త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Merritronix Limited IPO | భారీ లాభాలకు ఛాన్స్.. రేపటి నుంచే మెర్రిట్రోనిక్స్ లిమిటెడ్ ఐపీవో ఓపెన్: పూర్తి వివరాలివే!

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త! దాదాపు 59 శాతం భారీ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న మెర్రిట్రోనిక్స్ లిమిటెడ్ SME IPO రేపటి నుంచే ప్రారంభం కానుంది.

J

Business | Published On May 31, 2026, 4.41 pm IST

Merritronix Limited IPO | భారీ లాభాలకు ఛాన్స్.. రేపటి నుంచే మెర్రిట్రోనిక్స్ లిమిటెడ్ ఐపీవో ఓపెన్: పూర్తి వివరాలివే!
Advertisement
  • జూన్ 1 నుంచి జూన్ 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌ కోసం మెర్రిట్రోనిక్స్ లిమిటెడ్ (Merritronix Limited) IPO అందుబాటులో
  • ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.70.03 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యం
  • ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ రూ.141 - 149 కాగా, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ప్రస్తుతం రూ.88
  • జూన్ 8న బీఎస్ఈ (BSE) ఎస్ఎంఈ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కంపెనీ షేర్లు లిస్ట్

Merritronix Limited IPO | త్రినేత్ర.న్యూస్ : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు మరో అద్భుతమైన అవకాశం రాబోతోంది. డిఫెన్స్, ఏరోస్పేస్, టెలికాం, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత కీలకమైన హై-రిలయబిలిటీ ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసే 'మెర్రిట్రోనిక్స్ లిమిటెడ్' (Merritronix Limited) తన ఎస్ఎంఈ ఐపీవో (SME IPO) తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. జూన్ 1వ తేదీ (రేపు) ప్రారంభం కానున్న ఈ ఐపీవో.. మొదటి రోజే భారీ లిస్టింగ్ గెయిన్స్ (Listing Gains) అందిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇష్యూ వివరాలు, ప్రైస్ బ్యాండ్

ఈ ఐపీవో జూన్ 1 నుంచి జూన్ 3వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయి ఉంటుంది. దీని ద్వారా మార్కెట్ నుంచి రూ.70.03 కోట్లను సమీకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఇష్యూ కోసం ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 141 నుంచి రూ.149 గా నిర్ణయించారు. ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునే రిటైల్ పెట్టుబడిదారులు కనీసం 1000 షేర్ల లాట్ (Lot) కు బిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే, ఈ ఐపీవోలో పాల్గొనాలంటే కనీసం రూ.1,49,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

Merritronix SME IPO Opens Tomorrow Check GMP and Details

నిధుల వినియోగం.. వాటాల కేటాయింపు

ఈ ఐపీవో ద్వారా వచ్చిన నిధులను కంపెనీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (Capex), వర్కింగ్ క్యాపిటల్, లోన్స్ క్లియర్ చేయడానికి, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనుంది. బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఇష్యూకి రిజిస్ట్రార్‌గా, GYR క్యాపిటల్ అడ్వైజర్స్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ ఐపీవొలో క్యూఐబీ (QIB) లకు 47.40%, రిటైల్ ఇన్వెస్టర్లకు 33.28%, ఎన్ఐఐ (NII) లకు 14.30%, మార్కెట్ మేకర్లకు 5.02% వాటాను కంపెనీ కేటాయించింది.

అలాట్‌మెంట్ ఎప్పుడు? లాభం ఎంత?

జూన్ 4న షేర్ల అలాట్‌మెంట్ ప్రాసెస్ పూర్తి కానుండగా.. అలాట్‌మెంట్ దక్కిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ (Demat) అకౌంట్లలో జూన్ 5న షేర్లు క్రెడిట్ అవుతాయి. అనంతరం, జూన్ 8న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎస్ఎంఈ (BSE SME) ఇండెక్స్‌లో ఈ షేర్లు అధికారికంగా లిస్ట్ అవుతాయి. గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం ఈ షేరుపై రూ.88 ప్రీమియం నడుస్తోంది. అంచనాల ప్రకారం ఇదే జోరు కొనసాగితే, ఇన్వెస్టర్లకు ఏకంగా 59 శాతం దాకా బంపర్ లిస్టింగ్ లాభాలు దక్కే ఛాన్స్ ఉంది.

Advertisement
Advertisement