IPO | ఇన్వెస్టర్లకు అలర్ట్.. వచ్చే వారంలో ముగియనున్న ముఖ్యమైన ఐపీవోలు ఇవే..
IPO | ఈ వారం స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగనుంది. పలు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలతో ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు మొత్తం ఆరు కంపెనీల ఐపీఓలు ప్రారంభం లేదా ముగింపు దశలో ఉండనున్నాయి. ఈ ఇష్యూల ద్వారా కంపెనీలు సమీకరించనున్న మొత్తం విలువ రూ.3,275 కోట్లకు పైగా ఉంది.
IPO | ఈ వారం స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగనుంది. పలు కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలతో ఇన్వెస్టర్ల ముందుకు వస్తున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు మొత్తం ఆరు కంపెనీల ఐపీఓలు ప్రారంభం లేదా ముగింపు దశలో ఉండనున్నాయి. ఈ ఇష్యూల ద్వారా కంపెనీలు సమీకరించనున్న మొత్తం విలువ రూ.3,275 కోట్లకు పైగా ఉంది. ఆగస్టు 31న లుమినో ఇండస్ట్రీస్ ఐపీఓ ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ విలువ రూ.700 కోట్లుగా ఉంది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ ఐపీఓకు ఇన్వెస్టర్లు ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్..
ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్ ఐపీఓ కొనసాగనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.720 కోట్లు సమీకరించనుంది. అలాగే ప్రైయారిటీ జువెల్స్ లిమిటెడ్ ఐపీఓ కూడా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ పరిమాణం రూ.91.5 కోట్లుగా ఉంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ లిమిటెడ్ ఐపీఓ అందుబాటులో ఉండనుంది. కంపెనీ ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.680 కోట్లను సమీకరించనుంది.
దీపా జువెల్లర్స్ లిమిటెడ్..
సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు దీపా జువెల్లర్స్ లిమిటెడ్ ఐపీఓ కొనసాగనుంది. ఈ ఇష్యూ పరిమాణం రూ.459.72 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో రేస్ ఆఫ్ బిలీఫ్ లిమిటెడ్ ఐపీఓ కూడా ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ ఐపీఓ విలువ రూ.125 కోట్లుగా ఉంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 మధ్య పలు ఐపీఓలు మార్కెట్లలో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనున్నాయి. ఇష్యూలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార నమూనా, ఐపీఓ ధర, విలువ తగ్గింపు, రిస్క్ అంశాలను పరిశీలించడం కీలకం.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






