త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sundar Pichai | 10.6 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన షేర్ల‌ను విక్ర‌యించిన సుంద‌ర్ పిచాయ్‌.. కార‌ణం అదేనా..?

Sundar Pichai | గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో తన వాటాలో కొంత‌ భాగాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విక్రయించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి సమర్పించిన అధికారిక పత్రాల ప్రకారం, 2026 జనవరి 21న ఆయన క్లాస్-సి క్యాపిటల్ స్టాక్‌కు చెందిన 30,521 షేర్లను అమ్మకానికి పెట్టారు.

S

Business | Published On Jan 25, 2026, 7.12 am IST

Sundar Pichai | 10.6 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన షేర్ల‌ను విక్ర‌యించిన సుంద‌ర్ పిచాయ్‌.. కార‌ణం అదేనా..?
Advertisement

Sundar Pichai | గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో తన వాటాలో కొంత‌ భాగాన్ని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విక్రయించారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కి సమర్పించిన అధికారిక పత్రాల ప్రకారం, 2026 జనవరి 21న ఆయన క్లాస్-సి క్యాపిటల్ స్టాక్‌కు చెందిన 30,521 షేర్లను అమ్మకానికి పెట్టారు. ఒక్కో షేర్ ధర 320.35 డాలర్ల నుంచి 331.97 డాలర్ల మధ్య ఉండగా, ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు 10,637,367 డాలర్లుగా నమోదైంది. తాజా విక్రయం అనంతరం సుందర్ పిచాయ్ వద్ద ప్రస్తుతం 22,11,872 క్లాస్-సి క్యాపిటల్ స్టాక్ షేర్లు, అలాగే 2,27,560 క్లాస్-ఎ కామన్ స్టాక్ షేర్లు ఉన్నట్లు ఎస్‌ఈసీ రికార్డులు వెల్లడించాయి. ఈ షేర్ల విక్రయం ఆల్ఫాబెట్ సంస్థ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడానికి ముందే జరగడం గమనార్హం.

ట్రేడింగ్ ప్లాన్ ప్ర‌కార‌మే..

ఎస్‌ఈసీ ఫాం-4లో పొందుపరిచిన వివరాల ప్రకారం, ఈ లావాదేవీలు 2024 డిసెంబర్ 2న సుందర్ పిచాయ్ స్వీకరించిన రూల్ 10బీ5-1 ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం జరిగాయి. ఈ ఫాం-4లో నివేదించిన అన్ని లావాదేవీలు 2024 డిసెంబర్ 2న రిపోర్టింగ్ వ్యక్తి స్వీకరించిన రూల్ 10బీ5-1 ట్రేడింగ్ ప్లాన్ ప్రకారమే నిర్వహించబడ్డాయి.. అని దాఖలాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం షేర్ల విక్రయం జరగడం వల్ల మార్కెట్‌లో ఎలాంటి అంతర్గత సమాచార ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

అసాధార‌ణ రీతిలో పెరుగుద‌ల‌..

కాగా, గూగుల్ షేర్ ధరలు 2025 సంవత్సరంలో అసాధారణ రీతిలో పెరిగాయి. 2009 తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా భావించబడుతున్న ఈ ఏడాదిలో గూగుల్ షేర్లు మొత్తం మీద దాదాపు 93 శాతం పెరిగాయి. కేవలం 2025లోనే 65 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కృత్రిమ మేథ‌ (ఏఐ) రంగంలో గూగుల్ సాధించిన పురోగతే ఈ దూకుడుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతేడాది కంపెనీ పలు జెమిని (Gemini) ఏఐ మోడళ్లను విడుదల చేయగా, తాజా వెర్షన్ జెమిని-3ని నవంబర్‌లో ప్రవేశపెట్టింది. అంతేకాదు, ఎన్‌వీడియా వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పెరుగుతున్న తరుణంలో, ఏడవ తరం ఏఐ చిప్ ఐరన్‌వుడ్ ను కూడా గూగుల్ ఆవిష్కరించింది.

యాపిల్‌తో భాగ‌స్వామ్యం..

ఈ నెల ప్రారంభంలో ఆల్ఫాబెట్ సంస్థ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను తాకి, ఎన్‌వీడియా, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల సరసన నిలిచింది. రాయిటర్స్ కథనం ప్రకారం, క్లాస్-ఎ షేర్లు ఒక దశలో 1.7 శాతం పెరిగి 334.04 డాలర్ల రికార్డు స్థాయిని చేరుకున్నాయి. అంతేకాకుండా, తమ ఏఐ మోడళ్లకు, యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ సిరి తదుపరి జ‌న‌రేష‌న్‌ అభివృద్ధికి గూగుల్ జెమినిని వినియోగించుకునేలా యాపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆల్ఫాబెట్ ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత జనవరి 13న ఆల్ఫాబెట్ షేర్ ధరలు మరో 1.3 శాతం పెరిగి, కంపెనీ మార్కెట్ విలువ సుమారు 337 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు తెలిపాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement