ రూపంలోనే టిక్కెట్లను ఇస్తారు. టిక్కెట్లను ఒకవేళ క్యాన్సిల్ చేసిన పక్షంలో 24 గంటల్లోనే డబ్బులను రీఫండ్ చేస్తారు. 45 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు టిక్కెట్ బుకింగ్ సమయంలో అందుబాటులో ఉన్న బెర్తుల ప్రకారం ముందుగా లోయర్ బెర్త్ లను ఆటోమేటిగ్గా కేటాయిస్తారు. ఈ రైలులో మొత్తం ఏసీ బోగీలే ఉంటాయి. 3ఏసీ, 2ఏసీ, 1ఏసీ బోగీలను అందుబాటులో ఉంచారు. వందే భారత్ స్లీపర్ రైలు గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ట్రాక్‌ల సామర్థ్యాన్ని బట్టి గంటకు సరాసరిగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలుకు ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్‌ను ఇచ్చారు. అధునాతన టాయిలెట్లు, రీడింగ్ లైట్స్, చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. రైలులో సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంటుంది. ప్రమాదాల నివారణకు కూడా అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థను ఈ రైలు కలిగి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే విమానాల లాంటి సదుపాయాలను ఇందులో అందించనున్నారని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Train Accidents | రైళ్లలో వరుస అగ్నిప్రమాదాల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం : రైల్వే శాఖ
మే 20, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Train | రైలు మిస్ అయితే ఇంకో రైలులో అదే టిక్కెట్‌తో వెళ్లవచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..?
మే 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



