త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rupee Value | మరింత దిగజారి.. లైఫ్‌టైమ్ క‌నిష్ఠానికి రూపాయి విలువ

Rupee Value | ఓ వైపు బంగారం, వెండి ధ‌ర‌లు (Gold Silver Rate) ఆకాశ‌మే హ‌ద్దుగా ప‌రుగులు పెడుతున్నాయి. మ‌రోవైపు రూపాయి మార‌క‌పు విలువ (Rupee Value) అధఃపాతాళానికి ప‌డిపోతున్న‌ది.

G

Business | Published On Jan 29, 2026, 11.20 am IST

Rupee Value | మరింత దిగజారి.. లైఫ్‌టైమ్ క‌నిష్ఠానికి రూపాయి విలువ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఓ వైపు బంగారం, వెండి ధ‌ర‌లు (Gold Silver Rate) ఆకాశ‌మే హ‌ద్దుగా ప‌రుగులు పెడుతున్నాయి. మ‌రోవైపు రూపాయి మార‌క‌పు విలువ (Rupee Value) అధఃపాతాళానికి ప‌డిపోతున్న‌ది. పుత్త‌డి, వెండి ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతూ స‌రికొత్త చ‌రిత్ర సృష్టిస్తున్నాయి. అదే విధంగా మ‌న క‌రెన్సీ విలువ క‌నిష్ఠానికి చేరుతూ రికార్డు సృష్టిస్తున్న‌ది.

తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో రూపీ వ్యాల్యూ మ‌రింత క్షీణించింది. గురువారం సెషన్‌లో తొలిసారి ఏకంగా 92 మార్క్‌ను తాకి, సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. అంత‌కుముందు సెషన్‌లో డాలరుతో (Dollar) పోలిస్తే రూపాయి మారకపు విలువ 31 పైసలు తగ్గి 91.99 వద్ద ముగిసిన విష‌యం తెలిసిందే.

కాగా, బంగారం, వెండి ధ‌ర‌లు సామాన్యుల‌కు అంద‌నంతగా పెరిగిపోయాయి. ఒకేరోజు 24 క్యారెట్ల‌ స్వ‌చ్ఛ‌మైన పుత్త‌డి ధ‌ర రూ.11,770 మేర పెరిగింది. దీంతో ప‌ది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌రం రూ.1,78,850కి చేరింది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం కూడా రూ.10,800 అధిక‌మ‌వ‌డంతో రూ.1,63,950 వ‌ద్ద ఉన్న‌ది. ఇక వెండి ధ‌ర చుక్క‌ల‌ను తాకుతున్న‌ది. బంగారం ధ‌ర‌లు మండిపోతుండంతో వెండితోనైనా స‌రిపెట్టుకుందామ‌ని అనుకునే సామాన్యులకు అంద‌నంత దూరం వెళ్లిపోతున్న‌ది. ఒక్కోరోజే రూ.25 వేలు పెరడంతో కేజీ వెండి ధ‌ర రూ.4.25 ల‌క్ష‌ల‌కు చేరింది.

తాజాగా పెరిగిన ధ‌ర‌ల‌తో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,78,850, 22 క్యారెట్ల పుత్త‌డి ధర రూ.1,63,950గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో 24 క్యారెట్ల స్వ‌చ్ఛ‌మైన పుత్త‌డి అత్య‌ధికంగా రూ.1,79,000 వేలకు చేర‌గా, 22 క్యారెట్ల స్వ‌ర్ణం రూ.1,64,100గా ఉంది. వెండి ధ‌ర హైదరాబాద్‌లో కిలో రూ.4,25,000లుగా ఉండ‌గా, చెన్నైలో కూడా అంతే ధ‌ర ప‌లుకున్న‌ది. ఇక ఢిల్లీ, ముంబైల్లో రూ.4,10,000 వద్ద ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement