Mutual Funds | గత నెలలో ఈ కంపెనీ స్టాక్‌ను 40 మ్యుచువల్ ఫండ్స్ కొన్నాయి.. అత్యధిక డిమాండ్ ఉన్న షేర్ ఇదే..
Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్ అంటే విభిన్న ఆస్తులకు సంబంధించిన పెట్టుబడుల కలయిక. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. అయితే ఎక్కువగా ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ భారీ లాభాలను అందిస్తుంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో ఏడాదికి ఏకంగా 20 శాతానికి పైగా రాబడులను అందిస్తాయి.
Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్ అంటే విభిన్న ఆస్తులకు సంబంధించిన పెట్టుబడుల కలయిక. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. అయితే ఎక్కువగా ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ భారీ లాభాలను అందిస్తుంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో ఏడాదికి ఏకంగా 20 శాతానికి పైగా రాబడులను అందిస్తాయి. అందుకనే ఫండ్ కంపెనీలు లేదా బ్యాంకులు, ఇతర ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్లు ఈక్విటీలలో పెట్టుబడులు అధికంగా పెడుతుంటారు. మ్యుచువల్ ఫండ్ కంపెనీలు తరచూ తమ పోర్ట్‌ఫోలియోలో ఉండే స్టాక్స్‌ను కూడా మారుస్తుంటాయి. పెట్టుబడులను మార్చడం ద్వారా అధిక రాబడులను సాధించాలనేదే ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే ఫండ్ కంపెనీలు ప్రతి నెలా కొన్ని స్టాక్స్‌ను అమ్మేస్తాయి. కొన్ని స్టాక్స్‌ను కొంటుంటాయి. ఇది తరచూ జరిగే ప్రక్రియే. అయితే గత జూన్ నెలలో దాదాపు 40 మ్యుచువల్ ఫండ్‌లు ఒకే స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాయి. అంటే ఈ స్టాక్‌కు అధిక డిమాండ్ ఉందన్న విషయం స్పష్టమవుతోంది. ఫండ్ కంపెనీలు తాము అందిస్తున్న పలు భిన్న రకాల మ్యుచువల్ ఫండ్ స్కీమ్‌లలో పలు స్టాక్‌లను విక్రయించి ఈ ఒక్క స్టాక్‌నే అధిక మొత్తంలో కొనుగోలు చేశాయి. తమ పోర్ట్‌ఫోలియును మరింత విస్తరించాయి. దీంతో ఆ స్టాక్‌కు పెట్టుబడిదారులు సైతం ఆకర్షితమవుతున్నారు.
ఏంటా స్టాక్..
గత నెల రోజుల వ్యవధిలో మ్యుచువల్ ఫండ్ కంపెనీలు తాము నిర్వహిస్తున్న 40 మ్యుచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేశాయి. వీటిల్లో స్మాల్, మిడ్, లార్జ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ స్కీములు కూడా ఉన్నాయి. అనేక ఫండ్ కంపెనీలకు చెందిన పరిశోధనా బృందాలు ఈ స్టాక్‌కు బై రేటింగ్‌ను ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఆ స్టాక్ విషయానికి వస్తే, అదానీ ఎంటర్ ప్రైజెస్ కావడం విశేషం. అలాగే దీంతోపాటు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్, ఎన్‌హెచ్‌పీసీతోపాటు పలు ఇతర స్టాక్‌లలోనూ ఆయా ఫండ్ కంపెనీలు భారీగా పెట్టుబడులను పెట్టాయి. ప్రతి నెలా ఏఎంసీలు తమ హోల్డింగ్స్ వివరాలను వెల్లడిస్తాయి. అలాగే ఆర్థిక సమాచారాన్ని అందించే మీడియా సంస్థలు సైతం ఆ వివరాలను ప్రచురిస్తాయి. ఏయే ఫండ్ కంపెనీలు ఏయే స్టాక్‌లను విక్రయించాయి, ఏయే స్టాక్‌లను కొనుగోలు చేశాయి అన్న వివరాలు ఆ సమాచారంలో ఉంటాయి. ఈ క్రమంలో ఒక ఫండ్ స్కీమ్‌లో ఎన్ని ఈక్విటీలు, ఏమేం ఈక్విటీలు ఉన్నాయో పెట్టుబడిదారులు నెల నెలా సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
ఎంత శాతం..
ఫండ్ కంపెనీలు రెండు విధాలుగా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేస్తాయి. బహిరంగ మార్కెట్‌లో షేర్లను కొనుగోలు చేసి కంపెనీలో వాటాను తీసుకుంటాయి. అలాగే ఐపీవో లేదా యాంకర్ బుక్, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్, ఆఫర్ ఫర్ సేల్ వాటాను కొనుగోలు చేస్తాయి. జూన్‌లో మ్యుచువల్ ఫండ్ కంపెనీలు అత్యధికంగా చేసిన ఈక్విటీ కొనుగోళ్లలో ఎక్కువగా బ్లాక్ డీల్స్ ఉన్నాయి. అలాగే క్యూఐపీలు, ఆఫర్ ఫర్ సేల్ లావాదేవీల రూపంలోనూ ఈక్విటీలను కొన్నాయి. జూన్ నెలలో మ్యుచువల్ ఫండ్ కంపెనీలు ఆక్మే సోలార్ హోల్డింగ్స్‌లో 7.20 శాతం వాటాను కొనుగోలు చేయగా, క్రాఫ్ట్స్‌మన్ ఆటోమేషన్‌లో 5.12 శాతం, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 4.95 శాతం, పైన్ ల్యాబ్స్‌లో 4.71 శాతం వాటాలను కొన్నాయి. సెబీ ఐపీవోలో మొత్తం యాంకర్ ఇన్వెస్టర్ రిజర్వేషన్‌ను 33 నుంచి 40 శాతానికి పెంచింది. ఇందులో మ్యుచువల్ ఫండ్స్‌కు 33 శాతం, బీమా సంస్థలకు, పెన్షన్ ఫండ్స్‌కు 7 శాతం కేటాయించారు. బీమా, పెన్షన్ ఫండ్స్ వాటాలకు స్పందన లభించకపోతే ఆ వాటాలను సైతం మ్యుచువల్ ఫండ్స్‌కు తిరిగి కేటాయిస్తారు. అయితే ఈక్విటీలలో లేదా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందుగా నిపుణులను సంప్రదించడం మంచిది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!






