Stock Market | లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 976 పాయింట్లు జంప్..!
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 976.77 పాయింట్లు పెరిగి 75,184.01కి చేరింది. నిఫ్టీ 301.7 పాయింట్లు పెరిగి 23,303.85కి చేరగా.. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు పడిపోయింది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 93.08 కనిష్టానికి చేరింది.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 976.77 పాయింట్లు పెరిగి 75,184.01కి చేరింది. నిఫ్టీ 301.7 పాయింట్లు పెరిగి 23,303.85కి చేరగా.. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు పడిపోయింది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 93.08 కనిష్టానికి చేరింది. ప్రస్తుతం 893.41 పాయింట్లు పెరిగి 75,100.65 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 285.55 పెరిగి 23,287.70 వద్ద ట్రేడవుతోంది. ఈ సందర్భంగా జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా మార్కెట్ అస్థిరతను ఎదుర్కొంటోందని తెలిపారు.
గురువారం 775 పాయింట్లు పడిపోవడంతో తొలి మూడు రోజుల్లో నిఫ్టీ సాధించిన లాభాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పేర్కొన్నారు. భవిష్యత్‌పై ఆశతో పాటు భయాలున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, మార్కెట్ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు పెట్టుబడిదారులకు కొంత ఉపశమనం కలిగించాయి. ఇరాన్ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ఇకపై దాడులు జరగవని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రకటన చేయడం ఊరట కలిగిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధరలు ఇటీవల గరిష్ఠ స్థాయి బ్యారెల్ 118 డాలర్ల నుంచి 106 డాలర్లకు పడిపోయాయి.
నిఫ్టీలో బ్రేయిన్‌బీస్ సోలు, ఒలెక్ట్రా గ్రీన్, గుజ్ మినరల్స్, ఎంఆర్‌పీఎల్, గోదావరి పవర్, ఐనాక్స్ విండ్, రైమండ్ లైఫ్, రియల్స్ పవర్, వొడాఫోన్ ఐడియా, ఐడీబీఐ లాభాల్లో కొనసాగుతుండగా.. పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ, మెట్రోపొలిస్, సుందరమ్ ఫిన్, నాల్కో, ఎంసీఎక్స్, బీఎస్ఈ లిమిటెడ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఒత్తిడిలోనే ఉన్నాయి. మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామా తర్వాత స్టాక్స్ బలహీనపడింది. బ్యాంక్ షేర్లు 0.85శాతం పడిపోయి రూ.791కి చేరాయి.
ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225 సూచీ 3 శాతానికి పైగా పడిపోయి 53,372 వద్దకు చేరాయి. సింగపూర్ స్ట్రెయిట్స్ టైమ్స్ సూచీ 0.26 శాతం తగ్గి 4,954 వద్ద, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.56 శాతం తగ్గి 25,358 వద్ద ముగిశాయి. అదే సమయంలో తైవాన్ వెయిటెడ్ సూచీ 0.21 శాతం పెరిగి 33,759 వద్దకు, దక్షిణ కొరియా కోస్పి సూచీ 0.55 శాతం పెరిగి 5,795 వద్దకు చేరుకున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.44 శాతం తగ్గి 46,021 వద్దకు, S&P 500 సూచీ 0.27 శాతం తగ్గి 6,606 వద్దకు, నాస్‌డాక్ సూచీ 0.28 శాతం తగ్గి 22,090 వద్దకు చేరుకున్నాయి.
బ్రెంట్ ముడి చమురు ధరలు
బ్రెంట్ ముడి చమురు ధర 1.63 శాతం తగ్గి, బ్యారెల్‌కు 106.9 డాలర్ల వద్దకు చేరింది. మార్కెట్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం.. గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) రూ. 7,558.19 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) రూ. 3,863.96 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గురువారం సెన్సెక్స్ 2,496.89 పాయింట్లు లేదా 3.26 శాతం పడిపోయి, 74,207.24 వద్ద ముగిసింది. జూన్ 2024 తర్వాత ఒక్క రోజులో నమోదైన అత్యంత భారీ పతనం ఇదే కావడం విశేషం. నిఫ్టీ 775.65 పాయింట్లు శాతం తగ్గి, 23,002.15 వద్ద ముగిసింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






