త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PSLV-C62 | పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ప్ర‌యోగంలో సాంకేతిక లోపం.. శాటిలైట్‌తో తెగిన సంబంధాలు..

PSLV-C62 | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ISRO) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన EOS-N1 మిష‌న్ లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. అన్వేష‌గా నామ‌క‌ర‌ణం చేయ‌బ‌డిన ఈ మిష‌న్ లో భాగంగా పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ప్ర‌యోగం 4వ దశ‌లో సాంకేతిక లోపం కార‌ణంగా ప్ర‌యోగం ఆల‌స్యం అయింది.

S

Science | Published On Jan 12, 2026, 12.59 pm IST

PSLV-C62 | పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ప్ర‌యోగంలో సాంకేతిక లోపం.. శాటిలైట్‌తో తెగిన సంబంధాలు..
Advertisement

PSLV-C62 | భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ISRO) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన EOS-N1 మిష‌న్ లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. అన్వేష‌గా నామ‌క‌ర‌ణం చేయ‌బ‌డిన ఈ మిష‌న్ లో భాగంగా పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ప్ర‌యోగం 4వ దశ‌లో సాంకేతిక లోపం కార‌ణంగా ప్ర‌యోగం ఆల‌స్యం అయింది. పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ప్ర‌యోగంలో సాంకేతిక లోపం త‌లెత్తిన కార‌ణంగానే ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో 4వ ద‌శ‌లో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయిన‌ట్లు నిర్దారించారు. మొత్తం 18 నిమిషాల్లోనే ఈ ప్ర‌యోగం పూర్తి కావ‌ల్సి ఉంది. కానీ సాంకేతిక లోపం కార‌ణంగా ఆల‌స్యం అయింది. కాగా ఈ విష‌యంపై ఇస్రో చైర్మ‌న్ నారాయ‌ణ‌న్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ ప్ర‌యోగంలో అంత‌రాయం ఏర్పడింద‌న్నారు. ప్ర‌యోగం 3వ ద‌శ వ‌ర‌కు సాఫీగానే సాగినా 4వ ద‌శ‌లో స‌మ‌స్య త‌లెత్తింద‌ని చెప్పారు. సాంకేతిక లోపం కార‌ణంగా మిష‌న్ కు అంత‌రాయం ఏర్ప‌డింద‌న్నారు. ఈ క్ర‌మంలోనే డేటాను విశ్లేషిస్తున్నామ‌ని, స‌మ‌స్యను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు.

తిరుప‌తి జిల్లాలోని శ్రీ‌హ‌రికోట‌లో ఉన్న స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంటర్‌-షార్ నుంచి పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్‌ను సోమ‌వారం ఉద‌యం అనుకున్న స‌మాయానికే 10:18 గంట‌ల‌కు ప్ర‌యోగించారు. 2026లో ఇస్రో చేప‌ట్టిన తొలి ప్ర‌యోగం ఇదే కాగా ఈవోఎస్‌-ఎన్‌1 శాటిలైట్‌తోపాటు మ‌రో 15 చిన్న ఉప‌గ్ర‌హాల‌ను పీఎస్ఎల్‌వీ-సి62 రాకెట్ మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలోనే మొద‌టి మూడు ద‌శ‌ల్లో ప్ర‌యోగం సాఫీగానే సాగింది. కానీ నాలుగ‌వ ద‌శ‌లో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో సాంకేతిక లోపం ఏర్ప‌డి మిష‌న్‌కు అంత‌రాయం క‌లిగింది. ఈ క్ర‌మంలోనే స‌మ‌స్య‌ను ప‌రిష్కరించేందుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

కాగా ఈవోఎస్‌-ఎన్‌1 శాటిలైట్ ద్వారా ర‌క్ష‌ణ రంగం, వ్య‌వ‌సాయ రంగానికి చెందిన ప‌లు అంశాల్లో సైంటిస్టులు ముమ్మ‌ర ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ ఉప‌గ్ర‌హం భూమిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు కోణాల్లో, నిర్దిష్ట‌మైన త‌రంగాల‌తో స్కాన్ చేసి ఆ ఫొటోల‌ను భూమికి పంపిస్తుంది. కానీ సాంకేతిక లోపం కార‌ణంగా మిష‌న్‌కు అంత‌రాయం క‌ల‌గ‌డంతో ఈ మిష‌న్ పూర్త‌వుతుందా, కాదా అని సందేహాలు ఏర్ప‌డుతున్నాయి. దీనిపై ఇస్రో సైంటిస్టులు మ‌రికొద్ది గంట‌ల్లో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తార‌ని తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement