త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rs 50 Lakh Home Loan | రూ.50 ల‌క్ష‌ల ఇంటి రుణం పొందాలంటే నెల‌కు ఎంత వేతనం ఉండాలి..?

Rs 50 Lakh Home Loan | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవ‌లే రెపో రేటును త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. 1.25 శాతం మేర ఈ రేటును త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే హోమ్ లోన్స్‌తోపాటు కార్ లోన్లు, ఎడ్యుకేష‌న్ లోన్ల‌కు సంబంధించిన ఈఎంఐలు కాస్త త‌గ్గాయి.

S

Business | Published On Dec 22, 2025, 12.36 pm IST

Rs 50 Lakh Home Loan | రూ.50 ల‌క్ష‌ల ఇంటి రుణం పొందాలంటే నెల‌కు ఎంత వేతనం ఉండాలి..?
Advertisement

Rs 50 Lakh Home Loan | రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవ‌లే రెపో రేటును త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం విదిత‌మే. 1.25 శాతం మేర ఈ రేటును త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే హోమ్ లోన్స్‌తోపాటు కార్ లోన్లు, ఎడ్యుకేష‌న్ లోన్ల‌కు సంబంధించిన ఈఎంఐలు కాస్త త‌గ్గాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా లోన్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది. ముఖ్యంగా ఇంటి రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను బాగా త‌గ్గించారు. దీంతో కొత్త‌గా ఇంటి రుణం తీసుకునే వారు ప్ర‌స్తుతం చాలా త‌క్కువ‌గా 7.25 శాతం మొద‌లుకొని లోన్ తీసుకోవ‌చ్చు. అయితే వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డంతో చాలా మంది త‌మ‌కు వచ్చే జీతానికి ఎంత మొత్తంలో ఇంటి రుణం ల‌భిస్తుంద‌ని అన్వేషించ‌డం మొద‌లు పెట్టారు. ఈ క్ర‌మంలోనే త‌గ్గిన వ‌డ్డీ రేట్ల ప్ర‌కారం తాము తీసుకునే ఇంటి రుణం మొత్తానికి నెల‌కు ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వ‌స్తుంది..? అన్న విష‌యాన్ని తెలుసుకునేందుకు కూడా ఆస‌క్తిని చూపిస్తున్నారు.

నెల‌కు ఉండాల్సిన వేత‌నం..

కాగా బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్న ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఇంటి రుణం తీసుకోవాలంటే అత‌నికి వ‌చ్చే రుణం మొత్తం అత‌నికి ఉండే అర్హ‌త‌ల‌ను బ‌ట్టి ఉంటుంది. లోన్ ఇవ్వ‌డం అనేక అంశాల‌పై ఆధార ప‌డి ఉంటుంది. అయితే ఎస్‌బీఐలో సాధార‌ణంగా రూ.50 ల‌క్ష‌ల ఇంటి రుణం పొందాలంటే మాత్రం ఒక వ్య‌క్తి నెల‌కు క‌నీసం రూ.69వేల వ‌ర‌కు వేత‌నం పొందుతూ ఉండాలి. ఆ వేత‌నం ఉంటేనే అలాంటి వారికి ఎస్‌బీఐలో రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇంటి రుణం ల‌భించే అవ‌కాశాలు ఉంటాయి. అయితే అలాంటి వ్య‌క్తికి ఇత‌ర ఏ భారీ లోన్లు ఉండ‌కూడ‌దు. అలాగే సిబిల్ కూడా బాగుండాలి. పాత చెల్లింపుల రికార్డు కూడా బాగుండాలి. అలా అయితేనే ఆ మొత్తం రుణం ల‌భిస్తుంది.

ఈఎంఐ ఇలా ఉంటుంది..

ఇక ఎస్‌బీఐ ద్వారా 7.25 శాతం వ‌డ్డీ రేటుతో రూ.50 ల‌క్ష‌ల  ఇంటి రుణం తీసుకుంటే, ఆ వ్య‌క్తి వేత‌నం రూ.69వేలు అయితే 30 ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి గాను అత‌ని నెల‌వారి ఈఎంఐ దాదాపుగా రూ.34,500 వ‌ర‌కు ఉంటుంది. అయితే ఇది ఉజ్జాయింపు మాత్ర‌మే. శాంక్ష‌న్ అయిన లోన్ మొత్తం, వ‌డ్డీ రేటు, ఖాతాదారుడు ఎంచుకునే కాల‌వ్య‌వ‌ధి, ఇత‌ర చార్జిలు వంటి అంశాల ఆధారంగా ఆ ఈఎంఐ విలువ కాస్త అటు ఇటుగా మారుతుంది. కానీ అలాంటి లోన్‌కు మాత్రం దాదాపుగా అదే ఈఎంఐ ఉంటుంది. ఇక వ‌డ్డీ రేటు కాస్త పెరిగి 7.5 శాతం అయితే ఈఎంఐ కూడా కాస్త పెరుగుతుంది. అలాగే లోన్ కాల‌వ్య‌వధి కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంది.

వ‌డ్డీ రేట్ల విష‌యంలో..

అయితే ఇంటి రుణాల‌ను పొందాల‌ని అనుకునే వారు కేవ‌లం ఒకే బ్యాంకులో విచారించ‌కూడ‌దు. ప‌లు బ్యాంకుల‌ను సంప్ర‌దించాలి. అత్యుత్త‌మ వ‌డ్డీరేటు, త‌క్కువ చార్జిలు, అధిక మొత్తం లోన్‌ ఏ బ్యాంకులో అయితే ఇస్తారో అందులో లోన్ పొందే ఉపాయం చేయాలి. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌కు ఎక్కువ మొత్తంలో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అలాగే వ‌డ్డీ రేట్ల విష‌యంలో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి ఫిక్స్‌డ్ కాగా రెండోది ఫ్లోటింగ్‌. ఫిక్స్‌డ్ వ‌డ్డీ రేటు అయితే లోన్ కాల వ్య‌వ‌ధి మొత్తం ఒకే వ‌డ్డీ రేటు చెల్లించాలి. అదే ఫ్లోటింగ్ అయితే బ్యాంకు స‌వ‌రించిన రేట్ల ప్ర‌కారం వ‌డ్డీ రేట్ల‌ను చెల్లించాలి. దీని వ‌ల్ల ఈఎంఐ మొత్తం త‌ర‌చూ మారుతుంది. ఈ విధంగా వ‌డ్డీ రేట్ల‌ను చూసుకుని మ‌రీ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement