త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. భారీగా పెరగనున్న దేశ రక్షణ బడ్జెట్‌..!

Union Budget 2026 | ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా దేశ రక్షణ బడ్జెట్‌ భారీగా పెరగబోతున్నది. గతేడాది మేలో భారత సైన్యం పాకిస్తాన్‌, పాక్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌ (POK)లో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసి, నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల బడ్జెట్‌ను కేంద్రం పెంచనున్నది.

P

Business | Published On Jan 25, 2026, 11.50 am IST

Union Budget 2026 | ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. భారీగా పెరగనున్న దేశ రక్షణ బడ్జెట్‌..!
Advertisement

Union Budget 2026 | ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారిగా దేశ రక్షణ బడ్జెట్‌ భారీగా పెరగబోతున్నది. గతేడాది మేలో భారత సైన్యం పాకిస్తాన్‌, పాక్‌ ఆక్యుపైడ్‌ కశ్మీర్‌ (POK)లో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసి, నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల బడ్జెట్‌ను కేంద్రం పెంచనున్నది. ఇందులో ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్‌కు ఎక్కువగా బడ్జెట్‌ అందనున్నది. ఈ సంవత్సరం రక్షణ శాఖకు ‘డబుల్-డిజిట్’ వృద్ధి ఉండబోతోంది. అంటే, 10 శాతం లేదంటే అంతకంటే ఎక్కువగా పెంపు ఉండనున్నది. దాంతో మొత్తం రక్షణ బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు మించనుంది. అలాగే, కొత్త ఆయుధాల కోసం పెట్టుబడి క్యాపిటల్ బడ్జెట్ కూడా రూ.2 లక్షల కోట్లు మించనుంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం.

ఆర్థిక సంవత్సరంలో ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలర్స్, ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (AWACS)ని కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సిస్టమ్‌ కోసం అంచనాలు రూపొందించారు. రీఫ్యూయలర్స్ కోసం యూఎస్‌ఏ, ఇజ్రాయెల్ సహకారం అందిస్తుండగా.. ఎయిర్‌బోర్న్‌ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కోసం బ్రెజిల్‌తో కలిసి పని చేస్తుంది. ఇదిలా ఉండగా.. మరో 147 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం 30 బిలియన్‌ యూరోల ఒప్పందం త్వరలో జరుగనున్నది. 2027 మార్చి వరకు ఒప్పందం ఖరారయ్యే అవకాశాలున్నాయి. కానీ, పూర్తి ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. రక్షణ కొనుగోలు కౌన్సిల్‌ (DAC), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ ఒప్పందాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధరలపై చర్చలు, దేశీయ భాగస్వామ్యం (indigenous content) అంశాలపై సంప్రదింపులు జరుగుతాయి.

సఫ్రాన్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మధ్య విమాన ఇంజిన్ల అభివృద్ధి కోసం 3 బిలియన్ యూరో ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించారు. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) నోటు సిద్ధం అవుతోంది. గత రక్షణ బడ్జెట్ రూ.6,81,210.27 కోట్లు ఉండగా.. పెరుగుదల 10 శాతం కంటే తక్కువే. ఆ బడ్జెట్‌లో క్యాపిటల్ ఖర్చులు 26 శాతం పైగా.. అంటే రూ.1,80,000 కోట్లు. ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ గతేడాది కంటే ఎక్కువగానే రక్షణ రంగానికి నిధులు కేటాయించనున్నారు. ఇది భారత రక్షణ రంగానికి చారిత్రక క్షణంగా నిలువనుంది. ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement