త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Price | వెండి ధ‌గ‌ధ‌గ‌..! ఫ్యూచ‌ర్ మార్కెట్‌లో ఒకేరోజు రూ.6వేలకు జంప్‌..!

Gold-Silver Price | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో సానుకూల సంకేతాల మ‌ధ్య బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. శుక్ర‌వారం కమోడిటీ మార్కెట్‌లో వెండి మ‌రింత ధ‌ర పుంజుకున్న‌ది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ 2 శాతానికిపైగా పెరిగాయి.

P

Business | Published On Jan 9, 2026, 5.07 pm IST

Gold-Silver Price | వెండి ధ‌గ‌ధ‌గ‌..! ఫ్యూచ‌ర్ మార్కెట్‌లో ఒకేరోజు రూ.6వేలకు జంప్‌..!
Advertisement

Gold-Silver Price | అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో సానుకూల సంకేతాల మ‌ధ్య బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. శుక్ర‌వారం కమోడిటీ మార్కెట్‌లో వెండి మ‌రింత ధ‌ర పుంజుకున్న‌ది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ 2 శాతానికిపైగా పెరిగాయి. వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 5,898 పెరిగి రూ.2,49,222కి చేరింది. గురువారం కిలోకు రూ. 2,43,324 ప‌లికింది. గ‌త రెండు సెష‌న్ల‌లో ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా.. తాజాగా మ‌ళ్లీ వెండి ధ‌ర పుంజుకున్న‌ది. మంగ‌ళ‌వారం కిలోకు రూ.2.58ల‌క్ష‌లు ప‌లికిన ధ‌ర 6శాతం త‌గ్గింది.

వెండితో పాటు బంగారం ధర కూడా పెరిగింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంట్రాక్ట్‌తో బంగారం ప‌ది గ్రాములకు రూ.783 పెరిగి రూ. 1,38,525 వద్ద ట్రేడ్ అవుతున్న‌ది. కామెక్స్‌లో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించి బంగారం ఔన్సుకు 21.74 0.49 శాతం పెరిగి 4,482.44 డాల‌ర్ల‌కు చేరింది. రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది ప్రకారం మాట్లాడుతూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల‌తో పాటు ప‌లు కార‌ణాల‌తో పెట్టుబ‌డిదారులు బంగారంపై దృష్టి సారించార‌న్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి జోరు కొన‌సాగించింద‌ని.. మార్చి కాంట్రాక్ట్ ఔన్సుకు 3.76 శాతం పెరిగి 77.96 డాల‌ర్ల‌కు చేరుకుంది.

మేజ‌ర్ క‌మోడిటీ ఇండెక్స్ వార్షిక రీబ్యాలెన్సింగ్ కార‌ణంగా గురువారం వెండి ధర 5 శాతం పడిపోయిందని, దీని ఫలితంగా బిలియన్ల డాలర్ల విలువైన ఫ్యూచర్స్ కాంట్రాక్టులు అమ్ముడుపోయాయని ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చెనాని వెల్ల‌డించారు. సాంకేతికంగా ఈ వారం ప్రారంభంలో వెండి ఔన్సుకు 82.6 వద్ద గరిష్ట స్థాయిని తాకింద‌న్నారు. ఇదిలా ఉంగా.. అమెరికా పరిణామాలు సైతం కమోడిటీ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండా వెనిజులాపై త‌ర్వాతి సైనిక చర్యను నిరోధించే తీర్మానాన్ని యూఎస్ సెనేట్ ఆమోదించింది. అయితే, వెనిజులాపై అమెరికా నిఘా కొన‌సాగుతుంద‌ని ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. డోనాల్డ్ ట్రంప్ అత్య‌వ‌స‌ర సుంకం అధికారాల‌పై సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని పెట్టుబ‌డిదారులు నిశితంగా ప‌రిశీలిస్తున్నార‌ని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం సెషన్ కమోడిటీ పెట్టుబడిదారులకు ఉపశమనం కలిగించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement