Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే 22ఏ జాబితా
Ramchandar Rao | అవినీతిని న్యాయబద్ధం చేయడానికే ఈ 22ఏ జాబితా తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. ఇది మామూలుగా జరిగిన విషయం కాదని.. దీంట్లో కాంగ్రెస్‌వాళ్లకు ఉన్నదురుద్దేశం ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
Flash news | Published On Sep 5, 2026, 2.09 pm IST
- భూమి హక్కు మానవ అధికారం.. దాన్ని కూడా హరిస్తున్నారు
- దీంట్లో వారి దురుద్దేశం ఏంటో బయటకి రావాలి
- అధికారంలోకి రాగానే భూములన్నీ విడిపిస్తాం
- ధర్నాచౌక్ మహాదీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు భరోసా
త్రినేత్ర.న్యూస్: అవినీతిని న్యాయబద్ధం చేయడానికే ఈ 22ఏ జాబితా తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. ఇది మామూలుగా జరిగిన విషయం కాదని.. దీంట్లో కాంగ్రెస్‌వాళ్లకు ఉన్నదురుద్దేశం ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. భూమి హక్కు అనేది మానవ అధికారమని.. దాన్ని కూడా హరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని.. అధికారంలోకి రాగానే 22ఏ జాబితాలో ఉన్న భూములన్నీ విడిపిస్తామని చెప్పారు. ఈ అవినీతిపై హైకోర్టు జడ్జితోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ వద్ద శనివారం నిర్వహించిన మహా దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈరోజు తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలు అనేక జిల్లాల్లో ప్రకటించింది. దాని ద్వారా మొత్తం రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో లోపాలు ఉన్నది నిజమే. అందుకే భూ భారతి తెచ్చామని కాంగ్రెస్‌వాళ్లు అన్నారు. భూములన్నీ నిషేధిత జాబితాలోకి వచ్చిపడ్డయ్. ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు ఎక్కడికెళ్లినా ఎవరూ పట్టించుకోలే. ఆరోజు 15 శాతం కమీషన్ ఉంటే.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలోంచి భూములు తీసేయమంటే దానికి 30 శాతం కమీషన్లు అడుగుతున్నారు.
ఇంతకన్నా రైతులకు ద్రోహం ఏముంటుంది. చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కొని ఇళ్లు కట్టుకున్న మధ్యతరగతి వాళ్లవి కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఏదో ఎలిగిస్తామని కమిటీ వేశారు. కోదండరాం చైర్మన్‌గా ఓ కమిటీ వేసి భూ భారతి చట్టాన్ని మనమీద రుద్దితే ఏమైందో ఆలోచించండి. సీఎం, రెవెన్యూ మంత్రి ఇద్దరూ కూడా తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. మరి తప్పు జరిగినప్పుడు మీకు శిక్ష ఇవ్వాలి కదా అని అడుగుతున్నా.
తప్పు జరిగింది.. జరిపిస్తున్నారు. పేద ప్రజల కడుపుల మీద జరిగిన తప్పు ఇది. ప్రైవేట్, పట్టా భూములు ఈ జాబితాలో చేర్చి ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు. అవినీతిని న్యాయబద్ధం చేయడానికే ఈ 22ఏ జాబితా తెచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. పక్కనున్న తెలుగు రాష్ట్రంలో భూ సంస్కరణలు జరుగుతున్నయ్. ఇక్కడ కూడా జరగాలని చెబుతన్నం. కానీ ఈ విధంగా కాదు.
తెలంగాణ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఉంటామన్న భావన ప్రజలకు, రైతులకు లేదు. మొన్న సిద్దిపేట వెళ్లాను. వేలాది మంది రైతులొచ్చి వారి ఘోస చెప్పుకున్నారు. ఈ 22ఏ ద్వారా రైతులు బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఎప్పుడో కట్టుకున్న ఇళ్లు ఈరోజు నిషేధిత జాబితాలో వచ్చినయ్. హైకోర్టు జడ్జితోటి విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నం. మామూలుగా జరిగిన విషయం కాదిది. దీంట్లో వారికున్న దురుద్దేశం ఏంటో బయటకు రావాల్సిన అవసరం ఉన్నది.
పేదల భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్లు కూడా పట్టించుకోవట్లేదు. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అంతా క్షీణించిపోయింది. తెలంగాణ వచ్చినా జీవితాలు బాగుపల్లే. బీఆర్ఎస్ వచ్చినప్పుడు కుటుంబమే బాగుపడింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ సోదరులే బాగుపడ్డరు. 22ఏ భూముల సమస్యను పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్దఎత్తున తీసుకెళ్తాం. ఇంతటితో ఆగదు. మీ ప్రతి నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది.
క్యూర్ చట్టంలో కూడా ఉన్నయ్..
క్యూర్ చట్టంలో కూడా 22ఏ కు సంబంధించిన భూములు చాలా ఉన్నయ్. అవి ప్లాట్లు. ఎంతో మంది బ్యాంకు లోన్లు తీసుకొని చిన్న ఇల్లు కొనుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మందికి అమ్ముకునే పరిస్థితి లేదు. బ్యాంకులో మార్ట్‌గేజ్ చేసే పరిస్థితి లేదు. ఈ భూమి మాది అని చెప్పుకొనే హక్కు లేకుండా చేశారు. భూమి హక్కు మానవ అధికారం. కానీ కాంగ్రెస్ ఈ మానవ అధికారాన్ని హరిస్తున్నది.
అసెంబ్లీ రెండు రోజులే పెడుతున్నరు..
ఈ సభకు పర్మిషన్ ఇవ్వలే. కోర్టుకు పోయి అనుమతి తెచ్చినం. అసెంబ్లీ నడుస్తుంది ఇవ్వమని చెప్పారు. అయ్యా రేవంత్ పార్లమెంట్ నడుస్తుంటే జంతర్‌మంతర్ వద్ద పురుగుల పేరు మీద పెట్టిన మీటింగ్‌కు మేం ఇవ్వలేదా పర్మిషన్.. ఒక్కసారి ఆలోచించు. బీజేపీకి ఇక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వరు. అసెంబ్లీ రెండు రోజులే పెడుతున్నరు. ఎక్కువ రోజులు పెడితే మీదంతా బట్టబయలైతది కాబట్టి. మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని ప్రశ్నిస్తరని భయపడి రెండు రోజులే పెడుతున్నరు. అప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీని సరిగా నడపలేదు.
కాంగ్రెస్ మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఈ ఉద్యమం ప్రారంభం మాత్రమే. రోడ్ల మీదకు వస్తాం. ప్రజల వెంటే ఉంటాం. వారి కోసం పోరాడతాం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది 50-50 శాతం తప్పు ఉంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. రాగానే 22ఏ జాబితాలో ఉన్న భూములన్నీ విడిపిస్తాం అని రాంచందర్‌రావు భరోసా ఇచ్చారు.
సంబంధిత వార్తలు

Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్లో మద్దతు తెలిపిన కేటీఆర్
సెప్టెంబర్ 5, 2026

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి
సెప్టెంబర్ 5, 2026

Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
- ●World Map | మారనున్న ప్రపంచ పటం!
- ●KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్
- ●SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..
- ●PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
- ●Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్లో మద్దతు తెలిపిన కేటీఆర్

Asaduddin Owaisi | రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ఇక ముస్లింలకు వర్తించదా..? మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం

World Map | మారనున్న ప్రపంచ పటం!

KTR Karimnagar Speech | ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్

SIP | రూ.10వేల సిప్‌తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..




