IT Stocks Crash | స్టాక్ మార్కెట్లకు ఐటీ షాక్.. వెంటాడుతున్న ఆంత్రోపిక్ భయం
ఐటీ స్టాక్స్‌తో పాటు ఎంఅండ్ఎం, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్, ఎటర్నల్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఇండిగో, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ లాంటి కంపెనీలు కూడా గురువారం నష్టపోయాయి.
- 5 శాతానికి పైగా పడిపోయిన టాప్ 5 ఐటీ కంపెనీలు
- టెక్‌మహీంద్రా 6.40 శాతం డ్రాప్
- 5.97 శాతం పడిన ఇన్ఫోసిస్
- 5.77 శాతం పడిన టీసీఎస్
IT Stocks Crash | త్రినేత్ర.న్యూస్ : భారత స్టాక్ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. టాప్ ఐటీ కంపెనీలు గురువారం 5 శాతానికి పైగా నష్టపోయాయి. దీని వల్ల ఐటీ కంపెనీలు లిస్టు అయిన ఉన్న నిఫ్టీ 50 నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 50 146 పాయింట్ల నష్టంతో 0.57 శాతం పడింది. ఐటీ కంపెనీల్లో అత్యధికంగా టెక్‌మహీంద్రా 6.40 శాతం నష్టపోయింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ 5.97 శాతం, టీసీఎస్ 5.77 శాతం, హెచ్‌సీఎల్ 5.20 శాతం, విప్రో 4.79 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5.51 శాతం నష్టపోయి 33,160 పాయింట్ల వద్ద ముగిసింది.
3 లక్షల కోట్ల సంపద మాయం
ఇప్పటికే ఆంత్రోపిక్ ఏఐ వల్ల ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఆంత్రోపిక్ భయం ఇంకా ఐటీ స్టాక్స్‌ను వెంటాడుతోంది. దానికి తోడు యూఎస్‌లో వెలువడిన జాబ్స్ డేటా కూడా ఐటీ షేర్లపై ప్రభావం చూపిస్తోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న భయం కూడా మార్కెట్‌ను వెంటాడుతోంది. అందుకే టాప్ ఐటీ కంపెనీలు గురువారం మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. దీని వల్ల బీఎస్ఈ సెన్సెక్స్‌లో లిస్ట్ అయిన కంపెనీలు సుమారు రూ.3 లక్షల కోట్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది.
558 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 558 పాయింట్లు నష్టపోయి 83,674 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ స్టాక్స్‌తో పాటు ఎంఅండ్ఎం, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్, ఎటర్నల్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఇండిగో, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ లాంటి కంపెనీలు కూడా గురువారం నష్టపోయాయి. ఇక సెన్సెక్స్, నిఫ్టీ 50 లో గురువారం లాభపడిన స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీఈఎల్, ఎస్బీఐ ఉన్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






