త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | మార్కెట్లో 4 కొత్త మ్యుచువ‌ల్ ఫండ్ స్కీమ్స్‌.. పెట్టుబ‌డి రూ.500 మాత్ర‌మే..

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని చూస్తున్న వారికి ఈ వారంలో మ‌రో 4 కొత్త స్కీమ్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్ల‌కు ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించ‌వ‌చ్చు.

S

Business | Published On Jul 18, 2026, 4.34 pm IST

Mutual Funds | మార్కెట్లో 4 కొత్త మ్యుచువ‌ల్ ఫండ్ స్కీమ్స్‌.. పెట్టుబ‌డి రూ.500 మాత్ర‌మే..
Advertisement

Mutual Funds | మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెట్టాల‌ని చూస్తున్న వారికి ఈ వారంలో మ‌రో 4 కొత్త స్కీమ్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇన్వెస్ట‌ర్ల‌కు ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా దీర్ఘ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించ‌వ‌చ్చు. డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టి మెరుగైన రాబడులు పొందాలని భావించే వారి కోసం ఈ ఫండ్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ వారం మొత్తం నాలుగు కొత్త మ్యుచువల్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్‌ఎఫ్‌వోలు) సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మూడు యాక్టివ్‌గా నిర్వహించే ఫండ్లు కాగా, ఒకటి నిర్దిష్ట ఇండెక్స్‌ను నేరుగా ట్రాక్ చేసే పాసివ్ ఫండ్‌గా ఉంటుంది. చిన్న మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశాన్ని కూడా ఈ ఫండ్స్ క‌ల్పిస్తున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, అబాకస్ వంటి సంస్థలు కేవలం రూ.500తోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశం కల్పిస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉద్యోగులు, కొత్త పెట్టుబడిదారులు తమ పొదుపులను క్రమంగా పెంచుకోవడానికి ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు. ప్రారంభ పెట్టుబడి తక్కువగా ఉండటంతో కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం కూడా ఉండదు.

అందుబాటులోకి వ‌చ్చిన ఫండ్స్ ఇవే..

ఈ వారం అందుబాటులోకి వచ్చిన‌ ఫండ్ల వివరాలను పరిశీలిస్తే బజాజ్ ఫిన్‌సర్వ్ బీఎస్‌ఈ టాప్ 10 బ్యాంక్స్ ఈటీఎఫ్ ఈ వారంలో ఉన్న ఏకైక పాసివ్ ఫండ్. ఇది జూలై 13 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. కనీసం రూ.500తో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఆ తర్వాత రూ.1 గుణిజాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగంపై విశ్వాసం ఉన్న పెట్టుబడిదారులకు ఇది సరళమైన ఎంపికగా చెప్ప‌వ‌చ్చు. అలాగే బరోడా బీఎన్‌పీ పరిబాస్ సర్వీసెస్ ఫండ్ యాక్టివ్ ఫండ్‌గా జూలై 14 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో కనీస పెట్టుబడి మొత్తాన్ని రూ.1వేయిగా నిర్ణయించారు. అబాకస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ జూలై 15 నుంచి అందుబాటులో రాగా, ఇందులో కేవలం రూ.500తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. ది వెల్త్ కంపెనీ మిడ్ క్యాప్ ఫండ్ కూడా జూలై 15 నుంచి సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంది. మిడ్ క్యాప్ కంపెనీలపై దృష్టి సారించే ఈ యాక్టివ్ ఫండ్‌లో పెట్టుబడి ప్రారంభించాలంటే కనీసం రూ.1వేయి పెట్టాలి.

జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం..

అయితే మ్యుచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మార్కెట్ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉండటంతో ప్రతి పెట్టుబడిదారుడు తన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి.

Advertisement
Advertisement