Semaglutide | రూ.10వేలు కాదు, రూ.750కే బరువు తగ్గించే ఇంజెక్షన్.. సెమాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్‌లు వచ్చేశాయ్..
Semaglutide | నోవో నోర్డిస్క్ పేటెంట్ గడువు ముగిసిన ఒక రోజుకే మూడు భారతీయ ఔషధ సంస్థలు సన్ ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సెమాగ్లూటైడ్ (Semaglutide) ఇంజెక్షన్ల జనరిక్ వెర్షన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) నియంత్రణలో ఉన్న రోగులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆ సంస్థలు పేర్కొన్నాయి.
Semaglutide | నోవో నోర్డిస్క్ పేటెంట్ గడువు ముగిసిన ఒక రోజుకే మూడు భారతీయ ఔషధ సంస్థలు సన్ ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సెమాగ్లూటైడ్ (Semaglutide) ఇంజెక్షన్ల జనరిక్ వెర్షన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) నియంత్రణలో ఉన్న రోగులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యంగా ఆ సంస్థలు పేర్కొన్నాయి. నాట్‌కో ఫార్మా కూడా తన సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ను ఇప్పటికే విడుదల చేసింది. సన్ ఫార్మా తమ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్లను నోవెల్‌ట్రీట్ (Noveltreat), సేమాట్రినిటీ (Sematrinity) అనే బ్రాండ్ పేర్లతో విడుదల చేసింది. నోవెల్‌ట్రీట్ దీర్ఘకాలిక బరువు నియంత్రణ కోసం పనిచేస్తుంది. ఇది 5 డోస్ స్ట్రెంగ్త్‌లలో అందుబాటులో ఉంది. సేమాట్రినిటీ మాత్రం పూర్తిగా నియంత్రణలో లేని టైప్ 2 డయాబెటిస్ రోగులే లక్ష్యంగా తీసుకువచ్చారు. ఇది 2 డోస్ స్ట్రెంగ్త్‌లలో అందుబాటులో ఉంటుంది. నోవెల్‌ట్రీట్ వారానికి ఒకసారి తీసుకునే చికిత్స ఖర్చు సుమారు రూ.900 నుంచి రూ.2వేల మధ్య ఉండగా, సేమాట్రినిటీ ధర రూ.750 నుంచి రూ.1,300 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.
డీసీజీఐ ఆమోదం పొందిన ఒబెడా..
జైడస్ లైఫ్‌సైన్సెస్ తమ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ను వినూత్నమైన మల్టీ-డోస్ పెన్ పరికరంతో పరిచయం చేసింది. ఈ ఔషధాన్ని సెమాగ్లిన్ (SEMAGLYN), మాషేమా (MASHEMA), ఆల్టర్మీ (ALTERME) అనే బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఇది టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం చికిత్స కోసం పనిచేస్తుంది. ఈ చికిత్సకు నెలకు సగటు ఖర్చు సుమారు రూ.2,200 ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఒబెడా (Obeda) పేరుతో సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్‌ను విడుదల చేసింది. ఇది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు భారత్‌లో డీసీజీఐ ఆమోదం పొందిన తొలి జనరిక్ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అని కంపెనీ వెల్లడించింది. ఒబెడా 2 మి.గ్రా., 4 మి.గ్రా., డోస్‌లలో అందుబాటులో ఉంది. ఇది వారానికి ఒకసారి ఉపయోగించేందుకు రూపొందించిన ప్రీ-ఫిల్డ్ డిస్పోజబుల్ పెన్ రూపంలో లభిస్తుంది. ఈ మందుతో చికిత్సకు నెలకు ఖర్చు రూ.4,200 అవుతుందని సంస్థ తెలిపింది. అయితే ఇప్పటి వరకు నోవో నోర్డిక్స్ అందిస్తున్న ఇదే వర్గానికి చెందిన మందులకు నెలకు దాదాపు రూ.12వేలకు పైనే అవుతుండడం గమనార్హం. ఇక కొత్త జనరిక్ మందులతో రోగులకు చాలా వరకు డబ్బు ఆదా కానుంది.
మరింత చవక ధరకు చికిత్స..
సెమాగ్లూటైడ్ అనేది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అనే మెడిసిన్ వర్గానికి చెందింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా రోజంతా పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగిస్తుంది. ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల బరువు తగ్గేందుకు ఈ ఔషధం సహాయం చేస్తుంది. బరువు తగ్గించడంలో ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిసిన్‌ను ఇప్పటికే సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. కాగా భారత్‌లో సుమారు 10.13 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త దేశీయ జనరిక్ ఔషధాల విడుదలతో రోగులకు అవసరమైన చికిత్స మరింత చవక ధరలకు అందుబాటులోకి వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ozempic | ఇక పెంపుడు జంతువులకు సైతం బరువు తగ్గించే మందులు.. పరిశోధన చేస్తున్న నిపుణులు..
జులై 21, 2026

Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
జులై 9, 2026

Nithin Kamath | జిమ్ మెంబర్ షిప్ కన్నా జీఎల్పీ-1 మందులే తక్కువ ధర.. అయినా భారతీయులకు ఆసక్తి లేదు: నితిన్ కామత్
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు

Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం

Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి



