Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ – డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ – హీరోల కంటే ఎక్కువే
జాన్వీ కపూర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళంలో కురథి పేరుతో సోషియో థ్రిల్లర్ వెబ్‌సిరీస్ చేయబోతుంది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించనున్న ఈ సిరీస్ కోసం జాన్వీకపూర్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ దక్షిణాదితో పాటు బాలీవుడ్ వర్గాల్లో షాకింగ్‌గా మారింది.
Entertainment | Published On Jun 25, 2026, 4.27 pm IST
Janhvi Kapoor | ఇటీవలే పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది జాన్వీ కపూర్. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అచ్చియమ్మ అనే మాస్ రోల్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. జాన్వీ డైలాగ్స్, ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరుపై ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల నుంచి దారుణంగా విమర్శలొచ్చాయి. ప్రాముఖ్యతలేని పాత్రలో అభ్యంతర కరరీతిలో దర్శకుడు జాన్వీని చూపించారంటూ ఫైర్ అయ్యారు. ఈ విమర్శల కారణంగా రిలీజ్ తర్వాత పెద్ది ప్రమోషన్స్‌కు ఈ బాలీవుడ్ బ్యూటీ దూరమైంది.
ఓటీటీలో తొలి అడుగు...
పెద్ది తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టిన జాన్వీ కపూర్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హిందీలో కాకుండా తమిళంలో ఈ సిరీస్ చేయబోతున్నదట.
పా రంజిత్...
కురథి అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌ను తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ నిర్మించబోతున్నారు. సర్కునమ్ దర్శకత్వం వహించనున్నారు .సమాజంలోని అసమానతలను చర్చిస్తూ సోషియో థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ తమిళ వెబ్‌సిరీస్‌లో జాన్వీ కపూర్ గిరిజన యువతిగా కనిపించబోతున్నట్లు సమాచారం. కట్టుబాట్లు, వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుడుగు వేసే అమ్మాయిగా జాన్వీ పాత్ర రా అండ్ రస్టిక్‌గా ఉంటుందట. ఇప్పటివరకు చేసిన గ్లామరస్ రోల్స్‌కు పూర్తి భిన్నంగా ఇందులో జాన్వీ కొత్తగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రెమ్యూనరేషన్...
కాగా ఈ తమిళ వెబ్‌సిరీస్ కోసం జాన్వీ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ దక్షిణాదితో బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. డెబ్యూ వెబ్‌సిరీస్ కోసం ఇరవై కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు జాన్వీ కపూర్ ఐదు నుంచి ఆరు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కురథి వెబ్‌సిరీస్‌కు మాత్రం మూడింతలు ఎక్కువగా రెమ్యూనరేషన్ స్వీకరిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
జాన్వీ కపూర్ డెబ్యూ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. త్వరలోనే కురథి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్
ఆగస్టు 15, 2026

Janhvi Kapoor | నో గ్లామర్ – అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ – దీపికా, రష్మికలకు ధీటుగా!
ఆగస్టు 13, 2026

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
- ●Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా
- ●Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి
- ●Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు
- ●నబీన్ మార్క్ ‘షాక్ థెరపీ’… తెలంగాణ బీజేపీకి ఢిల్లీ పీఠంలో ‘జీరో’ దక్కడానికి 5 కారణాలు ఇవే!

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్‌మేళా

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి

Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం



