IPO | ఈ వారం నాలుగు ఐపీఓలు.. సబ్‌స్క్రిప్షన్ ఎప్పుడంటే..
IPO | అక్టోబర్ 12తో ప్రారంభమయ్యే వారంలో నాలుగు కంపెనీలు తమ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లను సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నాయి. వీటిలో రెండు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు కాగా, వీటి మొత్తం విలువ రూ.1,414 కోట్లు. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ రూ.712 కోట్ల ఐపీఓ అక్టోబర్ 13న ప్రారంభం కానుండగా, ఫ్యూజన్ సీఎక్స్ రూ.702 కోట్ల ఐపీఓ అక్టోబర్ 14న ప్రారంభం కానుంది.
IPO | అక్టోబర్ 12తో ప్రారంభమయ్యే వారంలో నాలుగు కంపెనీలు తమ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)లను సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నాయి. వీటిలో రెండు మెయిన్‌బోర్డ్ ఐపీఓలు కాగా, వీటి మొత్తం విలువ రూ.1,414 కోట్లు. హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ రూ.712 కోట్ల ఐపీఓ అక్టోబర్ 13న ప్రారంభం కానుండగా, ఫ్యూజన్ సీఎక్స్ రూ.702 కోట్ల ఐపీఓ అక్టోబర్ 14న ప్రారంభం కానుంది. మరోవైపు, ఎస్ఎంఈ విభాగంలో వైభవ్ వ్యాపార్ లిమిటెడ్, రవితా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓలు అక్టోబర్ 13న ప్రారంభమవుతాయి. ఈ రెండు ఐపీఓలు అక్టోబర్ 15న ముగియనున్నాయి. ఈ వారంలో సబ్‌స్క్రిప్షన్‌కు రానున్న ఐపీఓల వివరాలు ఇలా ఉన్నాయి.
హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ లిమిటెడ్..
అగ్నిప్రమాదాల నివారణ పరికరాలు, వ్యవస్థల తయారీ సంస్థ హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 13న ప్రారంభమై అక్టోబర్ 15న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ అక్టోబర్ 12న జరగనుంది. ఈ మేరకు కంపెనీ పబ్లిక్ ప్రకటనలో వెల్లడించింది. ఈ రూ.712 కోట్ల ఐపీఓకు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.258 నుంచి రూ.271 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ధరల శ్రేణిలో గరిష్ఠ ధర రూ.271 ఆధారంగా హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ కంపెనీ విలువ సుమారు రూ.4,750 కోట్లుగా ఉండనుంది. ఈ ఐపీఓలో భాగంగా ప్రమోటర్లు హరీష్ నర్షి ధరమ్‌షి, కుసుమ్ హరీష్ ధరమ్‌షి తమకు చెందిన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉండడంతో ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి నేరుగా ఎలాంటి నిధులు అందవు. షేర్ల విక్రయం ద్వారా వచ్చే మొత్తం విక్రయదారులైన వాటాదారులకు చెందుతుంది. ఐపీఓ ధరల శ్రేణిలో గరిష్ఠ ధర ఆధారంగా మొత్తం ఇష్యూ విలువ రూ.712.13 కోట్లుగా ఉండనుంది. కనిష్ఠ ధర ఆధారంగా ఈ విలువ సుమారు రూ.678 కోట్లుగా ఉంటుంది.
హెచ్‌డీ ఫైర్ ప్రొటెక్ట్ షేర్లు అక్టోబర్ 21న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)ల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీఓకు అంబిట్, ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ఫ్యూజన్ సీఎక్స్ లిమిటెడ్..
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సేవలను అందించే ఫ్యూజన్ సీఎక్స్ లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 14న ప్రారంభమై అక్టోబర్ 16న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ అక్టోబర్ 13న జరగనుంది. కంపెనీ పబ్లిక్ ప్రకటన ప్రకారం, ఈ రూ.702 కోట్ల ఐపీఓకు ఒక్కో షేరుకు రూ.275 నుంచి రూ.289 ధరల శ్రేణిని నిర్ణయించారు. ధరల శ్రేణిలో గరిష్ఠ ధర రూ.289 ఆధారంగా ఐపీఓ అనంతరం ఫ్యూజన్ సీఎక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,170 కోట్లకు మించనుందని అంచనా. ఈ ఐపీఓలో రూ.500 కోట్ల వరకు విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ఇప్పటికే ఉన్న వాటాదారులైన పీఎన్‌ఎస్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్, రసిష్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.202 కోట్ల వరకు విలువైన షేర్ల విక్రయం కూడా ఉంది. అంటే ఈ ఇష్యూలో తాజా షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ రెండూ ఉన్నాయి.
2025 మేలో సెబీకి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, తొలుత ఈ ఐపీఓ ద్వారా రూ.1వేయి కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. అయితే, ఆ తర్వాత ప్రతిపాదిత ఐపీఓ పరిమాణాన్ని రూ.702 కోట్లకు తగ్గించింది.
వైభవ్ వ్యాపార్ లిమిటెడ్..
వైభవ్ వ్యాపార్ లిమిటెడ్‌కు చెందిన ఎస్ఎంఈ ఐపీఓ అక్టోబర్ 13న సబ్‌స్క్రిప్షన్‌కు ప్రారంభమై అక్టోబర్ 15న ముగియనుంది. ఈ ఐపీఓలో ఒక్కో షేరుకు రూ.51 నుంచి రూ.54 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. మొత్తం 77.96 లక్షల షేర్లను ఈ ఇష్యూ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే రవితా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎస్ఎంఈ ఐపీఓ కూడా అక్టోబర్ 13న ప్రారంభమై అక్టోబర్ 15న ముగియనుంది. ఈ ఐపీఓకు ఒక్కో షేరుకు రూ.105 నుంచి రూ.112 ధరల శ్రేణిని నిర్ణయించారు. మొత్తం 1,03,62,000 షేర్లను ఈ ఇష్యూలో భాగంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజావార్తలు
- ●Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?
- ●Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల
- ●Stock Markets | చమురు ధరల తగ్గుదల ఎఫెక్ట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..
- ●RTC Metro Common Pass | ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై పునఃపరిశీలన.. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Software Engineer | హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం

Bathukamma | తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా.. దుబాయ్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అస్థిరత.. పెట్టుబడి పెట్టాలా, వేచి చూడాలా..?

Nagarjuna Sagar | తాగునీటి అవసరాలకు.. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

Stock Markets | చమురు ధరల తగ్గుదల ఎఫెక్ట్.. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..






