త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SEBI | ఫిన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ కొత్త షాక్.. 5 లక్షల ఫాలోవర్లు దాటితే స్పాన్స‌ర్డ్ కంటెంట్ రూల్స్ మ‌రింత క‌ఠినం..

SEBI | భారత ఆర్థిక రంగంలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ తీసుకొచ్చిన తాజా డ్రాఫ్ట్ అడ్వర్టైజింగ్ కోడ్ పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువ ఫాలోవర్లు ఉండడాన్ని ఒక ప్రతిష్ఠగా భావిస్తే, ఇకపై అదే సంఖ్య నిబంధనల పరంగా అదనపు బాధ్యతలను తీసుకురానుంది.

S

Business | Published On Jun 25, 2026, 4.02 pm IST

SEBI | ఫిన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ కొత్త షాక్.. 5 లక్షల ఫాలోవర్లు దాటితే స్పాన్స‌ర్డ్ కంటెంట్ రూల్స్ మ‌రింత క‌ఠినం..
Advertisement

SEBI | భారత ఆర్థిక రంగంలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ తీసుకొచ్చిన తాజా డ్రాఫ్ట్ అడ్వర్టైజింగ్ కోడ్ పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువ ఫాలోవర్లు ఉండడాన్ని ఒక ప్రతిష్ఠగా భావిస్తే, ఇకపై అదే సంఖ్య నిబంధనల పరంగా అదనపు బాధ్యతలను తీసుకురానుంది. సెబీ ప్రతిపాదించిన కొత్త డ్రాఫ్ట్ ప్రకారం ఒకే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో 5 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లను సెలబ్రిటీలుగా పరిగణిస్తారు. ఈ నిబంధన బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు వంటి సెబీ నియంత్రణలో ఉన్న సంస్థల ప్రకటనలకు వర్తిస్తుంది. సెలబ్రిటీ హోదా ఆకర్షణీయంగా కనిపించినా, దానితోపాటు కఠిన పరిశీలన, అదనపు అనుమతులు, విస్తృతమైన డాక్యుమెంటేషన్ వంటి బాధ్యతలు కూడా ఉంటాయి.

ముంద‌స్తు అనుమ‌తులు త‌ప్ప‌నిస‌రి..

చార్టర్డ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ సాక్షి జైన్ మాట్లాడుతూ ఒకసారి క్రియేటర్ 5 లక్షల ఫాలోవర్ల మార్క్ దాటితే, స్పాన్సర్డ్ కంటెంట్‌లో ఏం చెప్పవచ్చు, ఏం చెప్పకూడదనే విషయంపై సెబీ స్పష్టమైన గీత గీస్తోందన్నారు. ఒక బ్రాండ్‌ను సాధారణంగా ప్రచారం చేయడాన్ని అనుమతించినా, నిర్దిష్ట ప్రొడక్ట్‌పై ప్రశంసలు చేయడం మాత్రం కుదరదు. నేను ఈ ప్లాట్‌ఫామ్‌ను నమ్ముతున్నాన‌ని చెప్పవ‌చ్చు కానీ, ఈ ఫండ్ అద్భుతమైన రాబడులు ఇచ్చింది లేదా ఇదే ఉపయోగించాల్సిన ఉత్తమ యాప్ వంటి వ్యాఖ్యలు స్పాన్సర్డ్ కంటెంట్‌లో చేయడాన్ని అనుమతించర‌ని ఆమె వివరించారు. కొత్త నిబంధనలతో మరో పెద్ద సవాలు ముందస్తు అనుమతులు. సెలబ్రిటీగా గుర్తింపు పొందిన క్రియేటర్ల ప్రకటనలు ప్రచురించే ముందు సెబీ నుంచి ముందస్తు క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా సాధారణ ప్రకటనలను ప్రచురించిన తర్వాత నివేదించే విధానాన్ని సెబీ ప్రతిపాదించినప్పటికీ, సెలబ్రిటీ వర్గానికి మాత్రం ముందస్తు ఆమోదం కొనసాగుతుంది.

వేగంగా ప‌బ్లిష్ చేయ‌లేరు..

ఫైనాన్స్ క్రియేటర్ శివమ్ బుధిరాజా తెలిపిన‌ ప్రకారం అసలు సమస్య ఇక్కడే ప్రారంభమవుతుంద‌ని, ప్రస్తుతం వీడియోలు పూర్తిగా సిద్ధమైన తర్వాత అనుమతుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయని, ఇప్పుడు మరింత మంది క్రియేటర్లు సెలబ్రిటీ వర్గంలోకి వస్తే, సెబీ తన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచకపోతే అనుమతుల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంద‌ని చెప్పారు. ఈ ప్రతిపాదనలు క్రియేటర్ ఎకానమీకి ప్రధాన బలమైన వేగాన్నీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ ప్రకటనలు, విధాన మార్పులు లేదా వడ్డీ రేట్ల నిర్ణయాల వంటి తాజా పరిణామాలపై ఆర్థిక కంటెంట్ ను వేగంగా విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ముందస్తు అనుమతుల ప్రక్రియ వల్ల కొన్ని గంటల్లో స్పాన్సర్డ్ పోస్టులు సిద్ధం చేసే అవకాశం తగ్గిపోతుందని సాక్షి జైన్ పేర్కొన్నారు.

అన్ని రూల్స్ ప‌క్కాగా పాటించాలి..

టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్ అర్ష్ గోయల్ మాట్లాడుతూ ఈ డ్రాఫ్ట్ అమల్లోకి వస్తే క్రియేటర్లు సాధారణ కంటెంట్ తయారీదారుల కంటే చిన్న కంప్లయెన్స్ బృందాల్లా పనిచేయాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఒక బ్రాండ్ డీల్ కొన్ని రోజుల్లోనే సోషల్ మీడియా సందేశం నుంచి పోస్టుగా మారిపోతుందని, కానీ కొత్త డ్రాఫ్ట్ ప్రకారం ముందుగా అనుమతులు పొందడం, చేసిన ప్రతి క్లెయిమ్‌కు ఆధారాలు భద్రపరచడం వంటి ప్రక్రియలు తప్పనిసరి అవుతాయని ఆయన వివరించారు. కొత్త నిబంధనలతో బ్రాండెడ్ క్యాంపెయిన్ల స్వభావంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. బ్రాండ్‌కు సంబంధించిన సాధారణ ప్రచారం, నిర్దిష్ట ఉత్పత్తి సిఫార్సుల మధ్య స్పష్టమైన తేడాను సెబీ చూపుతోందని గోయల్ చెప్పారు. దీనివల్ల స్క్రిప్టులను తిరిగి రూపొందించాల్సి వ‌స్తుంద‌, ఇప్పటివరకు ఎక్కువ వ్యూస్ తెచ్చే ప్రొడక్ట్ డీప్-డైవ్ వీడియోల స్థానంలో సాధారణ బ్రాండ్ ప్రస్తావనలకే పరిమితం కావాల్సి వ‌స్తుంద‌ని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త పెరిగే అవ‌కాశం..

సాక్షి జైన్ తెలిపిన ప్రకారం ఒకే రోజులో స్పాన్సర్డ్ రీల్ చిత్రీకరించి అదే రోజున ప్రచురించే పరిస్థితి ఈ డ్రాఫ్ట్ అమల్లోకి వస్తే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంద‌న్నారు. అయితే శివమ్ బుధిరాజా మాత్రం ఇందులో సానుకూల అంశాన్ని కూడా ప్ర‌స్తావించారు. సెబీ పర్యవేక్షణ పెరగడం వల్ల పెద్ద క్రియేటర్లు చేసే బ్రాండెడ్ కంటెంట్‌పై ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడుతుంద‌ని, దీని వల్ల బ్రాండ్లకు, ప్రేక్షకులకు ఆ కంటెంట్ విలువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ రంగంలోని సంస్థలు కూడా ఈ ప్రతిపాదనను పరిశ్రమ మరింత పరిపక్వ దశలోకి అడుగుపెడుతున్న సంకేతంగా చూస్తున్నాయి. ప్రారంభ దశలో పనులు నెమ్మదించడంతోపాటు కంప్లయెన్స్ భారం పెరిగినా, దీర్ఘకాలంలో ఇది రంగానికి ప్రయోజనం క‌లిగిస్తుంద‌ని అభిప్రాయపడుతున్నాయి.

ముందు నుంచే లీగ‌ల్ గా వ్య‌వ‌హ‌రించాలి..

ఐప్లిక్స్ మీడియా సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీల్ గోగియా మాట్లాడుతూ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఇప్పుడు కేవలం కంటెంట్ ప్రచురించే వారే కాదు, వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేసే సిఫార్సు వ్యవస్థలుగా మారారని అన్నారు. అందుకే ఈ డ్రాఫ్ట్ క్రియేటర్లపై భారం మోపడం కంటే, ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు ప్రధాన ప్రకటన మాధ్యమంగా మారిందని గుర్తించే చర్యగా చూడాలని పేర్కొన్నారు. ఒప్రా సహ వ్యవస్థాపకురాలు మాన్సీ పన్‌పాలియా మాట్లాడుతూ సెలబ్రిటీ నిర్వచనంలోకి వచ్చే క్రియేటర్లు ఇకపై డిస్‌క్లోజర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ప్రచారంలో చేసే ప్రతి క్లెయిమ్‌కు ఆధారాలు సిద్ధంగా ఉంచాలని, ప్రారంభం నుంచే ఏజెన్సీలు, లీగల్ బృందాలు, బ్రాండ్లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. క్రియేటర్‌కల్ట్ సహ వ్యవస్థాపకురాలు శ్వేతా కౌశల్ అభిప్రాయం ప్రకారం ఫైనాన్స్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి నియంత్రిత రంగాల్లోని బ్రాండ్లు తాత్కాలికంగా ఇన్‌ఫ్లూయెన్సర్ భాగస్వామ్యాల విషయంలో మరింత ఎంపికతో వ్యవహరించే అవకాశం ఉంద‌న్నారు. అదనపు కంప్లయెన్స్ తనిఖీల కారణంగా క్యాంపెయిన్ ప్రణాళికలకు ఎక్కువ సమయం పడుతుంద‌ని ఆమె తెలిపారు.

క్రాక్‌డ్ సహ వ్యవస్థాపకురాలు సాన్యా బజాజ్ మాట్లాడు, ఈ ప్రతిపాదనతో 5 లక్షల ఫాలోవర్ల మైలురాయి ఇకపై కేవలం రీచ్‌ను మాత్రమే సూచించదని అన్నారు. బ్రాండ్ డీల్స్ పొందడానికి భారీ ఫాలోయింగ్ ఒక్కటే సరిపోకుండా, విశ్వసనీయత, పారదర్శకత, కంప్లయెన్స్ కూడా సమానంగా కీలక ప్రమాణాలుగా మారే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Advertisement
Advertisement