Hyderabad Police | పెప్పర్ స్ప్రే కొట్టి.. రూ. 25 లక్షలు దోపిడీ
Hyderabad Police | నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ పేరుతో పెప్పర్ స్ప్రే కొట్టి రూ. 25 లక్షలు దోచుకున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 11.50 లక్షల నగదుతో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Police | త్రినేత్ర న్యూస్ : నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ పేరుతో పెప్పర్ స్ప్రే కొట్టి రూ. 25 లక్షలు దోచుకున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 11.50 లక్షల నగదుతో పాటు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి మీడియాకు వెల్లడించారు.
ఈ నెల 11న ఇండియన్ కరెన్సీని క్రిప్టో కరెన్సీగా మారుస్తామని నమ్మించి బాధితులను రూ. 25 లక్షల నగదుతో నాంపల్లిలోని ఓ కార్యాలయానికి పిలిపించారు. ఇక పథకం ప్రకారం వారి కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి, దాడి చేసి రూ. 25 లక్షల నగదును దోచుకెళ్లారు.
బాధితులు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపి ఈ నెల 17న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. నిందితులను విజయ్ నగర్ కాలనీ వాసి సయ్యద్ ఐజాజ్ అలియాస్ గోలీ అలియాస్ గల్లా కాటా ఐజాజ్(31), అత్తాపూర్ వాసి సయ్యద్ జకరియా అహ్మద్ అలియాస్ షాఫెజ్ (26), మలక్పేట వాసి సుమైర్ ఖాన్ (26), నిర్మల్ జిల్లాకు చెందిన గుగ్లోత్ విజేష్ కుమార్ (30), నాంపల్లి బజార్ఘాట్ వాసి ఎండి ఫరాజ్ హుస్సేన్ (31)గా గుర్తించారు. తెలియని మహిళా వాయిస్తో కాల్ చేసిన వ్యక్తి, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
సంబంధిత వార్తలు

CP VC Sajjanar | సైబర్ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక సూచనలు
అక్టోబర్ 13, 2026

Chinese Manja Seize | రూ.7.50 లక్షల విలువైన చైనా మాంజా స్వాధీనం.. ఒకరి అరెస్ట్
అక్టోబర్ 7, 2026

Bolarum Arms Theft | బొల్లారం మిలిటరీ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్: ముగ్గురు జవాన్లు సహా మరో ఏడుగురు అరెస్ట్.. అసలు స్కెచ్ అదే
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్
- ●Sirens, Multiple Horns Cases | సైరన్, మల్టీ హారన్లతో నిబంధనల ఉల్లంఘన.. 304 కేసులు నమోదు
- ●MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Madhu Goud Yaskhi | మోదీ పాలన.. ప్రమాదంలో రాజ్యాంగం
- ●Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ - రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక

Hyderabad Police | పోలీసులమని చెప్పి.. కిడ్నాప్ చేసి కోటి వసూల్

Sirens, Multiple Horns Cases | సైరన్, మల్టీ హారన్లతో నిబంధనల ఉల్లంఘన.. 304 కేసులు నమోదు

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికలు.. కోదండరాంతో మహేశ్ కుమార్ గౌడ్ చర్చ

Traffic Restrictions | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు



