త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Market Live on Sunday | ఆదివారం ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు ఓపెన్: బడ్జెట్ 2026 సందర్భంగా స్పెషల్ ట్రేడింగ్.. టైమింగ్స్ ఇవే!

కేంద్ర బడ్జెట్ 2026 సందర్భంగా ఫిబ్రవరి 1 ఆదివారం నాడు స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి. బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా ఇన్వెస్టర్లు స్పందించేందుకు వీలుగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎంసీఎక్స్ ఎక్స్ఛేంజీలు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నాయి. పూర్తి టైమింగ్స్ వివరాలు ఇక్కడ చూడండి.

J

Business | Published On Jan 31, 2026, 10.36 am IST

Stock Market Live on Sunday | ఆదివారం ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్లు ఓపెన్: బడ్జెట్ 2026 సందర్భంగా స్పెషల్ ట్రేడింగ్.. టైమింగ్స్ ఇవే!

సంక్షిప్త సారాంశం

ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, ఆ రోజు ఆదివారం (వారాంతపు సెలవు) అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు (NSE, BSE), కమోడిటీ మార్కెట్లు (MCX) పనిచేస్తాయని ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో మార్కెట్ అస్థిరతకు అనుగుణంగా ట్రేడింగ్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. సాధారణ రోజులాగే ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతుంది.

Advertisement

Stock Market Live on Sunday | సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) నాడు మాత్రం భారతీయ స్టాక్ మార్కెట్లు పని చేయనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెడుతున్న సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నాయి.

బడ్జెట్ ప్రసంగంలో చేసే ప్రకటనలు, కొత్త పాలసీలు మార్కెట్‌పై తక్షణ ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు రియల్ టైమ్‌లో స్పందించేందుకు వీలుగా మార్కెట్లను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. జనవరి 16, 2026న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఆ రోజు ట్రేడింగ్ సాధారణ పనిదినంలాగే కొనసాగుతుంది.

ఫిబ్రవరి 1న స్టాక్ మార్కెట్ టైమింగ్స్ (Trading Timings)

ఆదివారం నాడు జరిగే ఈ ప్రత్యేక సెషన్ సాధారణ మార్కెట్ వేళల ప్రకారమే ఉంటుంది. ప్రీ మార్కెట్ ఓపెన్ సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఉదయం 9.08 నిమిషాలకు క్లోజ్ అవుతుంది. నార్మల్ మార్కెట్ లైవ్ ట్రేడింగ్ ఉదయం 9.15 గంటలకు ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం 3.30 కు క్లోజ్ అవుతుంది. ట్రేడ్ మోడిఫికేషన్ క్లోజింగ్ టైమ్ సాయంత్రం 4.15 వరకు ఉంటుంది.

ఇతర సెషన్ల వివరాలు: రెగ్యులర్ ట్రేడింగ్‌తో పాటు, ఇతర మార్కెట్ సెషన్లు ఈ కింది విధంగా ఉంటాయి.

బ్లాక్ డీల్ సెషన్ 1: ఉదయం 08:45 – 09:00

స్పెషల్ ప్రీ-ఓపెన్ (IPO & Relisted): ఉదయం 09:00 – 09:45

కాల్ ఆక్షన్ (Illiquid Session): ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 03:30 వరకు (గంటకు ఒక సెషన్ చొప్పున 6 సెషన్లు)

పోస్ట్-క్లోజింగ్ సెషన్: మధ్యాహ్నం 03:40 – 04:00

కమోడిటీ మార్కెట్ కూడా ఓపెన్

ఎంసీఎక్స్ (MCX) సర్క్యులర్ ప్రకారం, కమోడిటీ మార్కెట్లు కూడా ఆదివారం తెరిచే ఉంటాయి. ముఖ్యంగా ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కమోడిటీ కాంట్రాక్టుల ట్రేడింగ్ జరుగుతుంది. దిగుమతి సుంకాలు, వ్యవసాయం, ఇంధన రంగాలపై బడ్జెట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కమోడిటీ ట్రేడర్లకు ఇది కీలక సమయం.

ఇన్వెస్టర్లకు సూచన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గూడ్స్ లాంటి రంగాలు బడ్జెట్ రోజున తీవ్రమైన ఒడిదుడుకులకు (Volatility) లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు రిస్క్, మార్జిన్లను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement