త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోక‌రేజీల‌ నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..

Stock Recommendation | భారత స్టాక్ మార్కెట్లలో గత వారం కూడా తీవ్ర ఒడిదుడుకులు కొనసాగాయి. నిఫ్టీ 50 వరుసగా ఏడో వారంలోనూ నష్టాలను నమోదు చేసింది. ఆరు సంవత్సరాల్లో ఇదే అత్యంత సుదీర్ఘ వారపు నష్టాల పరంపరగా నిలిచింది. గ‌త గురువారం నిఫ్టీ 50 ఏకంగా 1.64 శాతం పతనమై తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.

S

Business | Published On Sep 26, 2026, 1.26 pm IST

Stock Recommendation | ఈ 3 స్టాక్స్‌పై బ్రోక‌రేజీల‌ నజర్.. టార్గెట్, స్టాప్‌లాస్ ఇవే..
Advertisement

Stock Recommendation | భారత స్టాక్ మార్కెట్లలో గత వారం కూడా తీవ్ర ఒడిదుడుకులు కొనసాగాయి. నిఫ్టీ 50 వరుసగా ఏడో వారంలోనూ నష్టాలను నమోదు చేసింది. ఆరు సంవత్సరాల్లో ఇదే అత్యంత సుదీర్ఘ వారపు నష్టాల పరంపరగా నిలిచింది. గ‌త గురువారం నిఫ్టీ 50 ఏకంగా 1.64 శాతం పతనమై తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే శుక్రవారం విలువ ఆధారిత కొనుగోళ్లతో స్వల్పంగా కోలుకుంది. అయినప్పటికీ గత శుక్రవారం ముగింపుతో పోలిస్తే వారాంతానికి నిఫ్టీ 50 దాదాపు 0.88 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ బాండ్ మార్కెట్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. అమెరికా పదేళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్‌ వారంలో 5.10 శాతాన్ని దాటింది. అధిక బాండ్ ఈల్డ్‌లు ప్రపంచ ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేయడంతోపాటు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల ఆస్తుల ఆకర్షణను తగ్గించే అవకాశం ఉంది. అధిక చమురు ధరలు, పెరిగిన బాండ్ ఈల్డ్‌లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కలిసి వార మధ్యలో మార్కెట్లలో భారీ అమ్మకాలకు కారణమయ్యాయి.

ప్ర‌తికూల సంకేతాలు..

దేశీయ ఈక్విటీ మార్కెట్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రధాన ప్రతికూల అంశంగా మారాయి. సెప్టెంబర్ 25 వరకు ఈ నెలలో ఎఫ్‌ఐఐలు సుమారు రూ.18,531 కోట్ల నికర అమ్మకాలు చేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు రూ.52,617 కోట్ల విలువైన నికర కొనుగోళ్లు చేశారు. చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా భారత స్టాక్ మార్కెట్ సమీపకాల దిశను సైడ్ వేస్ నుంచి బేరిష్‌గా పేర్కొన్నారు. ఎలియట్ వేవ్ నిపుణుడైన ఆయన ప్రకారం నిఫ్టీ 50కి 22,900-23,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుంది. 23,300-23,370 స్థాయిలు కీలక నిరోధ ప్రాంతంగా ఉంటాయి. 23,370 పైన నిఫ్టీ నిలకడగా కొనసాగితే మరింత ఉన్నత స్థాయిల వైపు రికవరీకి అవకాశం ఉంటుందని బగాడియా తెలిపారు. అదే సమయంలో 22,900 కంటే దిగువకు నిర్ణయాత్మకంగా పడిపోతే అమ్మకాల ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉందన్నారు. తదుపరి సెషన్‌లో నిఫ్టీ 50 సూచీ 22,900-23,370 పరిధిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బ్యాంక్ నిఫ్టీకి కీలక స్థాయిలివే..

