Rs. 1 Crore Earning | 30 ఏళ్ల వయస్సులో డబ్బు పొదుపు ప్రారంభిస్తే 45 ఏళ్ల వరకు రూ.1 కోటి సంపాదించవచ్చా..?
Rs. 1 Crore Earning | సాధారణంగా మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడులను ప్రారంభిస్తే తక్కువ వయస్సు ఉన్నప్పుడే ఆ పని చేయాలని చెబుతుంటారు. దీని వల్ల డబ్బు సరైన టైముకు చేతికందుతుందని అంటుంటారు. అయితే 30 ఏళ్ల వయస్సు తరువాత కూడా పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.
Rs. 1 Crore Earning | సాధారణంగా మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడులను ప్రారంభిస్తే తక్కువ వయస్సు ఉన్నప్పుడే ఆ పని చేయాలని చెబుతుంటారు. దీని వల్ల డబ్బు సరైన టైముకు చేతికందుతుందని అంటుంటారు. అయితే 30 ఏళ్ల వయస్సు తరువాత కూడా పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. ఇది పెద్ద ఆలస్యమేమీ కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రిటైర్మెంట్ లక్ష్యాన్ని కలిగి ఉండడం మంచిదే అయినప్పటికీ పెట్టుబడికి వయస్సుతో పనిలేదని, ఏ వయస్సులోనైనా ఎవరైనా డబ్బును పొదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వయస్సు ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుబడులు పెడితే నెల నెలా అధిక మొత్తంలో డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రిటైర్మెంట్ వయస్సుకు వచ్చే వరకు అనుకున్న కార్పస్ ఫండ్ చేతిలో ఉంటుంది. ఇక 30 ఏళ్ల వయస్సులో పెట్టుబడి ప్రారంభించి 45 ఏళ్లకు కనీసం రూ.1 కోటి సంపాదిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.
ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు వీలు..
15 సంవత్సరాల కాల వ్యవధిని దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఓ ముఖ్యమైన కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో పెట్టుబడిదారులు ఎక్కువ రిస్క్ తీసుకోగలుగుతారు. దీంతో రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా అన్ని వివరాలను పూర్తిగా చదివి, తెలుసుకుని డబ్బును పొదుపు చేయాలి. లేదంటే అనుకున్న టైముకు డబ్బు రాకపోవడమో లేదా అనుకున్న మొత్తంలో రాబడి లభించకపోవడమో జరుగుతుంది. ఇక మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలం పాటు ఏ ఫండ్‌లో అయితే ఎక్కువ లాభం వస్తుందో చూసి డబ్బును పొదుపు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల 15 ఏళ్ల అనంతరం అనుకున్న మొత్తంలో రాబడి పొందవచ్చు.
కాంపౌండింగ్ శక్తి అంతా ఇంతా కాదు..
దీర్ఘకాలిక పెట్టుబడుల్లో కాంపౌండింగ్ శక్తి కీలకంగా ఉంటుంది. డబ్బు కాంపౌండింగ్ ద్వారా అధిక మొత్తంలో వృద్ధి చెందుతుంది. అందువల్ల 30 ఏళ్ల వయస్సులో పెట్టుబడులను మొదలుపెడితే 45 ఏళ్ల వయస్సు వచ్చే వరకు రూ.1 కోటి సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణ, నిరంతర పెట్టుబడి ఉంటే ఆ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇప్పటి వరకు మ్యుచువల్ ఫండ్స్ మార్కెట్‌లో వచ్చిన నివేదికల ప్రకారం డబ్బును వాటిల్లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద ఎత్తున ఒకేసారి అధిక మొత్తాన్ని పెట్టాల్సిన పనిలేదు. నెల నెలా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బును సిప్ (SIP) రూపంలో పొదుపు చేస్తూ క్రమంగా పెంచవచ్చు. కాంపౌండింగ్ శక్తి కారణంగా వినియోగదారులు వేసే సిప్ భారీగా వృద్ధి చెందుతుంది. అది చివరకు పెద్ద మొత్తంగా మారుతుంది.

షార్ట్ కట్‌లు ఉండవు, దీర్ఘకాలమే మేలు..
నిపుణులు తెలిపిన ప్రకారం సంపదను సృష్టించేందుకు షార్ట్ కట్‌లు పనికిరావు. దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. సహనం, ఓపిక ఉండాలి. నెల నెలా కచ్చితంగా డబ్బును పొదుపు చేయాలన్న దృక్పథాన్ని ఎల్లవేళలా కలిగి ఉండాలి. దీని వల్ల 15 ఏళ్ల కాలవ్యవధిలో రూ.1 కోటి సంపాదించడం తేలికవుతుంది. మ్యుచువల్ ఫండ్స్ మాత్రమే కాకుండా బంగారంపై పెట్టుబడులు పెట్టినా ఎంతో రాబడి వస్తుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారు కేవలం సిప్‌లలో, మ్యుచువల్ ఫండ్స్ లంప్సమ్‌లలో మాత్రమే కాకుండా బంగారంపై కూడా పెట్టుబడులు పెట్టాలి. దీంతో భిన్న మార్గాల ద్వారా రాబడి వస్తుంది. దీర్ఘకాలంలో బంగారం కూడా మంచి రిటర్న్స్‌ను ఇస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బంగారంపై మంచి లాభాలను పొందవచ్చు. అయితే 15 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించడమే లక్ష్యమైతే 30 ఏళ్ల వయస్సులో నెలకు రూ.14,500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
బంగారంపై సగటున 10 శాతం లాభాలు..
గతేడాదిలో బంగారం ధరలు అసాధారణంగా పెరిగినప్పటికీ గత నివేదికలను పరిశీలిస్తే ఎప్పటికప్పుడు పసిడి ధరల్లో కరెక్షన్ జరుగుతుంది. అందువల్ల స్వల్పకాలంలో దీని ధరలు తగ్గి దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఉంటుంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు అంతర్జాతీయంగా పరిస్థితులను బేరీజు వేసుకుని బంగారంపై పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బంగారంపై రీసెర్చ్ సంస్థలు చేసిన అధ్యయనాల ప్రకారం ఈ లోహంపై పెట్టే పెట్టుబడులపై 10 శాతం మేర సగటున లాభాలు వస్తాయని తేలింది. కనుక స్థోమత ఉన్నవారు కేవలం మ్యుచువల్ ఫండ్స్‌లోనే కాకుండా పసిడిపైనా పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మ్యుచువల్ ఫండ్స్‌లో 12 శాతం రాబడి..
బంగారం పెట్టుబడిలో భాగంగా నెలవారి SIPలో నెలకు రూ.5వేలను 15 ఏళ్ల పాటు కడితే ఏటా 10 శాతం వృద్ధి చొప్పున మొత్తం రూ.20.08 లక్షలు రాబడి వస్తుంది. పెట్టిన పెట్టుబడి అందులో రూ.9 లక్షలు ఉంటుంది. ఇక ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ ఏడాదికి సగటున 12 శాతం మేర రాబడులను ఇస్తాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఇంకా అధిక మొత్తంలోనే రాబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మ్యుచువల్ ఫండ్స్ సిప్‌లో నెలకు రూ.9,500 కడితే ఏటా 10 శాతం మొత్తాన్ని నెలా నెలా పెంచుతూ పోతే 15 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి మొత్తం రూ.36.22 లక్షలు అవుతుంది. రాబడి 12 శాతం చొప్పున లెక్కిస్తే కాంపౌండింగ్ శక్తి కారణంగా 15 ఏళ్ల అనంతరం రూ.46 లక్షల మేర రిటర్న్స్ వస్తాయి. దీంతో మొత్తం కలిపి రూ.82.49 లక్షలు చేతిలో ఉంటాయి.
స్టెప్ అప్ విధానంలో సిప్ వేయాలి..
మ్యుచువల్ ఫండ్స్‌లో సిప్‌లలో పెట్టుబడి పెడితే స్టెప్ అప్ విధానంలో డబ్బును పొదుపు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 10 శాతం చొప్పున నెలవారి సిప్ మొత్తాన్ని పెంచుతూ 15 ఏళ్ల పాటు సిప్ కడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని వారు అంటున్నారు. పెంచిన 10 శాతం మొత్తం ద్రవ్యోల్బణం కింద పనిచేస్తుంది. ఆదాయం కూడా ఏటా 10 శాతం పెరిగితే ఆ మొత్తాన్ని నెల నెలా కట్టడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్రమంగా పెట్టుబడిని పెంచుతూ పోవచ్చు. అయితే మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా పెట్టినా మార్కెట్ స్థితిగతులు, ఫండ్ ఆఫర్ వివరాలను క్షుణ్ణంగా చదివి అందులో డబ్బులు పెట్టాలి. ఎవరో ఒకరు చెప్పారని వివరాలు తెలుసుకోకుండా డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. తెలియకపోతే నిపుణుల సూచనలు తీసుకోవాలి. ఇలా చేస్తే రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



