OnePlus Nord Buds 4 | వన్‌ప్లస్ నుంచి నార్డ్ బడ్స్ 4 ఇయర్‌బడ్స్.. ఏఐ అసిస్టెంట్‌తో.. ధర తక్కువే..
OnePlus Nord Buds 4 | మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ 4ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ), బ్లూటూత్ 6.1, డ్యుయల్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, 12ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇచ్చారు.
Technology | Published On Jun 25, 2026, 5.10 pm IST
OnePlus Nord Buds 4 | మొబైల్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నార్డ్ బడ్స్ 4ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్‌సీ), బ్లూటూత్ 6.1, డ్యుయల్ కనెక్షన్, గూగుల్ ఫాస్ట్ పెయిర్, 12ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇచ్చారు. గతంలో వచ్చిన మోడల్స్‌తో పోలిస్తే ఈ బడ్స్‌ను వినూత్న రీతిలో రూపొందించారు. ఇవి కొద్దిగా చతురస్రాకారంలో ఉండే నిలువు కేస్‌లో అమర్చి ఉంటాయి. టచ్ కంట్రోల్స్‌కు సపోర్ట్‌ను ఇచ్చారు. నీరు, చెమట నుంచి రక్షణ కోసం ఐపీ55 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఏఐ ట్రాన్స్‌లేషన్, ఏఐ అసిస్టెంట్ ఫీచర్లను కూడా వీటికి ఇచ్చారు.
54 గంటల ప్లేబ్యాక్..
ఒక్కో ఇయర్‌బడ్ సుమారుగా 4.3 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. అందువల్ల ధరించేందుకు చాలా తేలిగ్గా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 54 గంటల ప్లేబ్యాక్‌ను ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఏఎన్‌సీ లేకుండా 13 గంటల స్టాండలోన్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. 10 నిమిషాల చార్జింగ్‌తో 11 గంటల ప్లేబ్యాక్‌ను పొందవచ్చు. 12ఎంఎం టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్స్ ఉన్నందున సౌండ్ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంటుంది. బ్లూటూత్ 6.1 ద్వారా ఇవి కనెక్ట్ అవుతాయి. కాల్స్‌ను స్పష్టంగా మాట్లాడేందుకు ఏకంగా 6 మైక్రోఫోన్‌లను ఇచ్చారు. ప్రతి బడ్‌కు 3 మైక్రోఫోన్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే శబ్దాలను తగ్గిస్తాయి. దీంతో కాల్స్ ను స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇక ఇందుకు ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ అనే ఫీచర్ పనిచేస్తుంది. అలాగే ఏఐ అసిస్టెంట్ ద్వారా ఇయర్‌బడ్స్‌ను చాలా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. కేవలం ఒకసారి టచ్ చేస్తే సులభంగా పెయిర్ అవుతాయి.
ధర వివరాలు..
ఏఐ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా అలారం, రిమైండర్స్, వాతావరణం, ఏఐ ప్రాంప్ట్‌లు వంటి సదుపాయాలను పొందవచ్చు. ఏఐ ట్రాన్స్‌లేట్ సహాయంతో ఎంపిక చేసిన వన్‌ప్లస్ ఫోన్లలో కాల్స్ మాట్లాడేటప్పుడు లేదా మీడియాను వినేటప్పుడు రియల్‌టైమ్‌లో అనువాదం చేస్తుంది. ట్రాక్ మార్పు, వాయిస్ అసిస్టెంట్, ప్లే లేదా పాజ్ కోసం టచ్ కంట్రోల్స్ ఇచ్చారు. చార్జింగ్ బాక్స్ 42.5 గ్రాముల బరువుతో అత్యంత తేలిగ్గా ఉంటుంది. బడ్స్ 62ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా, కేస్‌లో 530 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఇయర్‌బడ్స్ స్టెల్లార్ బ్లాక్, ఆస్ట్రల్ టీల్ రంగుల్లో లాంచ్ అయింది. దీని ధరను రూ.3,299గా నిర్ణయించారు. వీటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, మింత్రా, బ్లింకిట్, వన్‌ప్లస్ స్టోర్‌లు, ఎంపిక చేసిన రిటెయిల్ స్టోర్స్‌లో జూన్ 29 నుంచి విక్రయించనున్నారు. ప్రారంభ ఆఫర్ కింద ఈ బడ్స్‌ను రూ.200 తగ్గింపు అనంతరం రూ.3,099 ధరకు పరిమిత కాలం పాటు అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు

OnePlus Nord CE6 Lite | భారీ బ్యాటరీ, అదిరిపోయే ఏఐ ఫీచర్లు.. వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ6 లైట్ ఫోన్..
మే 8, 2026

OnePlus Nord CE6 | భారీ బ్యాటరీ, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో వచ్చిన వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్
మే 7, 2026

OnePlus Summer Sale | వన్‌ప్లస్ ప్రత్యేక సమ్మర్ సేల్.. ఫోన్లు, ట్యాబ్‌లపై భారీ తగ్గింపు ధరలు..
మే 4, 2026
తాజావార్తలు
- ●River disputes | కేంద్రం డైరెక్షన్ లో కొత్త నీళ్ల ఒప్పందాలు
- ●Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ - డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ - హీరోల కంటే ఎక్కువే
- ●Switzerland vs Canada | ఓడినా తొలిసారి నాకౌట్‌కు కెనడా ఎంట్రీ.. గ్రూప్ టాపర్‌గా స్విట్జర్లాండ్
- ●Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..
- ●SEBI | ఫిన్ఫ్లూయెన్సర్లకు సెబీ కొత్త షాక్.. 5 లక్షల ఫాలోవర్లు దాటితే స్పాన్సర్డ్ కంటెంట్ రూల్స్ మరింత కఠినం..
- ●Sukumar Wife | నేను పక్కా తెలంగాణ అమ్మాయినే - డైరెక్టర్ సుకుమార్ భార్య కామెంట్స్

River disputes | కేంద్రం డైరెక్షన్ లో కొత్త నీళ్ల ఒప్పందాలు

Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ - డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ - హీరోల కంటే ఎక్కువే

Switzerland vs Canada | ఓడినా తొలిసారి నాకౌట్‌కు కెనడా ఎంట్రీ.. గ్రూప్ టాపర్‌గా స్విట్జర్లాండ్

Stock Markets | ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన పెట్టుబడిదారులు..



