SBI Personal Loan | వేతన జీవులకు ఎస్‌బీఐ ఆఫర్.. నిమిషాల్లో రూ.35 లక్షల వరకు రుణం పొందే చాన్స్..!
SBI Personal Loan | అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు సమకూర్చుకోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. బ్యాంక్‌కు వెళ్లడం, డాక్యుమెంట్లు సమర్పించడం, అనుమతుల కోసం ఎదురుచూడడం వంటి ప్రక్రియలు సమయాన్ని తీసుకుంటాయి.
SBI Personal Loan | అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు సమకూర్చుకోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. బ్యాంక్‌కు వెళ్లడం, డాక్యుమెంట్లు సమర్పించడం, అనుమతుల కోసం ఎదురుచూడడం వంటి ప్రక్రియలు సమయాన్ని తీసుకుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారుల కోసం ప్రత్యేకమైన డిజిటల్ వ్యక్తిగత రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది. రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ అనే ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్‌లైన్‌లోనే కొన్ని నిమిషాల్లోనే వ్యక్తిగత రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ డిజిటల్ లోన్ సదుపాయం ఎస్‌బీఐ యోనో మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వైద్య ఖర్చులు, విద్యా వ్యయాలు, పెళ్లిళ్లు లేదా ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం ఈ రుణాన్ని వినియోగించుకోవచ్చు. డిజిటల్ ధ్రువీకరణ, ఆటోమేటెడ్ చెక్స్ ద్వారా లోన్ మంజూరు ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
గరిష్టంగా ఎంత రుణం, ఎవరు అర్హులు..?
ఈ స్కీమ్ కింద ఖాతాదారులు రూ.1 లక్ష నుంచి రూ.35 లక్షల వరకు రుణం పొందవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్‌గా ఉంటుంది. పొడవాటి ఫామ్‌లు నింపాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్నవారికి యోనో యాప్‌లోనే లోన్ ఆఫర్ కనిపిస్తుంది. దాన్ని అంగీకరిస్తే వెంటనే లోన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత నిమిషాల్లోనే లోన్ లభిస్తుంది. ఇక ఎస్‌బీఐ శాలరీ అకౌంట్ కలిగిన వారు ఈ లోన్‌కు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, అలాగే కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ ఎస్‌బీఐలో శాలరీ ఖాతా కలిగిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ క్రమంలో బ్యాంక్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా అర్హతను పరిశీలిస్తుంది. అర్హత ఉంటే యోనో యాప్‌లోనే లోన్ ఆఫర్ ప్రత్యక్షమవుతుంది.
సిబిల్ 600 నుంచి 700 ఉన్నా చాలు..
ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా గుర్తింపు నిర్ధారణ చేస్తారు. క్రెడిట్ ప్రొఫైల్‌ను బ్యాంక్ సిస్టమ్ తక్షణమే పరిశీలిస్తుంది. సిబిల్ స్కోర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 650-700 మధ్య స్కోర్ ఉన్నవారికి రుణం సులభంగా లభిస్తుంది. ఈ క్రమంలో లోన్ ప్రక్రియలో భాగంగా ఇ-సిగ్నేచర్ పూర్తయిన వెంటనే మంజూరైన మొత్తం నేరుగా ఖాతాలో జమ అవుతుంది. చాలా వరకు ఈ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇక ఇలా తీసుకునే రుణంపై వడ్డీ రేట్లను ఎస్‌బీఐ రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ (MCLR) ఆధారంగా నిర్ణయిస్తారు. ఒకసారి రేటు ఫిక్స్ అయితే, లోన్ గడువు మొత్తం అదే కొనసాగుతుంది. అలాగే ఈ లోన్‌పై హిడెన్ ఛార్జిలు లేవని బ్యాంక్ స్పష్టం చేసింది. మంచి ఆదాయం, స్థిరమైన ఉద్యోగం, మెరుగైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారికి ఎక్కువ రుణం కూడా లభించే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