బ్యాంక్ నిఫ్టీకి సమీపకాలంలో 55,000-55,200 స్థాయిలు కీలక మద్దతు ప్రాంతంగా ఉంటాయని బగాడియా తెలిపారు. 55,750-56,000 స్థాయిలు తక్షణ నిరోధ ప్రాంతంగా పనిచేస్తాయ‌న్నారు. 56,000 పైన నిలకడగా కదలిక ఉంటే స్వల్పకాలిక ట్రెండ్ మెరుగుపడే అవకాశం ఉందని, 55,000 కిందకు పడిపోతే అమ్మకాల ఒత్తిడి పెరుగుతుంద‌ని వివరించారు. ఈ రెండు స్థాయిల్లో ఏదో ఒక వైపు నిర్ణయాత్మక బ్రేక్‌అవుట్ వచ్చే వరకు బ్యాంక్ నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే కొనసాగే అవకాశం ఉందన్నారు.

సుమీత్ బగాడియా సూచించిన 3 స్టాక్స్..

స్వల్పకాలిక పెట్టుబడుల కోసం సుమీత్ బగాడియా మూడు స్టాక్స్‌ను సూచించారు. మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లను పరిశీలించవచ్చని తెలిపారు. అయితే ఇవి వ్యక్తిగత పెట్టుబడి సలహాలు కావు, మార్కెట్ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున పెట్టుబడిదారులు తమ సొంత పరిశీలనతో నిర్ణయం తీసుకోవాలి. మహీంద్రా అండ్ మహీంద్రా షేరును రూ.3,035 వద్ద కొనుగోలు చేయవచ్చని, టార్గెట్ ధరను రూ.3,325గా, స్టాప్‌లాస్‌ను రూ.2,890గా బగాడియా సూచించారు. రూ.2,896-2,900 ప్రాంతంలో కీలక హారిజాంటల్ బేస్, స్వింగ్ లో సపోర్ట్‌ను పరీక్షించిన తర్వాత షేరు టెక్నికల్ రీబౌండ్‌కు ప్రయత్నిస్తోంది. షేరు రూ.3,035 వద్ద ముగిసింది. రోజువారీ చార్ట్‌లో రూ.3,550 ప్రాంతం నుంచి వచ్చిన తీవ్ర కరెక్షన్‌కు అడ్డుకట్ట పడడంతో బలమైన గ్రీన్ క్లోజ్‌తో బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. దీంతో తక్కువ స్థాయిల వద్ద కొనుగోలు ఆసక్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్..

ఏషియన్ పెయింట్స్‌ను రూ.2,444 వద్ద కొనుగోలు చేయవచ్చని, రూ.2,652 టార్గెట్‌తోపాటు రూ.2,340 స్టాప్‌లాస్‌ను బగాడియా సూచించారు. రూ.2,390-2,400 ప్రాంతంలో డబుల్ బాటమ్ బేస్ ఏర్పడిన తర్వాత షేరు రీబౌండ్‌కు ప్రయత్నిస్తోంది. షేరు దాదాపు రూ.2,444 వద్ద ముగిసింది. రూ.2,914.50 స్వింగ్ హై నుంచి వచ్చిన కరెక్షన్‌కు అడ్డుకట్ట పడడంతో డిమాండ్ జోన్ వద్ద బుల్లిష్ రివర్సల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఏర్పడింది. దీంతో దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.2,490.10 వద్ద ఉన్న స్వల్పకాలిక 20 ఈఎంఏ నిరోధాన్ని షేరు అధిగమించేందుకు ప్రయత్నిస్తోంద‌ని చెప్పారు. అలాగే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌ను రూ.1,258 వద్ద కొనుగోలు చేయవచ్చని, రూ.1,380 టార్గెట్‌తోపాటు రూ.1,195 స్టాప్‌లాస్‌ను బగాడియా సూచించారు. ఇటీవల రూ.1,200 ప్రాంతంలో స్వింగ్ లోను కాపాడుకున్న తర్వాత షేరు బేస్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. షేరు సుమారు రూ.1,258 వద్ద ముగిసింది. ఇటీవలి రూ.1,379.80 స్వింగ్ హై నుంచి వచ్చిన బలమైన పుల్‌బ్యాక్ తర్వాత ప్రస్తుతం కన్సాలిడేషన్ దశలో ఉంది. స్వల్పకాలిక, మధ్యకాలిక ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్‌ సమూహాన్ని షేరు ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఈ స్థాయికి పైన నిర్ణయాత్మక క్లోజింగ్ వస్తే మరోసారి బుల్లిష్ రికవరీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement
Advertisement