Smart Phones | రూ.25వేల లోపు లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు ఇవే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Smart Phones | ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గతంలో రూ.25వేలు పెట్టినా చక్కని ఫీచర్లు కలిగిన ఫోన్లు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అదే రేంజ్‌లో అద్భుతమైన ఫీచర్లను అనేక ఫోన్లలో పలు కంపెనీలు అందిస్తున్నాయి. అయితే మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో ఫోన్ల ఎంపిక వాస్తవానికి కాస్త కష్టంగానే ఉంటుంది.
Smart Phones | ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గతంలో రూ.25వేలు పెట్టినా చక్కని ఫీచర్లు కలిగిన ఫోన్లు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అదే రేంజ్‌లో అద్భుతమైన ఫీచర్లను అనేక ఫోన్లలో పలు కంపెనీలు అందిస్తున్నాయి. అయితే మిడ్ రేంజ్ సెజ్‌మెంట్‌లో ఫోన్ల ఎంపిక వాస్తవానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అన్ని ఫోన్లను పరిశీలించిన తరువాత అసలు ఏ ఫోన్‌ను తీసుకోవాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన కొన్ని మిడ్ రేంజ్ ఫోన్లను పరిశీలించవచ్చు. ఇవి ఈ సెజ్‌మెంట్‌లో వినియోగదారుల ఆదరణను చూరగొన్నాయి. ఫీచర్లు కూడా అద్భుతంగానే ఉండగా, ఈ ఫోన్లు అన్నీ రూ.25వేల లోపు ధరకే లభిస్తున్నాయి. ఇక ఆ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
రెడ్‌మీ నోట్ 15..
ఈ సెజ్‌మెంట్‌లో ముందుగా చెప్పకోదగిన ఫోన్ రెడ్‌మీ నోట్ 15. షియోమీకి చెందిన ఈ ఫోన్ రూ.22,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఇందులో ఐపీ66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, 6.77 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, షియోమీ హైపర్ ఓఎస్ 2, 108 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, 5520 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను ఇస్తున్నారు. కెమెరా ప్రధానంగా కావల్సిన వారు ఈ ఫోన్‌ను ఎంచుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 3ఎ లైట్..
నథింగ్ కంపెనీకి చెందిన నథింగ్ ఫోన్ 3ఎ లైట్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.21,999గా ఉంది. ఇందులో 6.77 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొ ప్రాసెసర్, వెనుక వైపు 50, 8 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15 ఓఎస్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లను అందిస్తున్నారు.
వివో టీ4..
మిడ్‌రేంజ్ సెజ్‌మెంట్‌లో వివోకు చెందిన టీ4 స్మార్ట్ ఫోన్ కూడా చక్కని ఫీచర్లను కలిగి ఉంది. స్లిమ్ డిజైన్‌ను ఈ ఫోన్ కలిగి ఉండడమే కాకుండా, దీనికి ఐపీ64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. 6.77 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, వెనుక వైపు 50, 2 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, 7300 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ వంటి ఫీచర్లను ఇచ్చారు.

నథింగ్ ఫోన్ 3ఎ..
నథింగ్‌కు చెందిన మరో ఫోన్ నథింగ్ 3ఎ కూడా ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 ఉండగా, ఇందులో 6.77 ఇంచుల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, వెనుక వైపు 50, 50, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరాలు, 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌ను అందించారు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5..
వన్‌ప్లస్‌కు చెందిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 మిడ్‌రేంజ్ విభాగంలో ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ.24,999 ఉండగా, ఇందులో 6.77 ఇంచుల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్, వెనుక వైపు 50, 8 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు, 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ వంటి ఫీచర్లను ఇచ్చారు.
ఇలా ఆయా ఫోన్లు మిడ్‌రేంజ్ విభాగంలో అత్యంత ఎక్కువ వినియోగదారుల ఆదరణను చూరగొన్నాయి. కనుక వినియోగదారులు తమకు కావల్సిన ఫోన్‌ను సులభంగా ఎంపిక చేసుకోవచ్చు.
సంబంధిత వార్తలు

OPPO Find X9 Ultra | ఓప్పో ఫైండ్ ఎక్స్9 అల్ట్రా లాంచ్.. కెమెరా ప్రేమికుల కోసం పవర్ఫుల్ ఫ్లాగ్షిప్..
మే 21, 2026

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



